Take a fresh look at your lifestyle.

పింఛన్‌ ‌డబ్బులపై చర్చకు సిద్ధమా? బిజెపి నేతలకు మంత్రి హరీష్‌రావు సవాల్‌

‌పింఛన్‌ ‌డబ్బులపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నామనీ, బిజెపి నేతలు చర్చకు సిద్ధమేనా?అని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్‌రావు సవాల్‌ ‌విసిరారు. రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులకు, బీడీ కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 11వేల 720కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం కేవలం 210కోట్ల రూపాయలు మాత్రమే ఇస్తుందన్నారు. ఇంతకంటే ఒకపైసా కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వడం లేదన్నారు. వేల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంటే 210కోట్ల రూపాయలిస్తున్న కేంద్ర ప్రభుత్వమే పింఛన్లన్నీ తామే ఇస్తున్నట్లుగా బిజెపి నేతలు చెప్పుకోవడం సిగ్గుచేటు అని మంత్రి హరీష్‌రావు అన్నారు.

మంగళవారం సిద్ధిపేట జిల్లా రాయపోల్‌కు చెందిన బిజెపి నేతలు బాల్‌లక్ష్మీ, సురేష్‌ ‌తన అనుచరులు సుమారు 200మందితో మంత్రి హరీష్‌రావు టిఆర్‌ఎస్‌ ‌పార్టీలో చేరారు. టిఆర్‌ఎస్‌లో చేరిన బిజెపి నేతలు, కార్యకర్తలకు మంత్రి తన్నీరు హరీష్‌రావు గులాబీ కండువాను కప్పి టిఆర్‌ఎస్‌ ‌పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ..జోరు వానలో కూడా వందలాది మంది పార్టీ నేతలు, శ్రేణులు ముఖ్యంగా మహిళలు ఈ సమావేశానికి హాజరు కావడం సంతోషంగా ఉందన్నారు. భర్తను కోల్పోయి పుట్టెదు దుంఖంలో ఉన్న టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత-రామలింగారెడ్డికి తాను, ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి కుడి, ఎడమ భుజంగా ఉంటామనీ మరోసారి స్పష్టం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply