Take a fresh look at your lifestyle.

అష్ట దిగ్బంధనం..!

  • థర్డ్‌వేవ్‌ ఎదుర్కొనేందుకు సిద్దం..
  • ఢిల్లీలో పాటిజివ్‌ ‌రేటు 0.5 శాతం
  • కఠిన లాక్‌డౌన్‌తో తగ్గిన కేసుల సంఖ్య
  • సరిబేసిలో ఇక షాపులకు అనుమతి
  • వెల్లడించిన సిఎం అరవింద్‌ ‌కేజ్రీవాల్‌

‌కోవిడ్‌-19 ‌మహమ్మారి విసురుతున్న సవాలును తిప్పికొట్టేందుకు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మూడో ప్రభంజనం వస్తుందని, ఈ వైరస్‌ ‌కొత్త వేరియంట్లు ప్రజలను బాధిస్తాయని హెచ్చరికలు వస్తుండటంతో కొత్త వేరియంట్లను గుర్తించేందుకు ప్రత్యేకంగా ప్రయోగ శాలలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అదేవిధంగా థర్డ్ ‌వేవ్‌ ‌ప్రభావం బాలలపై ఎక్కువగా ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతుండటంతో బాలలకు చికిత్స చేయడానికి తగిన సదుపాయాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. అష్ట దిగ్బంధనాన్ని కొనసాగిస్తూ, కొన్ని అదనపు సడలింపులను ఇచ్చింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ ‌కేజీవ్రాల్‌ ‌శనివారం వి•డియాతో మాట్లాడుతూ, అష్ట దిగ్బంధనం కొనసాగు తుందని, అయితే సోమవారం నుంచి అదనపు సడలింపులు అమలు చేస్తామని తెలిపారు. మార్కెట్లు, మాల్స్ ‌సరి-బేసి ప్రాతిపదికపై ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పని చేయవచ్చునన్నారు. ఢిల్లీలో నమోదయ్యే రోజువారీ కోవిడ్‌-19 ‌పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కొరోనా వైరస్‌ ‌కొత్త వేరియంట్లు ఏమైనా వచ్చినట్లయితే, వాటిని గుర్తించేందుకు రెండు జినోమ్‌ ‌సీక్వెన్సింగ్‌ ‌ల్యాబొరేటరీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మందుల కోసం వాట్సాప్‌ ‌ద్వారా వచ్చే వినతులను పరిష్కరించేందుకు, మందులకుగల డిమాండ్‌ను పరిశీలించేందుకు వైద్యులు, నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

కోవిడ్‌-19 ‌మూడో ప్రభంజనం వస్తుందనే అంచనాతో 420 టన్నుల ఆక్సిజన్‌ ‌నిల్వ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 150 టన్నుల ఆక్సిజన్‌ను తయారు చేయాలని ఇందప్రస్థ గ్యాస్‌ ‌లిమిటెడ్‌ను కోరినట్లు తెలిపారు. మూడో ప్రభంజనం ప్రభావం బాలలపై అధికంగా ఉంటుందనే హెచ్చరికల నేపథ్యంలో పీడియాట్రిక్‌ ‌టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పైవేటు కార్యాలయాలు 50 శాతం మంది సిబ్బందితో పని చేయడానికి అనుమతిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాల్లో గ్రూప్‌-ఏ ‌సిబ్బంది నూటికి నూరు శాతం మంది పని చేసేందుకు అనుమతి స్తున్నట్లు తెలిపారు. గ్రూప్‌-‌బీ సిబ్బంది 50 శాతం మాత్రమే కార్యాలయాలకు హాజరై పని చేసేందుకు అనుమతించినట్లు చెప్పారు. ఢిల్లీ మెట్రో రైలు సేవలు 50 శాతం సీటింగ్‌ ‌సామర్థ్యంతో అందుబాటులోకి వస్తాయన్నారు. రాష్ట్రంలో ఏప్రిల్‌ 19 ‌నుంచి అష్ట దిగ్బంధనం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో కొరోనా కేసుల నమోదు అదుపులోకి రావడంతో లాక్‌డౌన్‌ ఆం‌క్షలు సడలించేందుకు కేజీవ్రాల్‌ ‌ప్రభుత్వం రెడీ అయ్యింది.

ఢిల్లీలో రోజువారి కేసులు 400 కన్నా తక్కువే వచ్చాయని.. పాజిటివిటీ రేటు 0.5 శాతంగా ఉందని సీఎం అరవింద్‌ ‌కేజీవ్రాల్‌ అన్నారు. దీంతో లాక్‌ ‌డౌన్‌ ‌ను క్రమంగా ఎత్తేస్తున్నామన్నారు. సోమవారం నుంచి షాపింగ్‌ ‌మాళ్లు, మార్కెట్లను సరి-బేసి విధానంలో తెరుచుకోవచ్చని చెప్పారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 8 గంటలకు షాపులను తెరుచుకోవచ్చన్నారు. ప్రభుత్వ ఆఫీసుల్లో గ్రూప్‌ ఏ ఆఫీసర్లు వంద శాతం విధులకు హాజరు కావాలన్నారు. ఆ లోపు గ్రేడ్‌ ఉద్యోగులు 50 శాతం మంది విధులకు రావాల్సి ఉంటుందన్నారు సీఎం కేజీవ్రాల్‌. అత్యవసర సేవల్లో ఉన్న వారు మాత్రం వంద శాతం డ్యూటీలకు రావాల్సి ఉంటుందన్నారు సీఎం అరవింద్‌ ‌కేజీవ్రాల్‌. ‌ప్రైవేటు ఆఫీసులను 50 శాతం సిబ్బందితో నడుపుకోవచ్చన్నారు. అయితే.. వీలైనంత వరకు వర్క్ ‌ఫ్రమ్‌ ‌హోం చేసేందుకు అవకాశం ఇవ్వాలని సూచించారు. అంతేకాదు.. 50 శాతం సామర్థ్యంతో ఢిల్లీ మెట్రో నడుస్తుందన్నారు. ఈ కామర్స్ ‌సేవలనూ ప్రారంభించుకోవచ్చని తెలిపారు. ఇకపోతే ఢిల్లీలో శనివారం కొత్తగా 414 కోవిడ్‌-19 ‌కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం పేర్కొంది. శుక్రవారం రోజు 523 కేసులు నమోదయ్యాయని వైద్య అధికారులు వెల్లడించారు. ఢిల్లీలో రోజువారీ కోవిడ్‌-19 ‌పాజిటివిటీ రేటు శుక్రవారం 0.68 శాతంతో పోలిస్తే శనివారానికి 0.53 శాతానికి పడిపోయిందని ప్రభుత్వం తెలిపింది. ఢిల్లీలో గత 24 గంటల్లో 1,683 కోవిడ్‌ -19 ‌రికవరీలు నమోదు కాగా, మరో 60 కోవిడ్‌ -19 ‌సంబంధిత మరణాలు కూడా నమోదయ్యాయని ప్రభుత్వం పేర్కొంది.

Leave a Reply