Take a fresh look at your lifestyle.

నిర్భయ దోషి క్యురేటివ్‌ ‌పిటిషన్‌ ‌తిరస్కరణ

nirbhaya accused, According to Juvenile Laws, akshay takur, mukesh singh, hang

  • పెండింగ్‌లో వినయ్‌ ‌కుమార్‌ ‌క్షమాభిక్ష పిటిషన్‌
  • ‌రేపు ఉరి శిక్ష అమలుపై సందేహాలు

నిర్భయ దోషి అక్షయ్‌కుమార్‌ ‌వేసుకున్న క్యురేటివ్‌ ‌పిటిషన్‌ను సుప్రీమ్‌కోర్టు తిరస్కరించింది. అలాగే ఫిబ్రవరి 1న ఉరి శిక్షపై స్టే విధించాల్సిందిగా కోరుతూ అతడు వేసిన మరో పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. మహిళలపై హింసకు సంబంధించిన కేసుల్లో ప్రజల నుంచి ఎదురయ్యే ఒత్తిడి, ప్రజాభిప్రాయాలను అనుసరించి కోర్టులు సర్వరోగ నివారిణిగా దోషులకు మరణశిక్ష విధిస్తున్నాయని అక్షయ్‌ ‌తన క్యురేటివ్‌ ‌పిటిషన్‌లో పేర్కొన్నాడు. అతడి పిటిషన్‌పై సుప్రీంకోర్టు సీనియర్‌ ‌న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.‌వి.రమణ, జస్టిస్‌ అరుణ్‌ ‌మిశ్ర, జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌.‌నారీమణ్‌, ‌జస్టిస్‌ ఆర్‌. ‌భానుమతి, జస్టిస్‌ అశోక్‌ ‌భూషణ్‌లతో కూడిన ధర్మాసనం ప్రత్యేక ఛాంబర్‌లో విచారణ జరిపింది. అక్షయ్‌కు ఇంకా క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. నిర్భయ దోషులను ఫిబ్రవరి 1న ఉరితీయాల్సిందిగా ఢిల్లీ కోర్టు ఇటీవల రెండోసారి డెత్‌ ‌వారెంట్‌ ‌జారీ చేసింది.

ఈ నేపథ్యంలోనే శిక్ష అమలును ఆపేందుకు దోషులు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. తాజాగా నిర్భయ దోషులు ఉరిశిక్ష అమలుపై స్టే విధించాల్సిందిగా ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులోని మరో దోషి వినయ్‌ ‌శర్మ రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్‌ ‌పెట్టుకున్నాడు. అది ఇంకా పెండింగ్‌లోనే ఉంది. దీంతో నిర్భయ దోషుల ఉరి శిక్ష అమలు మరింత ఆలస్యం కానుంది. ఈ కేసులో మరో దోషి ముకేశ్‌కు ఉన్న న్యాయపరమైన అవకాశాలన్నీ అయిపోయాయి. దోషులకు శిక్షలు అమలు ఇప్పటికే ఒకసారి వాయిదా పడ్డాయి. అయితే రాష్ట్రపతి వద్ద క్షమాభిక్ష పిటిషన్‌ ‌పెండింగ్‌ ఉం‌డటంతో శనివారం శిక్ష అమలు చేస్తారా లేదా అనే విషయంలో అనుమానాలు తలెత్తుతున్నాయి.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply