Take a fresh look at your lifestyle.

తెలంగాణలో….పాత పద్ధ్దతిలోనే.. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌

‌రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగంగా సాగాలి
అధికారులకు సీఎం ఆదేశం

తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ను పాత పద్దతిలోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా నూతనంగా చేపట్టిన స్లాట్‌ల బుకింగ్‌ ‌ప్రక్రియను నిలిపివేసింది. ఈ మేరకు పాత పద్దతిలోనే వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లను కొనసాగించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో శనివారం సీఎం కేసీఆర్‌ ‌దీనిపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాత పద్దతిలోనే వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగవద్దనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సూచించారు. ఈనెల 21 నుంచి అన్ని రిజిస్ట్రేషన్‌ ‌కార్యాలయాల్లో పాత పద్దతిలోనే రిజిస్ట్రేషన్లు కొనసాగించాలని అన్ని సబ్‌ ‌రిజిస్ట్రార్‌ ‌కార్యాలయాలను ఆదేశించారు. కొద్ది రోజుల క్రితం ధరణి వెబ్‌ ‌పోర్టల్‌ ‌ద్వారా ప్రభుత్వం వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది.

ఈ సందర్భంగా స్లాట్‌ ‌బుకింగ్‌ ‌సమయంలోనే  ఆస్తుల క్రయవిక్రేతల ఆధార్‌ ‌కార్డు నంబరు, కులం, కుటుంబ సభ్యులు వివరాలు, ఫోన్‌ ‌నంబర్లను కూడా ఇవ్వాలనే కాల్మమ్‌ను పొందుపరచారు. దీనిని వ్యతిరేకిస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌లో ఆధార్‌ ‌వివరాలను ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో గతంలో మాదిరిగా కార్డ్ ‌విధానంలో ఆస్తుల రిజిస్ట్రేషన్‌లను చేపట్టనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా కొత్త పద్దతిలో 1760 వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. ఇప్పటికే స్లాట్‌లు బుక్‌ ‌చేసుకున్న 2599 మందికియథాతథంగా రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. తదుపరి రిజిస్ట్రేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలు మరో రెండు రోజుల్లో తెలియజేస్తామని పేర్కొంది. 

Leave a Reply