Take a fresh look at your lifestyle.

కొరోనా పరీక్షలు తగ్గించడం సరికాదు

సూర్యాపేట దవాఖాన సందర్శించిన ఉత్తమ్‌
తెలంగాణ ప్రభుత్వం  రాష్ట్రంలో కొరోనా పరీక్షలను తగ్గించడం బాధాకరమని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ‌కుమార్‌రెడ్డి అన్నారు.  సోమవారం జిల్లా ప్రభుత్వ జనరల్‌ ‌దవాఖాన ని సందర్శించారు. పీపీఈ కిట్‌ ‌ధరించి కోవిడ్‌ ‌వార్డులో పర్యటించి కొరోనా బాధితులతో  వారికి అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌  ‌మాట్లాడుతూ.. తక్షణమే ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో ఆర్టీపీసీఆర్‌ ‌పరీక్షలు చేయాలని డిమాండ్‌ ‌చేశారు.

సూర్యాపేట మెడికల్‌ ‌కాలేజీని 950 పడకల పీజీ కాలేజీగా మార్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పారు. జిల్లాలోని హుజూర్‌ ‌నగర్‌, ‌కోదాడ దవాఖాన లకు మినరల్‌ ‌ఫండ్‌ ‌నిధులతో సీటీ స్కాన్‌, ‌సెంట్రలైజ్డ్ ఆక్సిజన్‌ ‌లైన్స్,ఐసీయూ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఉత్తమ్‌ ‌కుమార్‌రెడ్డి  తెలిపారు. ఇదిలావుంటే  సూర్యాపేట ప్రభుత్వ దవాఖానలో వైద్య సేవలు బాగున్నాయని,. ఇక్కడి డాక్టర్లు, సిబ్బంది ఎంతో సాహసోపేతమైన సేవలు అందిస్తున్నారని ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి అన్నారు. వైద్య సేవలు ఎలా ఉన్నాయని రోగులను అడిగి తెసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు.

హుజూర్‌నగర్‌, ‌కోదాడలోని ప్రభుత్వ దవాఖానలో కూడా అందుతున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీగా దవాఖానల్లో సౌకర్యాలు కల్పించేందుకు తన సహకారం ఉంటుందని ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరరావు, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎండీ అంజద్‌ అలీ, టీపీసీసీ నాయకులు కుమ్మరికుంట్ల వేణుగోపాల్‌, ‌జిల్లా యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు, మున్సిపల్‌ ‌కౌన్సిలర్‌ ‌బైరు శైలేందర్‌ ‌గౌడ్‌, ‌పట్టణ కాంగ్రెస్‌ ఓబీసీ సెల్‌ అధ్యక్షుడు రావుల రాంబాబు, జి.నరేందర్‌ ‌నాయుడు, సాయి నేత తదితరులు ఉన్నారు.

Leave a Reply