Take a fresh look at your lifestyle.

కాలుష్యాన్ని తగ్గించి ఓజోన్‌ ‌పొరను రక్షించాలి

(సెప్టెంబర్‌ 16 ఓజోన్‌ ‌పరిరక్షణ దినోత్సవం)
భూమి మీద ప్రతి ప్రాణి బ్రతకడానికి ముఖ్య కారణం సూర్యుడు. సూర్యుని నుండి వెలుతురు, వేడి, భూమికి చేరుతున్నాయి. దీని వలన రాత్రి పగలు ఏర్పడి జీవులు మనుగడ సాగిస్తున్నాయి. వెలుతురు వేడితో పాటుగా సూర్యుని నుండి జీవులకు హాని కలిగించే అల్ట్రా వయొలెట్‌ ‌కిరణాలు (యు.వి) భూమి మీద పడకుండా భూమి చుట్టూ ఉన్న ఓజోన్‌ ‌పొర కాపాడుతుంది. ఓజోన్‌ ‌పొర కారణంగా సూర్యుడి నుంచి వెలువడే హానికారక అతి నీలలోహిత కిరణాలు భూమిని చేరకుండా మళ్లీ అంతరిక్షంవైపు వెళ్లిపోతాయి. ఓజోన్‌ ‌పొరకు చిల్లుపడితే ఆ కిరణాలు భూమిపై నేరుగా పడతాయి. ఈ రేడియో ధార్మికత వల్ల భూమిపై జీవకోటి అంతరించే ప్రమాదం ఉంది. 1839లో జర్మన్‌ ‌శాస్త్రవేత్త క్రిస్టియన్‌ ‌స్కోన్‌ ‌బియాస్‌ ఓజోన్‌ ‌వాయువు ను కనుగొన్నాడు.మానవుల యొక్క కార్యకలాపాల వలన వాతావరణం కలుషితమై ఓజోన్‌ ‌పొర దెబ్బ తింటున్నది . మోటారు వాహనాలు పెరగడం, పరిశ్రమల కాలుష్యం, అధిక శాతం మంది ఏసీలను వినియోగించడం వలన ఓజోన్‌ ‌పొర క్షీణించిపోతోందని 1987లో మాంట్రియల్‌ ‌ప్రొటోకాల్‌ (ఓజోన్‌ ‌పొర క్షీణతపై జరిపిన పరిశోధన) సంస్థ తెలిపింది.

19వ శతాబ్దంలో మొదలయిన ఇండస్ట్రీలైజేషన్‌ ‌ప్రకృతి ని దెబ్బతీసింది 40 ఏళ్లలో ఇది మరింత ప్రమాదకరంగా మారింది.ఈ పరిశ్రమలు వెదజల్లే కాలుష్యం కు తోడు మనిషి తన సుఖవంతమైన జీవితానికి తయారు చేసుకున్న చాలా వస్తువులు ప్రకృతికి వ్యతిరేకంగా తయారయ్యాయి దీనికి తోడు అడవుల విస్తీర్ణం తగ్గుతుంది ఫలితంగా ప్రకృతి గతి తప్పుతోంది రేడియేషన్‌, ‌పొల్యూషన్‌, ఈ ‌వేస్టేజ్‌, ‌గ్లోబల్‌ ‌వార్మింగ్‌, ‌గ్రీన్‌ ‌హౌస్‌ ‌గ్యాసెస్‌, ‌ప్లాస్టిక్‌, ‌వాడకం ఇలా చాలా రకాలుగా భూమిని మానవులు కలుషితం చేస్తూనే ఉన్నారు.. 1985లో శాస్త్రవేత్తలు ఓజోన్‌ ‌పొరకు చిల్లు పడిందని గుర్తించారు. ఫలితంగా ఓజోన్‌ ‌పొరను రక్షించే ఆవశ్యకత మొదలైంది. ప్రకృతిలో జరుగుతున్న మార్పులు జీవజాతి నాశనానికి దారులు ఏర్పడుతున్నాయి.ఓజోన్‌ ‌పొర పరిరక్షణ కోసం ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఓజోన్‌ ‌దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌ 16 ‌న జరుపుకుంటారు. ఈ సంవత్సరం జీవితం కొరకు ఓజోన్‌ ( ఓజోన్‌ ‌ఫర్‌ ‌లైఫ్‌ ) అనే థీం తో జరుపుకుంటున్నాము. ఓజోన్‌ ‌పొరను తగ్గించే పదార్ధాలపై మాంట్రియల్‌ ‌ప్రోటోకాల్‌ 1987 ‌లో సంతకం చేసిన జ్ఞాపకార్థం, వాతావరణ మార్పు మరియు ఓజోన్‌ ‌క్షీణతకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించే కార్యకలాపాలను ఈ రోజు చేపడుతారు . భూమిపైన వ్యాపించి వున్న గాలి పొరను వాతావరణం అంటారు. ఇది సుమారు 1000 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంటుంది. దీనిని ట్రోపో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, మీసో ఆవరణం , ఉష్ణ ఆవరణం, ఎక్సో ఆవరణం, అనే ఐదు పొరలుగా వర్గీకరించారు రెండవది అయిన స్ట్రాటో ఆవరణంలోని 17 నుంచి 48 కిలోమీటర్ల ఎత్తులో సహజంగా తయారయిన ఓజోన్‌ ‌పొర ఉంటుంది. ఇది లేత నీలి రంగులో ఉంటుంది సూర్యుని నుండి వెలువడే ప్రమాదకరమైన అతి నీలలోహిత కిరణాలను భూమి పైన పడకుండా ఆపి జీవులను వేడి నుంచి కాపాడుతుంది. . ఓజోన్‌ ‌పొర జీవావరణానికి రక్షక కవచం లాగా పని చేస్తుంది. కానీ జీవావరణంలో చేరితే విషమవుతుంది.

ఓజోన్‌ ‌పొర సూర్యుని నుండి వెలువడే ప్రమాదకరమైన (యు వి) రేడియో కిరణాలను ఆపి వేడి నుండి భూమిని కాపాడుతుంది ఓజోన్‌ ‌పొర ను పలుచన చేసేవి అతి ముఖ్యమైన కారకాలు క్లోరోఫ్లోరో కార్బన్లు. ఓజోన్‌ ‌పొర క్షీణించడం వలన సూర్యుని నుండి వెలువడే అతినీలలోహిత కిరణాలు భూమిని చేరుతాయి. వీటి వలన మొక్కలు తేలికగా తెగుళ్ళ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి . మానవులలో రోగ నిరోదకత శక్తి తగ్గుతుంది. చర్మసంబంధిత వ్యాదులు, చర్మ క్యాన్సర్లు వస్తాయి.అలాగే దృష్టి లోపాలు ఏర్పడి కంటి జబ్బులు వస్తాయి. వేడికి సముద్రపు జీవులు నశించి పోతాయి. మంచు కరిగి పోయి నీటి కరువులు ఏర్పడుతాయి.ఇలా అనేక రుగ్మతలు జీవులపై ప్రభావం చూపెట్టే అవకాశాలు ఉన్నాయి. దీనికి కారణం మానవుడు ఉపయోగించే అనాలోచిత కార్యక్రమాల వలన ఓజోన్‌ ‌పొర పలుచన అవుతుంది. ముఖ్యంగా వాహనాలు, పరిశ్రమలు, సూపర్‌ ‌సోనిక్‌ ‌జెట్‌ ‌విమానాల, నుండి నైట్రోజన్‌ ఆక్సైడ్‌, ‌విడుదల అవుతాయి. ఈ వాయువులు స్ట్రాటో ఆవరణం చేరి ఓజోన్‌ అణువును క్షీణింప చేస్తాయి. అలాగే రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌ ‌కండిషనర్లు, ఫోమ్‌ ‌బ్లోయింగ్‌ ‌లోను , ఎయిరో సోల్స్ ‌లోను క్లోరో ఫ్లోరో కార్బన్లను (సి.ఎఫ.సి) వాడుతారు. వీటిని ప్రియాన్స్ అం‌టాము. మంటలను ఆర్పే యంత్రాలలో ను వాడుతారు సి.ఎఫ్‌.‌సి లు హలోన్లు ఉపయోగించినప్పుడు వాటి నుండి వెలువడే వాయువులు ఓజోన్‌ ‌పొరను నాశనం చేస్తాయి. వీటి స్థానంలో ఓజోన్‌ ‌పొరకు తక్కువ నష్టం కలిగించే పదార్థాలు వస్తున్నాయి. ఇవి వాడేలా ప్రచారం చేసి ఒప్పించాలి.

వ్యవసాయంలో అధిక దిగుబడి కోసం రసాయనిక క్రిమిసంహారక మందులు, స్ప్రే లు, విచ్చలవిడిగా వాడుతున్నాం. వీటి నుండి వెలువడే క్లోరో ఫ్లోరో కార్బన్లు ఓజోన్‌ ‌క్షీణత కు దోహదం చేస్తున్నాయి. రసాయన కాలుష్యాలతో ఓజోన్‌ ‌పొరకు చిల్లులు పడుతున్నాయి. రసాయన కాలుష్యం పెచ్చురిల్లితే మానవ సమాజానికే ప్రమాదమని శాస్త్రవేత్తలు హెచ్చ రిస్తున్నారు. కాబట్టి మానవాళి మేల్కొని కాలుష్యాన్ని తగ్గించి ఓజోన్‌ ‌పొరను రక్షించాలి.

nerupati aanandh
నెరుపటి ఆనంద్‌,
‌జీవశాస్త్రం ఉపాధ్యాయులు.
ఉన్నత పాఠశాల టేకుర్తి. 9989048428.

Leave a Reply