Take a fresh look at your lifestyle.

అస్మదీయులకు సడలింపులు..తస్మదీయులకు బిగింపులు న్యాయం అన్యాయమై పోతున్నది

“కోరేగావ్‌ ‌హింసా కాండ జరిగి మూడేళ్ళు గడుస్తున్నా ఒక్క అభియోగం తేల్చి చెప్పే వ్యక్తులు, సంఘటనలకూ ఆధారాలు లేవు. సాయుధ శిక్షణ కోసం సుధా భరద్వాజ్‌ ‌యువతులెవరిని ఎంపిక చేసిందీ, ఎవరికి ఎక్కడ శిక్షణ ఇచ్చిందీ, ఎక్కడ బాంబులు పెట్టిందీ, మందుపాతరలు సిద్ధం చేసిందీ.. ఆధారాలు లేవు. ఒక్క ఆయుధాన్ని కాని, బాంబు కాని,  మందుపాతర సామగ్రికానీ కనుగొన్నదీ, స్వాధీనం చేసుకున్నదీ లేదు. ప్రధానిపై హత్యాప్రయత్న అభియోగానికి కుట్ర జరిగిందనడానికి వీసమెత్తు ఆధారం లేక చివరకు దర్యాప్తు సంస్థలు అభియోగాన్నే ఉపసంహరిచుకున్న విషయం తెలిసిందే. పోలీసుల(ప్రభుత్వ) అభియోగాలాన్నీ అసత్యాలే.”

వడ్డించేవాడు మనవాడైతే కడపంక్తిలో కూడా ఎక్కడ కూర్చున్నా పంచభక్ష్యాదులు విస్తరిలో అమరుతాయి అని అన్నారు. చట్టమూ అంతే. చట్టాన్ని చట్రం లో బిగించి అస్మదీయులకు సడలించి తస్మదీయులకు మరింత గట్టిగా బిగించడం అధికారం లక్షణం. అధికారంలో ఉంటే న్యాయాన్ని బంధించడం తేలిక. రెండేళ్ళ నుంచీ 130 మందికోట్ల భారత పౌరులు తెలుసుకున్న సత్యం ఇదే అనడంలో సందేహం లేదు. 2017 డిసెంబర్‌ 31‌న పుణె లో జరిగిన ఎల్గార్‌ ‌పరిషద్‌ ‌సమావేశంలో చేసిన ఉద్రేకపూరిత ప్రసంగాల ఫలితంగానే జనవరి ఒకటో తేదీ భీమా కోరేగావ్‌ ‌వార్‌ ‌మెమోరియల్‌ ‌వద్ద ఘర్షణలు జరిగాయన్న అభియోగంపై ప్రముఖ విద్యావేత్తలు కవులు కళాకారులు మేధావులు అరెస్టు కావడం సంచలనం కలిగించడం ఒక ఎత్తైతే 2018 ఆగస్ట్ 28‌న మానవహక్కుల పరిరక్షణ ఉద్యమ నేతలు ఎనభై ఏళ్ళ కవి వరవర రావు సహా సుధా భరద్వాజ్‌, ‌రోనా విల్సన్‌, ‌గౌతమ్‌ ‌నవ్‌లఖా, అరుణ్‌ ‌ఫెరీరా, వెర్మన్‌ ‌గోంజాల్వెస్‌ ‌తదితరులు పదిమందికిపైగా అరెస్టయి నేటికీ జైళ్లలో మగ్గుతునే ఉన్నారు. అనారోగ్యం పాలైనా, నెలల తరబడి మౌనపోరాటం మినహా మరో మార్గం లేకపోతున్నది. ఇన్నేళ్ళయినా వారిపై చేసిన నేర అభియోగాల్లో ఒక్కటికూడా విచారణ, దర్యాప్తు సంస్థలు రుజువు పరచలేకపోయినా కనీసం ఆ రుజువులేమిటో కూడా ప్రపంచానికి చెప్పగలిగే స్థితిలో ప్రభుత్వం లేకపోవడం విచారకరం.

రెచ్చగోట్టి మారణకాండకు హేతు వయ్యారన్న  పలునేర అభియోగాలపై వరవర రావు సహా ఇరువురు ఇంగ్లీష్‌ ‌ప్రొఫెసర్లు, గిరిజన హక్కుల పరిరక్షకులు, రచయితలు, కార్టూనిస్టులు  సంస్కర్తలు, కార్మిక నేతలు, ప్రజాస్వామ్య పరిరక్షకులు, ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురై దుర్భర జీవితాలు గడుపుతున్న పేదలకోసం జీవితాలు త్యాగం చేసిన వరవర రావు, సోమా సేన్‌, ‌హానీ బాబు, జ్యోతి రఘోబ జగ్‌తాప్‌, ‌సాగర్‌ ‌తాత్యారాం గోరే?, రమష్‌ ‌మురళిధర్‌ ‌గాయ్‌చొర్‌, ‌సుధీర్‌ ‌ధవలే, సురేంద్ర గాడ్లింగ్‌, ‌మహేష్‌ ‌రౌత్‌, ‌సోమసేన్‌, ‌రోనా విల్సన్‌, అరుణ్‌ ‌ఫెరిరా, సుధ భరద్వాజ్‌, ‌వెర్నన్‌ ‌గాన్‌ ‌సాల్వెస్‌, ఆనంద్‌ ‌తెల్‌తుంబ్డె, గౌతం నవ్లేఖ.. ఇలా అందరూ న్యాయ చట్రంలో బిగుసుకుపోయారు,  వీరితోపాటు ఢిల్లీ యూనివర్సిటీ ఇంగ్లీష్‌ ‌ప్రొఫెసర్‌ ‌జి ఎన్‌ ‌సాయిబాబా తదితరులు ప్రభుత్వంపై తిరుగుబాటుకు కుట్రపన్నారన్న నేరారోపణపై కటకటాలపాలైతే.. అన్నెపున్నెం ఎరుగని అనేకమంది కడు బీద గ్రామీణులపై నక్సలైట్లన్న  ముద్రతో జైళ్లలో మగ్గుతున్నారు.

మేధావులు, విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులు, కవులను ప్రభుత్వాల కూల్చివేత కుట్రదారులుగా అభివర్ణించి, ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలపై విషం కక్కుతూ ప్రజలలో తిరుగుబాటు చేయించి, రక్షణ దళాలపై పోరాటానికి ఆయుధాలు సమకూర్చుకొనడమేకాకుండా … చివరకు మానవబాంబు ప్రయోగించి దేశ ప్రధానినే హతమార్చే కుట్రకు పాల్పడ్డారన్న తీవ్ర అరోపణలకింద దీర్ఘకాలంగా నిర్బంధంలో ఉంచిందీ ప్రభుత్వం. ఇంతేకాదు.. ప్రభుత్వ వ్యతిరేక అసాంఘిక కార్యకలాపాలకు ధన సేకరణ, సైద్ధాంతికంగా యువతను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టి గెరిల్లా యుద్ధ విద్యలో శిక్షణకు ఉద్యుక్తులవుతూ ప్రణాళికలు రూపొందిస్తున్నారని వృద్ధ రచయితలు, కవులు, విద్యావేత్తలపై అభియోగాలు కూడా నమోదయ్యాయి. కడిగిన ముత్యంలాంటి సుధా భరద్వాజ్‌ ‌మహిళా మావోఇస్టుల సమావేశానికి హాజరై అక్కడ వారికి ల్యాండ్‌ ‌మైన్స్ ఏర్పాటులో శిక్షణ ఇస్తూ ప్రసంగాలు చేసారన్న అభియోగాలు మోపడం నమ్మశక్యంకాని వింతధోరణి అభూత కల్పనలే నన్న విషయం ప్రపంచానికి తెలిసిందే.

అసలు ఈ ఘోర అభియోగాలలో కనీసం ఒక్కటంటే ఒక్క సాక్ష్యమైనా ఉందా అంటే ప్రభుత్వం నోరుమెదిపే ధైర్యమే లేదు. అన్ని ఆరోపణలు ఊహాజనిత, కాల్పనిక కథలే. పోలీసు, ఇతర విచారణ దర్యాప్తు సంస్థలు  పేర్కొంటున్న లేఖలకు ఒక్క టైనా ఇతమిద్ధమైనా ఆధారం, సాక్షం లేదు. తమకు లభించినట్లు దర్యాప్తు వర్గాలు చెబుతునా లేఖలకు అసలు ‘‘వాస్తవ లేఖలు’’  లేవు, అవి రాసిన తేదీలకూ, రాసినట్లు పేర్కొంటున్న వ్యక్తులెవరో, ఎవరికి రాశారో తేల్చే రుజువు, ఆధారాలు శూన్యం. హత్యాభియోగం  ఉంటే అసలు జరగని హత్య జరిగిందనడానికి నిర్ధారించేందుకు ఒక్క ఆధారమూ చూపలేరు. ఎవరు ఎవరిని ఎప్పుడు ఎక్కడ హత్య చేసిందనడానికీ ఒక్క సాక్షమూ ఉండదు. అయినా సరే విచారణ దర్యాప్తు సంస్థలు తీవ్ర అభియోగాలతో కేసులు సాగదీస్తాయి.

కోరేగావ్‌ ‌హింసా కాండ జరిగి మూడేళ్ళు గడుస్తున్నా ఒక్క అభియోగం తేల్చి చెప్పే వ్యక్తులు, సంఘటనలకూ ఆధారాలు లేవు. సాయుధ శిక్షణ కోసం సుధా భరద్వాజ్‌ ‌యువతులెవరిని ఎంపిక చేసిందీ, ఎవరికి ఎక్కడ శిక్షణ ఇచ్చిందీ, ఎక్కడ బాంబులు పెట్టిందీ, మందుపాతరలు సిద్ధం చేసిందీ.. ఆధారాలు లేవు. ఒక్క ఆయుధాన్ని కాని, బాంబు కాని,  మందుపాతర సామగ్రికానీ కనుగొన్నదీ, స్వాధీనం చేసుకున్నదీ లేదు. ప్రధానిపై హత్యాప్రయత్న అభియోగానికి కుట్ర జరిగిందనడానికి వీసమెత్తు ఆధారం లేక చివరకు దర్యాప్తు సంస్థలు అభియోగాన్నే ఉపసంహరిచుకున్న విషయం తెలిసిందే. పోలీసుల(ప్రభుత్వ) అభియోగాలాన్నీ అసత్యాలే. భారతదేశంలో అమలులో ఉన్న చట్టం ప్రకారం ఇంతమంది మేధావులు, కవులు, హక్కుల పరిరక్షకులపై చేసిన ఆరోపణలలో ఏఒక్కటీ న్యాయస్థానంలో నిలబడదని ప్రభుత్వ యంత్రాంగానికీ, న్యాయస్థానాలకు, న్యాయవాదులకు, న్యాయమూర్తులకే కాదు సామాన్యులకు కూడా స్పష్టంగా తెలుసు. యంత్రాంగం తమవద్ద ఉన్నవని చేబుతున్న సాక్షాలకు విలువలేదనీ వారికి తెలుసు. అవాస్తవమైన అభూత కల్పనలు రుజువు చేసేందుకు సాక్షాలు ఎలా ఉంటాయి. ఇంత మంది మేధావులను ఇరికిస్తూ పోలీసులు తమకు లభించిన లేఖలుగా పేర్కొంటున్నవాటికి మూలాలు చూపే అధారాలు లేక రోజుకో కథ చేబుతున్నారనేది నిజం. న్యాయం, చట్టం ముందు అభూతకల్పన ఆరోపణలకు ఆధారాలు లేకనే కాలం సాగదీస్తున్నారన్నది అందరి అనుమానం. అధికారం ఉంది గనుక తమను వ్యతిరేకించే వ్యక్తులు, సంస్థలపై ఎప్పుడైనా, ఏ సందర్భంలోనైనా కేసులు పెట్టగలరు. ఆ సందర్భాలలో నిర్ణీత గడువును మించి పోలీసు కస్టడీ ఇష్టానుసారం పొడిగించుకుంటారు. కేసు ఎ ఫ్‌ ఐ ఆర్‌ ‌నమోదు, చార్జ్ ‌షీట్‌ ‌గడువు కూడా దర్యాప్తు కొనసాగింపు పేరిట ఎప్పటికప్పుడు పొడిగి ంచుకుంటూ నిందితులను దీర్ఘ కాలం బందీలు చేస్తారు. బెయిల్‌ ‌మంజూరు విషయం కూడా జాప్యానికి అనేక లొసుగులు వాడుకుంటారు.

ప్రభుత్వం తమపై చేసిన అభియోగాలకు సమాధానం చెప్పి తమకు అనుకూల సాక్షాలను పోది చేసుకునే అవకాశం లభించకే అనేకమంది బెయిల్‌ ‌కూడా దక్కక బందీలుగానే మిగిలిపోతున్నారు. పెడరెక్కలు వెనుకకు విరిచి కట్టేసిన నిందితుడు తాను నిరపరాధిగా సాక్షాలు చూపి, ఎలా వాదనలు వినిపించే పోరాటం చేయగలడు. ప్రభుత్వం చెప్పిందే చట్టం అనే వాతావరణంలో మనం  మరో మార్గం లేక కష్టంగా జీవిస్తున్నాం. జాతి భద్రత పేరిట న్యాయ స్థానాలు సయితం నిస్సహాయంగా వ్యవహరిస్తున్నాయనడం బాధాకరమే. టాడా, పోటా చట్టం మాదిరే యు ఎ పి ఎ చట్టంకూడా కేసు పూర్తయ్యేవరకూ నిందితునికి బెయిల్‌ ‌మంజూరు కాకుండా అమలవుతున్నాయి. న్యాయం అన్యాయమై పోతున్నది. చట్టం కొందరికే చుట్టమ వుతున్నదనండం అతిశయోక్తి కాదేమో. ప్రభుత్వం తన ప్రజలపై చట్టం పేరిట సాగిస్తున్న కుతంత్రం  చట్టాన్నే కాకుండా తనకు తాను, చట్టాన్నీ కూడా కించపరచుకుంటూ అప్రతిష్ఠ పాలవుతున్నదని గమనించడంలేదు.

వ్యాస రచయిత:
వ్యాస రచయిత  యుగ్‌ ‌మొహిత్‌ ‌చౌధ్రి ముంబైలో ప్రసిద్ధి చెందిన క్రిమినల్‌ ‌న్యాయవాది. భారతదేశంలో మరణ శిక్ష రద్దుకోసం ఉద్యమించిన వ్యక్తి. న్యాయవాది వృత్తికి మునుపు ఆయన ఆంగ్ల సాహిత్యంలో డాక్టర్‌ ఆఫ్‌ ‌ఫిలాసఫి  చేసారు. ఐరిష్‌ ‌సాహితీ వేత్త ఈట్స్, ‌పాలిటిక్స్ ఆఫ్‌ ‌ప్రింట్‌.. ‌గ్రంథాలు రాసారు. భీమ కొరేగావ్‌ ‌కేసులో అరేస్టయిన 16మందిలో గౌతం నవ్లేఖ, హానీ బాబు, సుధా భరద్వాజ్‌,  ఈ ‌ముగ్గురి తరఫున న్యాయస్థానంలో వాదిస్తున్నారు.
– యుగ్‌ ‌మొహిత్‌ ‌చౌధ్రి.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply