Take a fresh look at your lifestyle.

రాజ్యసభకు ఎన్నికల షెడ్యూల్‌ ‌విడుదల

From today .. Budget sessions of Parliament

  • తెలంగాణలో 2, ఏపీలో 4 స్థానాలకు ఎన్నికలు
  • మార్చి 6న నోటిఫికేషన్‌, 26‌న పోలింగ్‌

‌దేశంలోని 55 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. మొత్తం 17 రాష్ట్రాల నుంచి 55 రాజ్యసభ స్థానాలు ఏప్రిల్‌లో ఖాళీ కానున్నాయి. ఇందులో తెలంగాణలో 2, ఏపీలో 4 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి మార్చి 6న ఎన్నికల నోటిఫికేషన్‌ ‌వెలువడనుంది. 13న నామినేషన్ల స్వీకరణకు తుది గడువుగా నిర్ణయించారు. 16న రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన జరుగనుందగా, నామినేషన్ల ఉపసంహరణకు 18న తుది గడువుగా పేర్కొంది. మార్చి 26న 55 రాజ్యసభ స్థానాలకు పోలింగ్‌ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగనుంది. కాగా, ప్రస్తుతం తెలంగాణ నుంచి రాజ్యసభకు కెవిపి రాంచందర్‌రావు, గరికపాటి రామ్మోహన్‌రావు ప్రాతినిద్యం వహిస్తున్నారు. వీరి పదవీ కాలం ఏప్రిల్‌తో ముగియనుంది. ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా, ప్రస్తుతం ఆ రాష్ట్రం నుంచి కె.కేశవరావు, ఎంఏ ఖాన్‌, ‌టి.సుబ్బరామిరెడ్డి, తోట సీతామహాలక్ష్మి పదవీ కాలం ఏప్రిల్‌తో పూర్తి కానుంది. మరోవైపు, తెలంగాణలో ఖాళీ కానున్న రెండు స్థానాలను సైతం అధికార టీఆర్‌ఎస్‌ ‌పార్టీ కైవసం చేసుకోనుంది. మరే ఇతర పార్టీకి సరిపోను సంఖ్యాబలం లేని కారణంగా టీఆర్‌ఎస్‌ ‌పార్టీలో ఆశావహుల సంఖ్య భారీగానే ఉంది. ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు కేకేకు పార్టీ అధినేత సీఎం కేసీఆర్‌ ‌మరోసారి అవకాశం కల్పిస్తారా అనే చర్చ పార్టీలో జరుగుతున్నది. సీఎం కేసీఆర్‌ ‌కూతురు నిజామాబాద్‌ ‌మాజీ ఎంపీ కవితకు రాజ్యసభ బెర్త్ ‌ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. ఖమ్మం నుంచి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌ ‌కుమార్‌, ‌మహబూబాబాద్‌ ‌నుంచి సీతారాంనాయక్‌, ‌మాజీ స్పీకర్‌ ‌మధుసూధనాచారి కూడా రాజ్యసభ సీట్ల కోసం పోటీపడుతున్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!