సీజనల్ వ్యాధులను నియంత్రించటం ప్రతీఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం రామగిరి మండలంలోని రత్నాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న పారిశుధ్య కార్యక్రమాలలో కలెక్టర్ పాల్గొన్నారు. గ్రామంలో నిర్మాణంలో ఉన్న స్మశానవాటికను, ఇంకుడు గుంతలను పరిశీలించిన కలెక్టర్ నీరు నిల్వ ఉండకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. చెత్త నిర్వహణ సమర్థవంతంగా జరగాలని, కంపోస్ట్ షెడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని సీజనల్ వ్యాషధుల నివారణకు ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక పారిశుధ్య వారోత్స వాల స్ఫూర్తిని కొనసాగించాలని, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.
ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కమ్యూనిటీ ప్లాంటేషన్, అవెన్యూ ప్లాంటేషన్ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, గ్రీన్ బడ్జెట్ వినియోగించి మొక్కలకు అవసరమైన ట్రీ గార్డులను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం రామగిరిఖిల్లాలోని కెవికె పాలిహౌజ్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పల్లె ప్రతిమ పివిరావు, అధికారులు ఎస్.వినోద్‌కుమార్, వేముల సుదర్శన్, ఆర్కెటి మల్లేశం, మార్కెట్ కమిటీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్, జడ్పిటిసి మ్యాదరవేని శారద కుమార్, తహసీల్దార్ పుష్పలత, ఎంపిటిసి ధర్ముల రాజసంపత్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.