Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్న రోజువారీ కొరోనా కేసులు

తాజాగా 2319 మందికి పాజిటివ్‌..ఇద్దరు మృతి
ప్రజాతంత్ర, హైదరాబాద్‌,‌జనవరి 12: రాష్ట్రంలో కొరోనా కేసులు రోజురోజుకు క్రమంగా పెరుగుతున్నాయి. బుధవారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో 2319 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌ ‌ప్రకారం తాజాగా 2319 కొరోనా కేసులు నమోదు కాగా..వైరస్‌ ‌కారణంగా ఇద్దరు మృతి చెందారు. జిహెచ్‌ఎం‌సి పరిధిలో కొత్తగా 1275 కేసులు నమోదవగా, మేడ్చల్‌ ‌మల్కాజ్‌గిరి జిల్లాలో 234, రంగారెడ్డి జిల్లాలో 173 కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 7,00,094 కాగా, మొత్తం మృతుల సంఖ్య 4,047కి చేరుకుంది. ఇప్పటి వరకూ మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,77,708 కాగా యాక్టివ్‌ ‌కేసుల సంఖ్య మళ్లీ పెరిగి 18,339గా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.

Leave a Reply