Take a fresh look at your lifestyle.

కురవిలో జోరుగా రియల్‌ ‌దందా

 

real darnda,kuravi, Mahabubabad.jgp
పట్టించుకోని సంబంధిత అధికారులు
  • అనుమతులు లేకుండానే లేఅవుట్లు..
  • నాలా కన్వర్షన్‌ ‌లేకుండానే ప్లాట్లుగా మార్చేస్తున్న
  • రియల్‌ ‌వ్యాపారులు

మహబూ బాబాద్‌ ‌జిల్లా కురవి మండలంలో అనుమతులు లేకుం డానే విచ్చలవిడిగా వ్యవసాయ భూములను రియల్‌ ఎస్టేట్‌ ‌వ్యాపారులు లేఅవుట్లు గా మార్చేస్తున్నారు నాలా కన్వర్షన్‌ ‌లేకుండానే ప్లాట్లుగా మారుస్తూ అమాయక ప్రజలకు మాయమాటలు చెప్పి జోరుగా విక్రయాలు జరుపుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా ప్రజలను మోసం చేస్తున్నారు మండల కేంద్రంలో ప్రసిద్ధి చెందిన శ్రీ వీరభద్రస్వామి ఆలయం తో పాటు 365 జాతీయ రహదారి ఖమ్మం ప్రధాన రోడ్డు సౌకర్యం కలదు ప్రజలు అద్వితీయంగా అభివృద్ధి చెందుతున్న ఫ్లాట్లు కొనుగోలు చేసి ఇండ్ల నిర్మాణం చేసుకునేందుకు ఉత్సాహం చూపుతున్న తరుణంలో ప్రజల అభిరుచిని ఆసరా చేసుకుంటున్నారా అక్రమార్కు లు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకో కుండా పొలాలను పంట భూములను గుట్టలను సైతం కొనుగోలు చేసి మైనింగ్‌ ‌నిబంధనలకు విరుద్ధంగా బాంబులతో రాళ్ళను తగిలించి ద్వారా చేస్తున్నారు సిండికేట్గా ఏర్పడి రియల్‌ ఎస్టేట్‌ ‌వ్యాపారులు భవిష్య త్తులో మండలంలోని రియల్‌ ఎస్టేట్‌ ‌ప్లాట్‌ ‌రెట్టింపు ధరలు ఖాయమని పేర్కొంటూ ప్రజలకు ప్లాట్లను అంట గడుతున్నారు మండలంలో ఏర్పాటు చేస్తున్న వెంచర్లకు ఎలాంటి అనుమతులు ఉండడం లేదని తెలుస్తుంది. ప్రస్తుతం మండలంలో సుమారు వివిధ గ్రామాల పరి ధిలో వ్యవసాయ భూములను కొనుగోలు చేసి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఏర్పాటు చేసినవే కావడం గమనార్హం కొంతమంది వ్యాపారులు బదిలీపై వెళ్లిన పంచాయతీ కార్యదర్శుల సంతకాలతో అనుమతు లు పొంది వెంచర్లు వేస్తున్నట్లు సమాచారం దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు ప్రస్తుతం అనుమతులు పొందాలంటే ప్రస్తుతం కొనసా గుతున్న ధరలకు అనుగుణంగా డబ్బులు చెల్లిస్తూ సంబంధిత శాఖల ద్వారా అనుమతి తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ ఇవేమీ లేకుండా కోట్ల రూపాయల సంపాదన అక్రమ మార్గాలు పనిచేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు గతంలో కూడా కొనసాగింది సుమారు ఆరు సంవత్సరాలు మండలంలోని స్టేజి సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా చేశారు అలాగే గత రెండు నెలల క్రితం ప్రక్కనే మరో రైతు నుంచి సుమారు 30 ఎకరాలు కొనుగోలు చేసి చదును చేస్తున్నారు.అలాగే మరో వ్యాపారి చింతపల్లి గ్రామ శివారు కందికొండ స్టేజి సమీపంలో అలాగే మండల కేంద్రంలో రైతుల నుంచి కొనుగోలు చేసి నిబంధనలకు విరుద్ధంగా వెం చర్‌ ‌వేసి ప్లాటు ఏర్పాటు చేస్తున్నారు.

అనుమతులు లేకుండానే
ప్రస్తుతం మండలం లోని చింతపల్లి కందికొండ స్టేజి 365 జాతీయ రహదారి పక్కనే ఏర్పాటు చేసిన 34 సర్వేనెంబర్‌ ‌లో మొత్తం సుమారు 70 ఎకరాలు ఉంది అందులో రైతుల నుంచి 40 ఎకరాల భూమిని అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి అనుమతులు లేకుండా చేశారు అలాగే మండల కేంద్రంలో సుమారు 30 ఎకరాల్లో చేశారు అలాగే గుండ్రాతిమడుగు మోదుగుల గూడెం తిరుమలాపురం గ్రామం రెవెన్యూ పరిధిలో వ్యవసాయ భూములు కొనుగోలు చేసి నిబంధనలకు విరుద్ధంగా వెలిసాయి గ్రామ పంచాయతీ చట్టం ప్రకారం పరిధిలో ఏర్పాటు చేస్తే గ్రామాభివృద్ధి భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కచ్చితంగా లో గ్రామపంచాయతీ కేటాయించాల్సి ఉంటుంది అయితే అధికారులు ప్రజాప్రతినిధులు డబ్బుల కక్కుర్తితో 10% గ్రామపంచాయతికి కేటాయించడం మరిచారు. దీనికితోడు వెంచర్ల లో ప్రతి గజానికి రెండు రూపాయ ల చొప్పున చలాన్‌ ‌చెల్లించాల్సి ఉంటుంది తదుపరి జిల్లా అధికారి జారీ చేస్తూ ఉత్తర్వులు వెలువరించిన అనంతరం పంచాయతీ కార్యదర్శి వెంచర్లు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది మండలంలో వెలసిన వెంచర్లకు ఇవేమీ అనుమతులు లేకుండా వేశారు దీనికితోడు నిబంధనల ప్రకారం 40 30 హిట్లర్‌ ‌రోడ్డు తో ప్లాట్లను వేయాల్సి ఉన్నప్ప టికీ ఇక్కడి వ్యాపారులు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు 40 30 సీట్లు తగులుతూ వెంచర్లు ఏర్పాటు చేస్తే తక్కువ ప్లాట్లు అవుతాయనే ఉద్దేశంతో ఇరుకు రోడ్లతో వెంచర్లు వేయడంతో ఎకరాకు 50 నుంచి 60 లక్షల రూపాయల వరకు వ్యాపారులు అదనంగా లాభాలు గడిస్తున్నారు.

అనుమతులు లేని ప్లాట్లు కొనుగోలు చేస్తే ఇక అంతే : ఇఓపిఆర్‌డి విజయలక్ష్మీ
నిబంధనలకు విరుద్ధంగా మండలం లో ఏర్పాటుచేసిన వెంచర్లలో ఫ్లాట్లను కొనుగోలు చేసి ప్రజలు మాయమాట లకు మోసపోతే ఇల్లు నిర్మించుకునే సమయంలో అనుమతులు పొందాలంటే సుమారు మూడు లక్షల వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది కానీ కోట్లు విలువ చేసే భూములను అక్రమంగా ఏర్పాటు చేస్తున్న ప్పటికీ అవి మాత్రం వారి కంటికి కనిపించడం పట్ల స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమంగా వెలిసిన అక్రమ వెంచర్లు పై చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ ‌చేస్తున్నారు మోసపోకుండా కొను గోలు చేసే ప్రజలు ఆయా వెంచర్లకు అనుమతులు ఉన్నాయా..?లేవా..? అని పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఫ్లాట్లను కొనుగోలు చేయాలని లేకుంటే ఆర్థి కంగా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని పలువు రు కోరుతున్నారు.ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటాం

Tags: real darnda,kuravi, Mahabubabad

Leave A Reply

Your email address will not be published.