Take a fresh look at your lifestyle.

సిఎం రిలీఫ్‌ఫండ్‌కు అందిన విరాళాలు ఎంత..?

  • వాటినన్నింటిని ఎలా ఖర్చు చేశారు?
  • కేంద్రం ఇచ్చిన నిధులు ఏం చేశారు?
  • వీటిపై శ్వేతపత్రం విడుదల చేయండి

సీఎం రిలీఫ్‌ ‌ఫండ్‌కు అందిన మొత్తాన్ని, వాటిని ఎలా ఖర్చుచేశారో వివరాలు తెలపాని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. సిఎం కెసిఆర్‌కు, కొడుకు కేటిఆర్‌కు అందిన విరాళాలు మొత్తం ఎంత? రు వాటిని ఎలా ఖర్చు పెట్టారు? ఆ వివరాలను ప్రజలకు స్పష్టంగా చెప్పాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. వలస కార్మికుల తరలింపు కోసం, రు ఖర్చు పెట్టారని చెపుతున్న డబ్బులు, కేంద్రం ఇచ్చిన విపత్తు నిధి నుంచా? లేదా వేరే నిధుల నుండి ఇవి వచ్చాయా? అని ప్రశ్నించారు. ఈమేరకు ఆయన సిఎం కెసిఆర్‌కు ఓ బహిరంగ లేఖ రాశారు. కోవిడ్‌ ‌వ్యాధిని ఎదుర్కొవటానికి తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం ఇచ్చిన నిధులను రు ఎలా ఖర్చు పెట్టారో వివరిస్తూ శ్వేత పత్రం విడుదల చెయ్యాలని, భారతీయ జనతా పార్టీ తరపున డిమాండ్‌ ‌చేస్తున్నామని సంజయ్‌ అన్నారు.కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మనిర్భర్‌ ‌ప్యాకేజీపై సీఎం కేసీఆర్‌ ‌లేని పోని విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. దేశ, రాష్టాల్ర బాగు కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఈ ప్యాకేజీని ప్రకటిస్తే.. తమ అసమర్థ పాలనను కప్పిపుచ్చుకోవటానికి, కేంద్ర ప్రభుత్వంపై అర్థరహిత విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. మాటల గారడీతో రాష్ట్ర ప్రజలను ఇంకెన్ని రోజులు మోసం చేస్తారని ప్రశ్నిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సంజయ్‌ ‌లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్దీపనలు ఫ్యూడల్‌ ‌విధానంలో ఉన్నాయని సీఎం అనటం, భూస్వామ్య విధానం, ఫ్యూడల్‌ ‌స్వభావం గురించి మాట్లాడటం మరీ విడ్డూరంగా ఉందని అన్నారు. రాష్టాల్ర చేతుల్లోకి నగదు రావాలని చెబుతున్న కేసీఆర్‌.. ‌

కేంద్రం నేరుగా నగదు ఇస్తే జేబులు నింపుకుందామనా? అభివృద్ధి పనుల పేరుతో కషన్లు దండుకుందామనా? అని అడిగారు. ఇప్పుడిక అలాంటివి సాధ్యం కాదని అన్నారు. ఎఫ్‌.ఆర్‌.‌బీ.ఎం పరిమితి సంస్కరణల పై అసంబద్ధమైన ఆరోపణలు చేశారని, సంస్కరణలు తేవటం, ప్రభుత్వపాలనలో ఒక భాగమేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వం, పీఎం కిసాన్‌ ‌సమ్మాన్‌ ‌నిధి ద్వారా రైతులకు క్రమం తప్పకుండా అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్నదని, రైతుబంధు ద్వారా రైతులకు అలా అందడం లేదని బండి సంజయ్‌ అన్నారు. రైతు బంధు ఆర్థిక సహాయాన్ని, పంటల నియంత్రిత పద్ధతితో ముడిపెట్టడం ఎంతవరకు సమంజసమో స్పష్టం చెయ్యాలని సీఎంను డిమాండ్‌ ‌చేశారు. భవిష్యత్‌లో రైతుబంధు పథకాన్ని కొనసాగిస్తారా లేదా? అని చెప్పాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రాష్టాన్రికి కోవిడ్‌ ‌నిధులను ఇవ్వలేదా?అని లేఖలో సంజయ్‌ ‌ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన రూ. 224 కోట్లు, మెడికల్‌ ‌పరికరాల కోసం ఇచ్చిన రూ.216 కోట్లు, డివల్యూషన్‌ ‌నిధులలో తొలి విడతగా ఇచ్చిన రూ.982 కోట్లు, ఎలా ఖర్చు చేశారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలన్నారు. ఇచ్చిన నిధులను, ఎలా ఖర్చు పెట్టారో చెప్పకుండా, రాష్ట్ర ప్రజలకు ఏవేవో మాయమాటలు చెబుతున్నారన్నారు. పీఎం కేర్స్ ‌నిధుల నుంచి ప్రధాని, 3100 కోట్ల రూపాయలను వెంటిలేటర్ల తయారీకి, వలస కార్మికుల కోసం, వాక్సిన్‌ అభివృద్ధికి కేటాయించారని వాటిని ఎలా ఖర్చుచేశారో చెప్పాలన్నారు.

Leave a Reply