Take a fresh look at your lifestyle.

పునర్నిర్మాణం @తెలంగాణ…

సీఎం కేసీఅర్ వల్లే సాధ్యం
*మంత్రి హరీశ్ రావు ట్వీట్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 15: నాడు గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి 3 హాస్పిటల్స్ కు మాత్రమే పరిమితమైన డయాలసిస్ సేవలను నేడు ఏకంగా 102కు పెంచి సేవలు విస్తృతం చేశామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేసారు. “నాడు కిడ్నీ రోగం వస్తే నాడు ప్రాణాలు పోయినంతపని. వ్యయప్రయాసలు, తిండి తిప్పలు ఓర్చుకొని హైదరాబాద్ దాకా వెళ్లి డయాలసిస్  చేయించుకోవాల్సిన పరిస్థితి. కానీ నేడు స్వరాష్ట్రంలో  అలాంటి పరిస్థితులకు చరమగీతం పాడారు సీఎం కేసీఆర్ గారు. పట్నం దాకా రావాల్సిన అవసరం లేకుండానే, పేద ప్రజల చెంతకే డయాలసిస్ సేవలను తీసుకువెళ్లారు. BRS Party ప్రభుత్వం ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాలు కిడ్నీ బాధితులకు వరంగా మారాయి.
సిర్పూర్ కాగజ్ నగర్, ఏటూరునాగారం వంటి మారుమూల ప్రాంతాల్లో సైతం నేడు డయాలసిస్ సేవలు అందిస్తున్నాం అని సగర్వంగా చెప్తున్నాం.
ఇన్ఫెక్షన్లు సోకకుండా దేశంలో తొలిసారి సింగిల్ యూజ్ డయలైజర్ పద్ధతి అనుసరిస్తుండగా, పేషెంట్లకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు ఆసరా పింఛన్, డయాలసిస్ కేంద్రానికి చెరుకునేందుకు వీలుగా ఉచిత బస్ పాస్ లను తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నది. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడింది కాబట్టి, సీఎంగా కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి సాధ్యమైందన్నది అక్షర సత్యం..”

Leave a Reply