Take a fresh look at your lifestyle.

కోలుకున్న హెడ్మాష్టర్‌ ‌మళ్లీ ఆస్పత్రికి ..!

నెల్లూరు రెండు రోజుల క్రితం ఆనందయ్య ఆయుర్వేద మందు తో ఆక్సిజన్‌ ‌లెవల్స్ ‌పెరిగాయన్న రిటైర్డ్ ‌హెడ్‌మాస్టర్‌ ‌కోటయ్య ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. శనివారం ఆక్సిజన్‌ ‌లెవల్స్ ‌తగ్గడంతో కోటయ్యను ఆస్పత్రికి తరలించారు. కాగా, కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు పంపిణీకి వారం పాటు బ్రేక్‌ ‌పడింది. కరోనా మందుపై ఆయుష్‌ ‌కమిషనర్‌ ‌రాములు ఆధ్వర్యంలో అధ్యయనం కొనసాగుతోంది. శనివారం ఉదయం ఆయుర్వేద నిపుణుడు ఆనందయ్య నివాసానికి చేరుకున్న పోలీసులు.. ఆయుర్వేద మందు పంపిణీ కేంద్రాన్ని ఖాళీ చేయించి, పంపిణీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కృష్ణపట్నానికి ఐసీఎంఆర్‌ ‌బృందం రానుంది. మరో వైపు కరోనా మందు పేరుతో బ్లాక్‌మార్కెట్‌లో విక్రయాలు జరుగుతున్నాయి. ప్రజల అవసరాలను కేటుగాళ్లు క్యాష్‌ ‌చేసుకుంటున్నారు. ఆనందయ్య కరోనా మందుకు బ్లాక్‌ ‌మార్కెట్‌లో రూ.3 వేల నుంచి 10 వేల డిమాండ్‌ ఏర్పడింది.

బ్లాక్‌డేకు వామపక్షాల మద్దతు
గుంటూరు : దేశవ్యాప్తంగా రైతుసంఘాల సమన్వయ కమిటీ ఈనెల 26న చేపట్టదలచిన బ్లాక్‌డే కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు వామపక్ష పార్టీ నాయకులు స్పష్టం చేశారు. నూతన వ్యవసాయ చట్టాల రద్దు, కార్మిక చట్టాలలో మార్పులకు నిరసనగా బ్లాక్‌డేను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. బ్లాక్‌డే రోజున జిల్లాలో వాడవాడలా నల్లజెండాలు ఎగురవేసి గ్రామ, వార్డు సచివాలయాల వద్ద నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు. కొవిడ్‌ ‌కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలకు రూ.7,500 నగదు, మనిషికి 10 కేజీల బియ్యం ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు.

Leave a Reply