Take a fresh look at your lifestyle.

జిఎస్టీ బకాయిలు వెంటనే విడుదలచేయండి

కేంద్రాన్ని డిమాండ్‌ ‌చేసిన మంత్రి హరీష్‌ ‌రావు

కేంద్రమే జీఎస్టీ పరిహారం మొత్తం అప్పు తీసుకుని రాష్ట్రాలకు చెల్లించాలి అని ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ ‌రావు డిమాండ్‌ ‌చేశారు. కోవిడ్‌ ‌పరిస్థితుల్లో ఈ మొత్తం రాష్ట్రాలకు అత్యంత అవసరం అని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌నేతృత్వంలో జీఎస్టీ కౌన్సిల్‌ ‌సమావేశం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా జరిగిన 42వ జీఎస్టీ కౌన్సిల్‌ ‌సమావేశంలో ఆయా రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు. బీఆర్కే భవన్‌ ‌నుంచి తెలంగాణ తరపున ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు,సిఎస్‌ ‌పోమేశ్‌ ‌కుమార్‌ ‌తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. జీఎస్టీ పరిహారం మొత్తం కేంద్రమే చెల్లించాలన్నారు. పరిహారం పోందడం రాష్టాల్ర చట్టబద్ధమైన హక్కు అని పేర్కొన్నారు.

release gst dues immediately finance minister hareesh rao demands to central

ఐజీఎస్టీ కింద రాష్ట్రాలకు రావాల్సిన మొత్తం వెంటనే చెల్లించాలన్నారు. ఈ ఏడాది ఆరు నెలల సెస్‌ ‌వసూలు చేశారు. కేంద్రం చెల్లించాల్సిన మూడు ఇన్‌స్టాల్‌ ‌మెంట్స్ ‌పెండింగ్‌లో ఉన్నాయి. ఈ మొత్తం రాష్ట్రాలకు వెంటనే పంచాలి అని హరీష్‌ ‌రావు డిమాండ్‌ ‌చేశారు. ఐజీఎస్టీ కింద తెలంగాణకు రావాల్సిన రూ.2638 కోట్లు వెంటనే విడుదల చేయాలి అని మంత్రి హరీష్‌ ‌రావు ఐజీఎస్టీ గ్రూప్‌ ఆఫ్‌ ‌మినిస్టర్స్ ‌సమావేశంలో డిమాండ్‌ ‌చేసిన విషయం తెలిసిందే. ఈ సమావేశం అక్టోబర్‌ 1‌వ తేదీన జరిగింది. గతంలో ఈ మొత్తాన్ని 25 వేల 58 కోట్లు కన్సాలిడేటెడ్‌ ‌ఫండ్‌ ‌లో నిబంధలకు విరుద్ధంగా జమ చేశారన్న విషయాన్ని పార్లమెంట్‌ ‌లో కాగ్‌ ఎత్తి చూపిన న విషయాన్ని ఈ సమావేశంలో మంత్రి హరీశ్‌ ‌రావు ప్రస్తావించారు. కాగ్‌ ‌సైతం ఈ విషయంలో తప్పు పట్టింది కాబట్టి ఎలాంటి చర్చ లేకుండా రాష్టాల్రకు ఈ మొత్తాన్ని ఇవ్వాలన్న సిఫారసును గ్రూప్‌ ఆఫ్‌ ‌మినిస్టర్స్ ఈ ‌నెల ఐదో తేదీన జరిగే జీఎస్టీ కౌన్సిల్‌ ఎజెండాలో ఉండేలా చూడాలని కోరారు.

Leave a Reply