Take a fresh look at your lifestyle.

2023 ముంగిట్లో మాంద్యం..!

‘‘‌గతానికి వీడ్కోలుకు పలుకుతూనే కొత్త సంవత్సరానికి ఆనందంగా స్వాగతం చెప్పాల్సిన సమయమిది. లాక్‌డౌన్లు, కొరోనా వేవ్‌ల దెబ్బకు 2021లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ తల్లకిందులయ్యాయి. 2022లో నెమ్మదిగా పుంజుకుంటున్న దశలో పులిద పుట్రలా రష్యా-ఉక్రెయిన్‌ ‌యుద్ధం వొచ్చిపడింది. దీంతో పలుదేశాల్లో ద్రవ్యోల్బణం పెరిగిపో యింది. కొత్త ఏడాదిలో కూడా పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదని.. ప్రపంచం ఆర్థిక మాంద్యం ముప్పు ముంగిట ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2023లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి రేటు 2.7శాతం మేర పడిపోతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) అం‌చనా వేస్తోంది.’’

గతాన్ని నెమరేసుకుంటూ..భవిష్యత్‌ను ఊహించుకుంటూ..వర్తమానంలో సాగితేనే జీవితం. మనమంతా కొత్త ఏడాదికి స్వాగతిస్తున్న వేళ అన్ని రంగాల్లోనూ అవలోకనం చేసుకోవాల్సిందే. వ్యక్తులుగా..కుటుంబాలుగా.. గ్రామాలుగా..రాష్ట్రం..దేశంగా ఏ మేరకు మన లక్ష్యాలను చేరుకున్నామో ఆత్మావలోకనం చేసుకోవడం అవసరం. రాజకీయ నాయకులకు ఇది మరింత అవసరం. ఎడాపెడా హాలు ఇచ్చి..అబద్దాలతో కాలం గడపకుండా నేలద నడవాలి. తమ కాలంలో కనీసం ఓ మంచి పని చేశామా అని ఆలోచన చేయాలి. ఇచ్చిన హాల్లో ఎన్ని నెరవేర్చామన్నాది చూసుకోవాలి. తమవల్ల గ్రామాల్లో, పట్టణాల్లో మార్పులు వొచ్చాయా లేదా అన్నది చూసుకోవాలి. ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వకుండా…అభివృద్దికి ఏం చేయాలో నేతలంతా ఆలోచన చేయాలి. ప్రజలను భాగస్వాములను చేయాలి. అలాకాకుండా నిరంకుశంగా సాగితే నేతలు కాలగ్భంలో కలసిపోక తప్పదు. కాలచక్రం గిర్రున తిరిగిపోతోంది. 2022 సంవత్సరం కాలగర్భంలో కలిసిపోబోతున్న వేళ రాజకీయనేతలు.. ఈ దేశం కోసం మనం పాటుపడుతున్నామా.. లేక మనకోసం..మన అభివృద్ది కోసం పాటుపడుతున్నామా అన్నది ఆత్మపరిశీలన చేసుకోవాలి. గతానికి వీడ్కోలుకు పలుకుతూనే కొత్త సంవత్సరానికి ఆనందంగా స్వాగతం చెప్పాల్సిన సమయమిది.

లాక్‌డౌన్లు, కొరోనా వేవ్‌ల దెబ్బకు 2021లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ తల్లకిందులయ్యాయి. 2022లో నెమ్మదిగా పుంజుకుంటున్న దశలో పులిద పుట్రలా రష్యా-ఉక్రెయిన్‌ ‌యుద్ధం వొచ్చిపడింది. దీంతో పలుదేశాల్లో ద్రవ్యోల్బణం పెరిగిపో యింది. కొత్త ఏడాదిలో కూడా పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదని.. ప్రపంచం ఆర్థిక మాంద్యం ముప్పు ముంగిట ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2023లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి రేటు 2.7శాతం మేర పడిపోతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) అం‌చనా వేస్తోంది. ద్రవ్యోల్బణం కట్టడికి అన్ని దేశాల రిజర్వు బ్యాంకులు తీసుకుంటున్న, తీసుకోబోయే నిర్ణయాలు.. చైనాలో కొరోనా విశ్వరూపం పర్యవసానాలు.. రష్యా-ఉక్రెయిన్‌ ‌యుద్ధం నేపథ్యంలో ముడిచమురు ధరలు.. ఈ మూడే 2023లో ఆర్థిక మాంద్యం ముప్పు ఉండేదీ లేనిదీ నిర్ణయించే కీలక అంశాలని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మాంద్యం వొచ్చినా రాకున్నా.. కొత్త ఏడాదిలో ఆర్థిక వృద్ధి గత 40 ఏళ్లలో ఎన్నడూ లేనంత నెమ్మదిగా ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు.ఈ పర్యాయానికి ఎన్డీయే సర్కార్‌ 2023‌లో పెట్టబోయేదే ఆఖరు పూర్తిస్థాయి బడ్జెట్‌ ‌కానుంది.  2024 ఎన్నికల సంవత్సరం కాబట్టి ఓటాన్‌ అకౌంట్‌ ‌మాత్రమే ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. 2023లో నాలుగు కీలక రాష్టాల్ల్రో అసెంబ్లీ ఎన్నికలు.. 2024లో సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది బడ్జెట్‌లో మోదీ సర్కారు పేద, మధ్య తరగతిపై కనికరం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదాయపన్ను పరిమితిపై వేతన, మధ్యతరగతి జీవులు భారీ ఆశలే పెట్టుకున్నారు. ఆదాయపన్ను పరిమితిని ప్రస్తుతమున్న రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షలకు పెంచాలని ఏటా విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఏటా కోటి ఉద్యోగాల మాట మరిచారు.

వ్యవసాయ ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నా జరగలేదు. ధరల పెరుగుదల ఆగడం లేదు. వైద్యఖర్చులు సామాన్యులు భరించలేక పోతున్నారు. ప్రయాణాల ఖర్చులు కూడా పెరిగాయి. అభివృద్ది చెందిందని అంటుంటే ప్రజల జీవితాల్లో కనీస మార్పు అయినా కానరావాలి. కానీ అలాంటి మార్పులేవీ గోచరించడం లేదు. ఎన్నికల చుట్టూ రాజకీయాలను నడపడం మానుకోవాలి.ఇకపోతే ప్రధానంగా దేశంలో యువత నిరాశతో ఉంది. వారికి భరోసా కల్పించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్టాల్రపై ఉంది. చిన్న,మధ్య తరహా పారిశ్రామిక రంగాలను ఊపిరాడకుండా చేయడం వల్ల అసమానతలు పెరుగుతున్నాయి. ప్రస్తుత ప్రభుత్వాలు అనుసరిస్తున్న తప్పుడు విధానాలు కూడా దీనికి కారణం. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు చేసే ఉత్పత్తుల స్థానాన్ని బడా పరిశ్రమల ఉత్పత్తులు ఆక్రమిస్తాయి. అవే సరుకులు చిన్న పరిశ్రమల్లో గనుక తయారైతే, వాటిని తయారు చేయడానికి ఎక్కువమంది కార్మికులు అవసరం అవుతారు. వాటిని ఇప్పుడు బడా పరిశ్రమల్లో ఉత్పత్తి చేస్తున్నారు గనుక తక్కువ మంది కార్మికులు సరిపోతారు. ఈ వ్యత్యాసాన్ని గుర్తించి సర్దుబాటు చేయాలి.

ఇకపోతే ప్రజల కొనుగోలుశక్తిని మరింత దెబ్బ తీస్తుంది. అందువలన పారిశ్రామిక సరుకుల డిమాండ్‌ ‌మరింత తగ్గుతుంది. ధరల పెరుగుదల కూడా మార్కెట్లో మారకం సాగడం లేదు. బంగారం ధరలపైనా అదుపు ఉండడం లేదు. గ్రాణ పేదల ఆదాయాలు తగ్గడానికి గల కారణాలను విశ్లేషించాలి. పట్టణాల్లో పొట్టకూటికోసం వలసలు పెరుగుతున్నాయి. అలాగని వారి ఆదాయాలు ఏమాత్రం పెరగడం లేదు. గ్రాణ పేదరికం పెరిగితే ఆర్థిక వ్యవస్థ కూడా చిన్నాభిన్నం కాగలదు. ఇప్పుడు జరుగుతున్నది అదే. పనులు లేకపోతే అక్కడివారు పట్టణాలకు వలసలు వొస్తారు. గ్రామాల్లో వ్యవసాయాధారిత పరిశ్రమలకు ప్రోత్సాహం దక్కాలి. కొనుగోలు శక్తి తగ్గితే పారిశ్రామిక సరుకుల డిమాండ్‌ ‌తగ్గిపోయి మాంద్యం పెరుగుదలకు దోహదంఅవుతుంది. ఇలా పడిపోవడానికి కోవిడ్‌ ‌లాక్‌డౌన్‌ ‌కారణం అంటూ ఇప్పటికీ సాకులు చూపించడం సాధ్యం కాదు. సమస్యలన్నీ గొలుసుకట్టుగా ఉన్నాయి. పాలకుల విధానాలు మారితేనే సమస్యలు మారు తాయి. కొత్త సంవత్సరంలో ప్రాధాన్యతలు మారాలి. నాయకుల విధానాలు మారాలంటే ప్రజల ఆలోచనా విధానం మారాలి.
– ప్రజాతంత్ర డెస్క్

Leave a Reply