Take a fresh look at your lifestyle.

లాక్‌డౌన్‌ ‌వేళ 20 నుంచి సడలింపు మార్గదర్శకాలు

  • వ్యయసాయ,ఉపాధి రంగాలకు అనుమతి
  • విద్యాసంస్థలు, మాల్స్ ‌మూసివేత యధాతథం
  • మత ప్రార్ధనలకు అనుమతి లేదు.
  • అంత్యక్రియలకు 20కి మించి అనుమతి నిరాకరణ
  • పబ్లిక్‌ ‌ప్లేసుల్లో ముఖానికి మాస్కు తప్పనిసరి

దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్‌డౌన్‌ ‌కొనసాగనున్న నేపథ్యంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. హాట్‌స్పాట్‌ ‌ప్రాంతాల్లో ప్రత్యేక మార్గదర్శకాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేస్తుందని ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో సాధారణ మార్గదర్శకాలు, అనుమతులు పనిచేయవని, నిత్యావసరాల పంపిణీ మినహా ఎలాంటి కార్యకలాపాలు ఉండవని తెలిపింది. మే 3 వరకు అన్ని విమానాలు, రైళ్లు, బస్సులు, మెట్రో రైల్‌ ‌సర్వీసులు రద్దు చేస్తున్నామని వెల్లడించింది. విద్యాసంస్థలు, శిక్షణా కేంద్రాలు, సినిమాహాళ్లు, షాపింగ్‌ ‌మాల్స్, ‌స్పోర్టస్ ‌కాంప్లెక్సులు, ఈత కొలనులు, బార్లు మూసిఉంటాయని పేర్కొంది. మత ప్రార్థనలు, దైవ కార్యక్రమాలను రద్దు చేస్తున్నామని, అంత్యక్రియలు, ఇతర కార్యక్రమాలకు 20 మందికి మించి పాల్గొనడానికి అనుమతి లేదని తెలిపింది. ఏప్రిల్‌ 20 ‌నుంచి వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, క్రయవిక్రయాలకు మండీలకు అనుమతిస్తామని వెల్లడించింది. వైద్య సేవలకు తప్ప మిగిలిన వాటికి వ్యక్తులు ఎట్టిపరిస్థితుల్లో సరిహద్దులు దాటకూడదని పేర్కొంది. నిబంధనల మేరకు నిర్దేశిత సరిశ్రమలు, వాణిజ్య సంస్థలకే అనుమతులు లభిస్తాయని తెలిపింది.

- Advertisement -

విపత్తుల నిర్వహణ చట్టం-2015 ప్రకారం మార్గదర్శకాలను పాటించాలని పేర్కొంది. రాష్ట్రప్రభుత్వాలు, స్థానిక యంత్రాంగం మార్గదర్శకాలను అమలుచేయాలని వెల్లడించింది. ఆస్పత్రులు, టెలీమెడిసిన్‌ ‌సర్వీసులు, ఆరోగ్య పరీక్ష కేంద్రాలు, ఔషధ దుకాణాలు, ఔషధ పరిశ్రమలు, పరిశోధన కేంద్రాలు యథాతథంగా నడుస్తాయని తెలిపింది. వ్యవసాయ, ఉద్యాన కార్యకలాపాలకు అనుమతించింది. వ్యవసాయ పరికరాలు, విడిభాగాల దుకాణాలు తెరిచేందుకు, వ్యవసాయ యంత్ర పరికరాలు కిరాకిచ్చే సంస్థలకు, విత్తనోత్పత్తి సహా పురుగుల మందుల దుకానాలకు అనుమతించింది. బహిరంగ, పని ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరని, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేస్తే జరిమానా విధిస్తామని ప్రకటించింది. ఏప్రిల్‌ 20‌వ తేదీ తర్వాత ఉపాధి హా పనులకు అనుమతులు ఇచ్చింది కేంద్రం. ఉపాధి హా కూలీలు భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. గ్రాణ ప్రాంతాల్లో రోడ్లు, సాగునీటి, పారిశ్రామిక ప్రాజెక్టుల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు. భవన నిర్మాణ రంగానికి షరతులతో కూడిన అనుమతులు ఇస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది కేంద్రం. పట్టణ ప్రాంతాల్లో భవన నిర్మాణాలకు అందుబాటులో ఉన్న కూలీలతోనే పనులను చేయించుకోవాలి. ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తరలించేందుకు అనుమతి నిరాకరించారు. ప్రింట్‌ అం‌డ్‌ ఎలక్టాన్రిక్‌ ‌డియా, డీటీహెచ్‌, ‌కేబుల్‌ ‌సర్వీసులు యథాతథంగా నడవనున్నాయి. ఐటీ సంస్థలు, ఐటీ సేవలకు 50 శాతం సిబ్బందితో నిర్వహణకు అనుమతి ఇచ్చారు. ఈ-కామర్స్ ‌సంస్థలు, వాహనాలకు అనుమతి లభించింది. గోదాములు, శీతల గోదాములకు అనుమతి. ఎలక్టీష్రియన్లు, ఐటీ రిపేర్లు, ప్లంబర్స్, ‌మోటార్‌ ‌మెకానిక్స్, ‌కార్పెంటర్ల సేవలకు కేంద్రం అనుమతి ఇచ్చింది.

Leave a Reply