Take a fresh look at your lifestyle.

లక్ష ఉద్యోగాల భర్తీపై…. బహిరంగ చర్చకు సిద్ధమేనా ?

అబద్ధాలతో నిరుద్యోగులను మోసం చేస్తున్నారు
టీజేఎస్‌ ‌రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌

‌లక్ష ఉద్యోగాలు భర్తీ చేశామని చెబుతున్న ప్రభుత్వం దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమేనా ? అని టీజేఎస్‌ ‌రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌ ‌సవాల్‌ ‌విసిరారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల 80 వేల ఉద్యోగాల భర్తీకి వెంటనే క్యాలెండర్‌ ‌ప్రకటించాలని డిమాండ్‌ ‌చేశారు. శనివారం నాంపల్లిలోని టీజేఎస్‌ ‌రాష్ట్ర కార్యాలయంలో విద్యార్థి జన సమితి, యువజన సమితి ఆధ్వర్యంలో ఉద్యోగాల సాధనకై నిరుద్యోగుల నిరసన దీక్ష జరిగింది. ఈ సందర్భంగా దీక్షకు ముఖ్య అతిధిగా హాజరై కోదండరామ్‌ ‌మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగ ఖాళీలు ఉన్నాయో శ్వేతపత్రం ప్రకటించాలనీ,ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా నిరుద్యోగ భృతిని కల్పించాలని డిమాండ్‌ ‌చేశారు. టీఆర్‌ఎస్‌• ‌ప్రభుత్వం ఇప్పటి వరకు టీఎస్‌పీఎస్‌సీ ద్వారా భర్తీ చేసింది కేవలం 36 వేల ఉద్యోగాల మాత్రమేననీ, అందుకు భిన్నంగా ప్రభుత్వం లక్ష ఉద్యోగాలు భర్తీ చేశామని అబద్ధాలు ప్రచారం చేస్తున్నదని విమర్శించారు.

ప్రైవేటు విద్యా సంస్థలలో పనిచేస్తున్న టీచింగ్‌, ‌నాన్‌ ‌టీచింగ్‌ ‌సిబ్బందిని ఆదుకోవాలనీ, పరిశ్రమలలో స్థానికులకు 85 శాతం ఉద్యోగ వాటా కల్పించాలని డిమాండ్‌ ‌చేశారు. అదేవిధంగా రాష్ట్రంలోని నిరుద్యోగులు ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారనీ, ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని స్పష్టం చేశారు. అందుకే అక్టోబర్‌ 2‌న గాంధీ జయంతి సందర్బంగా నిరుద్యోగులు చనిపోవద్దు, బ్రతికుండి కొట్లాడుదామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థి జన సమితి రాష్ట్ర కన్వీనర్‌ ‌నిజ్జన రమేశ్‌, ‌యువజన సమితి రాష్ట్ర కో కన్వీనర్‌ ‌సయ్యద్‌ ‌సలీం పాషా మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగాలు సాధించే వరకు తమ పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. ఏ ముఖం పెట్టుకుని నిరుద్యోగులు, పట్టభద్రుల ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్న ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే విధంగా భారీ కార్యాచరణ తీసుకుంటున్నామని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటి వరకు నిరుద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించలేదనీ, ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు త్వరలోనే వస్తుందని హెచ్చరించారు. ఈ దీక్షకు ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలుమూరి వెంకట్‌యాదవ్‌, ‌మద్దతు తెలుపగా, విద్యార్థి, యువజ నేతలు రామన్‌సింగ్‌, ‌నకిరికంటి నరేందర్‌, ‌శేఖర్‌ ‌యాదవ్‌, ‌వీరన్న, సుశీల్‌కుమార్‌, ‌విజయ్‌, ‌మణి, ప్రసాద్‌, ‌నవీన్‌ ఉన్నారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్‌ ‌నేతలు రమేశ్‌రెడ్డి, శ్రీశైల్‌రెడ్డి, శ్రీధర్‌, ‌రాంచందర్‌ ‌పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply