Take a fresh look at your lifestyle.

ఎ‌ర్ర బావుటా…..!

సామ్రాజ్యవాద శక్తులే
దేశాన్ని  ఏలేస్తున్నాయ్‌

‌మతోన్మాద మూకలే
జాతిని శాసిస్తున్నయ్‌

అధికార పీఠం ధ్యేయంగా …
కుళ్లు రాజకీయం చేస్తున్నయ్‌

‌గుత్తాధిపత్యం లక్ష్యంగా …
అణిచివేతకు తెగబడ్తున్నయ్‌

‌కాసాయికరణ ఆశయంగా ..
విద్వేషాగ్నుల రాజేస్తున్నయ్‌

‌హిందుత్వం ఎజెండాగా …
లౌకికతను పాతరేస్తున్నయ్‌

ఆదర్శాలు వల్లిస్తూనే …
అనైతికతకు పాల్పపడ్తున్నయ్‌

అభివృద్ధిమంత్రం జపిస్తూనే…
దారిద్య్రంలోకి నెట్టేస్తున్నయ్‌

‌మందిర నిర్మాణం పేరిట …
బతుకుల కూలదోస్తున్నయ్‌

‌దేశ భద్రతల మాటున …
నల్లచట్టాల రూపులద్దుతున్నయ్‌
‌రాజ్యాంగాన్ని ఏమారుస్తున్నయ్‌

‌కలాలకు సంకెళ్లు
గళాలకు ఉరితాళ్ళు
పిడికిళ్లకు ఉక్కు పాదాలు

పౌర హక్కులకు తూటాలు
నిరసనకు చీకటి చెరసాలలతో
నిరంకుశ పాలన సాగిస్తున్నయ్‌

‌తరాల బానిస విముక్తి కోసం
ఫాసిస్ట్ ‌పాలన అంతం కోసం
వాడకో ఎర్ర బావుటా ఎగరాల్సిందే !
గడపకో వీరుడు ఉద్యమించాల్సిందే!!

– కోడిగూటి తిరుపతి,
:9573929493

Leave a Reply