ఎన్నికల తరవాత కెసిఆర్ ప్రభుత్వం కుప్పకూలుతుంది
వరదలు వొచ్చినా కెసిఆర్ ప్రజల దగ్గరికి రాలేదు
అందరూ వోటు బ్యాంకుగా మారి తెరాసకు బుద్ది చెప్పాలి
రోడ్‌షోలో బండిసంజయ్
ఎన్నికల వేళ ప్రచారం మరింత వేడెక్కింది. ముందు నుంచీ దూకుడు వి•దున్న తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తారని బాంబు పేల్చారు. తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు వొచ్చే అవకాశముందని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. జీహెచ్ఎమ్సీ ఎన్నికల తర్వాత అవినీతితో కూరుకుపోయిన టిఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుందని.. కేసీఆర్ జైలుకి పోవడం పక్కా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నగరంలో శనివారం ఆయన పలు డివిజన్లలో పార్టీ ర్యాలీల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను చావుకైనా భయపడనని.. టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టే కేసులకు ఎందుకు భయపడుతానని సంజయ్ అన్నారు. తనపై తప్పుడు కేసులు పెట్టారని, అలాంటి కేసులు ఎన్ని పెట్టినా భయపడేది లేదని, వెనక్కిపోనని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రాంనగర్లో రోడ్ షోలో పాల్గొన్న ఆయన.. త్వరలో కేసీఆర్ అవినీతి ప్రభుత్వం పడిపోతుందని.. బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు. టీఆర్ఎస్ వాళ్లు పెట్టే వి•టింగులకు ఎవరూ రావట్లేదని, ప్రజలకి డబ్బులిచ్చి బహిరంగ సభలకి వేర్వేరు జిల్లాల నుండి రప్పిస్తున్నారని, ఒక్కో డివిజన్ కి 5 కోట్ల రూపాయలు పంచాలని చూస్తున్నారన్నారు. ఆదివారం.. హైదరాబాద్‌కి అమిత్ షా వస్తుండడంతో టిఆర్ఎస్ వాళ్ళకి భయం పట్టుకుందని అన్నారు. వాళ్ళు ఇచ్చే పైసలు తీసుకొని.. బీజేపీకి వోటు వేయాలని సంజయ్ అన్నారు.