Take a fresh look at your lifestyle.

రెడ్‌ ‌జోన్‌, ఆరెంజ్‌ ‌జోన్‌ ‌జాబితాను ప్రకటించిన కేంద్రం

  • తెలంగాణలో రెడ్‌ ‌జోన్లు 8, ఆరెంజ్‌ ‌జోన్లు 19
  • ఏపీలో రెడ్‌ ‌జోన్లు 11 జిల్లాలుగా గుర్తింపు

దేశవ్యాప్తంగా కొరోనా కట్టడి చర్యలలో భాగంగా మంగళవాకం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్‌ ‌తీవ్రత ఎక్కువ, సాధారణ, అతి తక్కువ ఉన్న ప్రాంతాలను గుర్తించి మూడు జోన్లుగా విభజించింది. ఈమేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రెడ్‌ ‌జోన్‌, ఆరెంజ్‌ ‌జోన్‌ ‌జాబితాను విడుదల చేసింది. ఇందులో భాగంగా రెడ్‌జోన్‌లో 170 జిల్లాలు, ఆరెంజ్‌ ‌జోన్లో 207 మిగతావి గ్రీన్‌ ‌జోన్లో ఉన్నాయి. కాగా రెడ్‌ ‌జోన్లను సైతం కేంద్ర ఆరోగ్య శాఖ రెండుగా విభజించింది. వీటిలో విస్త•తి ఎక్కువ ఉన్నవి 143 (లార్జ్ ఔట్‌‌బ్రేక్‌), ‌క్లస్లర్లలో విస్త•వి ఉన్నవి 47 జిల్లాలుగా ఉన్నాయి. 14 రోజుల్లో ఎలాంటి కొత్త కేసులు నమోదు కాన్లయితే రెడ్‌ ‌జోన్‌ ‌నుంచి ఆరెంజ్‌ ‌జోన్‌కు, ఆరెంజ్‌ ‌జోన్‌ ‌నుంచి గ్రీన్‌ ‌జోన్‌కు మారుస్తారు. కాగా, కేంద్రం విడుదల చేసిన జాబితా ప్రకారం

- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలోని రెడ్‌ ‌జోన్‌(‌లార్జ్ ఔట్‌‌బ్రేక్‌) ‌లో: హైదరాబాద్‌, ‌నిజామాబాద్‌, ‌వరంగల్‌ అర్బన్‌, ‌రంగారెడ్డి, జోగులాంబ గద్వాల, మేడ్చల్‌ ‌మల్కాజ్‌గరి, కరీంనగర్‌, ‌నిర్మల్‌ ‌జిల్లాలు ఉన్నాయి. రాష్ట్రంలో రెడ్‌ ‌జోన్‌ ‌హాట్‌స్పాట్‌ ‌క్లస్టర్‌గా నల్లగొండ జిల్లాను ప్రకటించింది.

ఇక ఆరెంజ్‌ ‌జోన్‌(‌నాన్‌ ‌హాట్‌స్పాట్‌ ) ‌పరిధిలో: సూర్యాపేట, ఆదిలాబాద్‌, ‌మహబూబ్‌నగర్‌, ‌కామారెడ్డి, వికారాబాద్‌, ‌సంగారెడ్డి, మెదక్‌, ‌ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగామ, జయశంకర్‌ ‌భూపాలపల్లి, కుమ్రం భీమ్‌ ఆసిఫాబాద్‌, ‌ములుగు,, పెద్దపల్లి, నాగర్‌కర్నూలు, మహబూబాబాద్‌, ‌రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలు ఉన్నాయి. ఇక ఏపీలో రెడ్‌ ‌జోన్లుగా : కర్నూలు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, కడప, పశ్చిమ గోదావరి, చిత్తూరు, విశాఖపట్టణం, తూర్పు గోదావరి, అనంతపూర్‌ ‌జిల్లాలను కేంద్రం ప్రకటించింది.

Leave a Reply