Take a fresh look at your lifestyle.

వ్యవస్థలో మార్పుతో పటిష్ట పాలన

  • ఏడాదిలోనే 90శాతం హాల అమలు
  • గ్రామసచివాలయ వ్యవస్థతో ప్రజల ముంగిటికే పథకాలు
  • ప్రతిలబ్దిదారుడికి మేలు కలిగేచాల చర్యలు
  • మద్యనిషేధం అమలు దిశగా పటిష్టమైన చర్యలు
  • మన పాలన-  సూచన’ పేరుతో మేథోమధన సదస్సు
  • క్యాంపు కార్యాలయం నుంచి సిఎం జగన్‌ ‌సమీక్ష

అమరావతి,మే 25 : ఏడాది పాలనలో 90శాతం హాలు నెరవేర్చడం ద్వారా ప్రజలకు సమర్థ పాలన అందించగలిగామని సిఎం వైఎస్‌ ‌జగన్‌ అన్నారు. వ్యవస్థలో మార్పు తీసుకువస్తేనే తప్ప, ప్రజలను మనం ఆదుకోలేమనే భావన కలిగిందని, సుపరిపాలన అందించేందుకు ఒక వ్యవస్థను తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆ వ్యవస్థే.. గ్రామ సచివాలయ వ్యవస్థ అని ఆయన పేర్కొన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందనిజగన్‌ ‌ప్రశంసించారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు గ్రామ వాలంటీర్లు, ఆశా వర్కర్ల వ్యవస్థ ద్వారా వైరస్‌ ‌నియంత్రణ చర్యలు చేపట్టామన్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కాలంగా అమలు చేసిన కార్యక్రమాలు, పథకాలు.. ఆయా రంగాల్లో తీసుకువచ్చిన మార్పులు, భవిష్యత్‌లో చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌ అధ్యక్షతన తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ’మన పాలన- సూచన’ పేరుతో మేథోమధన సదస్సు సోమవారం ప్రారంభించారు. ఈ సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌ ‌మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో ఎవరికీ అన్యాయం జరగకూడదనే సోషల్‌ ఆడిట్‌ను ఏర్పాటు చేశామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి వ్యాఖ్యానించారు. లబ్దిదారుల సోషల్‌ అడిట్‌ ‌కోసం గ్రామ సెక్రటేరియట్స్‌లో పూర్తి ప్రదర్శనకు శ్రీకారం చుట్టామని సీఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మొదటి ఏడాదిలో జరిగిన సంక్షేమం.. సంస్కరణలపై జగన్‌ ‌సక్ష నిర్వహించారు. అన్ని జిల్లా కేంద్రాల నుంచి లబ్దిదారులు, నిపుణులు, ప్రముఖులతో సీఎం సక్ష నిర్వహించారు. ఆరు రోజుల పాటు ఈ మేధోమథన సదస్సులు జరగనున్నాయి. తొలు పరిపాలన-సంక్షేమంపై సక్ష నిర్వహించారు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నామని.. మొదటి సంవత్సరంలోనే 90శాతం మేనిఫెస్టో హాలను అమలు చేశామని అని జగన్‌ ‌స్పష్టం చేశారు. ’ఎన్నికల ముందు 14 నెలల పాటు పాదయాత్ర చేశాను. పాదయాత్రలో ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజలతో మమేకమయ్యాను. వివక్షలేని పాలన అందించాలని గట్టిగా నమ్మాను. మనసా, వాచా, కర్మణా నీతివంతంగా పాలన అందించడమే నా థ్యేయం. ఏ లబ్దిదారుడికి అన్యాయం జరగకుండా గ్రామ సచివాలయ వ్యవస్థను రూపొందించాం. చివరి లబ్దిదారుడి వరకు అందరికీ న్యాయం చేసేందుకు విప్లవాత్మక మార్పులు తెచ్చాం. ప్రజల ఇంటి ముందుకే సంక్షేమ ఫలాలు అందిస్తున్నాం. గ్రామ సచివాలయాల ద్వారా లక్షా 35వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్‌ను నియమించాం. ప్రజలందరూ సంతృప్తి చెందే స్థాయిలో గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశాం.

గతంలో లంచమిస్తే తప్ప పెన్షన్‌ ‌రాని పరిస్థితి ఉండేది. ప్రతినెలా ఒకటో తారీఖు ఉదయాన్నే చిరునవ్వుతో పెన్షన్‌ అం‌దిస్తున్నాం. గ్రామ వాలంటీర్లు, ఆశా వర్కర్ల కృషి వల్లే సమర్థంగా కోవిడ్‌ను ఎదుర్కోగలిగాం’ అని వైఎస్‌ ‌జగన్‌ ‌చెప్పుకొచ్చారు. ’మద్యం నియంత్రణ కోసం రేట్లను భారీగా పెంచాం. గతంలో వారానికి ఐదుసార్లు తాగేవాళ్లు ఇప్పుడు రెండుసార్లే తాగుతున్నారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు 24శాతం తగ్గాయి. ప్రతి గ్రామంలో ఇంగ్లీష్‌ ‌డియం స్కూల్స్ ‌తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. 54 రకాల మందులు గ్రామస్థాయిలో అందుబాటులో ఉంచబోతున్నాం. వైఎస్సార్‌ ‌విలేజ్‌ ‌క్లినిక్‌ ‌ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందించబోతున్నాం. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తూ జనతా బజార్లు ఏర్పాటు చేస్తున్నాం’ అని జగన్‌ ఈ ‌సందర్భంగా స్పష్టం చేశారు. ’14 నెలలపాటు నా పాదయాత్ర 3,648 కిలోటర్లు సాగింది. పాదయాత్రలో ప్రజల కష్టాలు గమనించా. ప్రభుత్వం ఏర్పడ్డాక సుపరిపాలన అందించేందుకు ఒక వ్యవస్థను తీసుకొచ్చాం. ఆ వ్యవస్థే.. గ్రామ సచివాలయ వ్యవస్థ. ప్రతి లబ్దిదారుడికి న్యాయం జరిగేలా చూస్తున్నామని అన్నారు. లబ్దిదారుల జాబితాను గ్రామ సచివాలయంలో ఉంచుతున్నాం. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి నుంచి నేరుగా ఇంటివద్దకే సేవలు అందేలా చేశాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీలకు వాలంటీర్ల వ్యవస్థలో 82 శాతం అవకాశం కల్పించామన్నారు. ఏడాది కాలంలో 4 లక్షల ఉద్యోగాలు కల్పించాం. అవినీతి లేని పారదర్శకత ఉన్న వ్యవస్థ.. గ్రామ సచివాలయ వ్యవస్థ. గ్రామ సచివాలయ వ్యవస్థ అద్భుతంగా పని చేస్తోంది. గ్రామ సచివాలయాలతో ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అవ్వా తాతలకు నేరుగా ఇంటివద్దకే పెన్షన్‌ అం‌దిస్తున్నాం. మత్స్యకార భరోసా, వాహనమిత్ర, వైఎస్‌ఆర్‌ ‌భీమా పథకాలు తీసుకొచ్చాం. వాలంటీర్లు, ఆశావర్కర్ల వ్యవస్థ ద్వారానే కరోనాను నియంత్రణ చర్యలు చేపట్టాం. మూడుసార్లు కుటుంబ సమగ్ర సర్వే నిర్వహించామని వివరించారు. ప్రభుత్వం తీసుకున్నచర్యల కారణంగా మద్యపానం తగ్గిందని, ప్రజలు నియంత్రణ పాటిస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో 43 వేల బెల్టు షాపులను తొలగించామని, మద్యం అమ్మకాల్లో ప్రైవేట్‌ ‌వ్యక్తులను కూడా తొలగించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. షాక్‌ ‌కొట్టే విధంగా మద్యం ధరలు పెంచడంతో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయన్నారు. నాడు- నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరిస్తున్నామని, ప్రతి గ్రామంలో ఇంగ్లీషు డియం తీసుకొచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.

త్వరలోనే వైఎస్సార్‌ ‌విలేజ్‌ ‌క్లినిక్‌లను ప్రారంభిస్తామన్నారు. 24 గంటలపాటు గ్రామాల్లో వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు ప్రారంభిస్తున్నామని, రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను రైతు భరోసా కేంద్రాల ద్వారా అందిస్తామని సీఎం జగన్‌ ‌పేర్కొన్నారు. రైతులు ఎలాంటి పంటలు వేసుకోవాలో వ్యవసాయ నిపుణుల ద్వారా సలహాలు, సూచనలు అందిస్తామని వెల్లడించారు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతుల పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, త్వరలో గ్రామాల్లో జనతా బజారు తీసుకొస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌ ‌భరోసా ఇచ్చారు. మన పాలన – సూచన పేరుతో చేపట్టిన సదస్సులో శ్రీకాకుళం నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌తో స్పీకర్‌ ‌తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన కృష్ణ దాస్‌, ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.విశాఖ నుంచిమంత్రి అవంతి శ్రీనివాస రావు, అరకు ఎంపి గొట్టేడి మాధవి, విశాఖ కలెక్డర్‌ ‌వినయ్‌ ‌చంద్‌, ‌విఎంఆర్డిఎ చైర్మన్‌ ‌ద్రోణంరాజు శ్రీనివాస్‌, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, జివిఎంసి కషనర్‌ ‌సృజన, విఎంఆర్డిఎ కషనర్‌ ‌కోటేశ్వరరావు, జెసిలు వేణుగోపాలరెడ్డి, అరుణ్‌ ‌బాబు, వైఎస్సార్సీపీ ఇంచార్జీలు అక్కరమాని విజయనిర్మల, మల్లా విజయప్రసాద్‌ ‌తదితరులు హాజరయ్యారు.

Leave a Reply