Take a fresh look at your lifestyle.

ధాన్యం కొనుగోలు చేయడం లేదని రోడ్డుపై భైఠాయింపు

  • అధికారుల భరోసాతో ధర్నా విరమించిన రైతులు

సూర్యాపేట(తుంగతుర్తి),మే 5, ప్రజాతంత్ర ప్రతినిధి): చివరి ధాన్యపు గింజ వరకు కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ప్రకటనలు చేస్తుంటే సూర్యాపేట జిల్లా అధికార యంత్రాంగం నిమ్మకు నిరేత్తినట్లు వ్యవహరిస్తున్నారని తుంగతుర్తి నియోజకవర్గం జాజిరెడ్డిగూడెం మండల పరిధిలోని పిఏసిఎస్‌ ఆధ్వర్యంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా కొనుగోలు నిలిపివేశారని ఆగ్రహంతో రైతులు మంగళవారం సూర్యాపేట, జనగామ రహదారిపై భైఠాయించారు.

ఒకప్రక్క ఆకాల వర్షాలతో ఇప్పటికే నాలుగు సార్లు ధాన్యం తడిసి ముద్ద అయినప్పటికి అధికారులు ధాన్యం కొనుగోలుకు ముందుకు రావడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా అధికారులు రైతులతో సంప్రందించి ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు వెనక్కితగ్గారు. నేటి నుండి కొనుగోలు చేస్తేనే ధర్నాను విరమిస్తామని రైతులు వెల్లడించడంతో అధికారులు నేటి నుండే ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పడంతో రైతులు ధర్నా విరమించుకున్నారు.

Leave a Reply