Take a fresh look at your lifestyle.

కొరోనా అని చెప్పి చంపేశారు..

  • చనిపోయిన రిపోర్టులో కరోనా నెగెటివ్‌
  • ఆసుపత్రి సిబ్బంది తీరును నిరసిస్తూ బంధువుల ఆందోళన

కరోనా బూచి చూపి రోగాన్ని నిర్ధారించకుండానే కరోనా లక్షణాలున్నాయని వేరే ఆసుపత్రికి రిఫర్‌ ‌చేసి ఒక మహిళను మానసిక వ్యధకు గురి చేసిన సంఘటన గోదావరిఖనిలో చోటు చేసుకుంది. చివరకు కరోనా వ్యాధి లేకున్నా మానసిక ఆందోళనతో తనువు చాలించాల్సిన దురవస్థను ఎదుర్కొనాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే ఆర్జీ-1లో బొగ్గు విశ్లేషణాత్మక రిజనల్‌ ‌ప్రయోగశాలలో విధులునిర్వహిస్తున్న ఒక ఉద్యోగి గత నెల 28న అనారోగ్యంతో భాదపడుతూ స్థానిక సింగరేణి ఆసుపత్రిలో చికిత్సకోసం రాగా ఆమెకు కరోనా లక్షణాలున్నాయని వేరే ఆసుపత్రికి వెళ్ళాలని రిఫర్‌ ‌లెటర్‌ అం‌దజేసి పంపించారు.

కాగా ఆమె కరీంనగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి వెళ్ళినా చికిత్స అందించడానికి నిరాకరించగా చివరకు కరీంనగర్‌ ‌ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. కరోనా ఉన్నదన్న ఉద్దేశ్యంతో ఆమె వ్యాధిని గుర్తించకుండా, సమయానికి సరైన వైద్యం అందించకుండానే కరోనా పరీక్షలకు పంపించారు. చివరకు మానసిక ఆందోళనకు గురైన ఆమె తనువు చాలించింది. తీరా పరీక్షలు వచ్చే సదరు మహిళకు కరోనా నెగెటివ్‌ అని తేలింది. అయితే సింగరేణి వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు కరోనా పాజిటివ్‌ అని సామాజిక మాద్యమాల్లో ప్రచారం చేయడంతో ఆమె మానసికంగా కుంగిపోవడం జరిగిందని, ఆమె ప్రాణాలు కోల్పోవడానికి వైద్యులు కారణమని ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. ఈమె నమూననాను 29న నిర్ధారణకుపంపిచారు.

Leave a Reply

error: Content is protected !!