Take a fresh look at your lifestyle.

ఎల్ఆర్ఎస్ పై న్యాయ పోరాటానికి సిద్ధం

హైకోర్టు లో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  పిటిషన్…
టీఆరెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఎల్ఆర్ఎస్ ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు…ఎల్ఆర్ఎస్ ద్వారా పేద ,మధ్య తరగతి కుటుంబాలు నష్టాలకు గురౌతారని  ఎప్పుడో తీసుకున్న స్థలానికి మళ్ళీ డబ్బులు కట్టలేరని వివరిస్తూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో కోమటిరెడ్డి పిటీషన్ దాఖలు చేశారు.సోమవారం ఎల్ఆర్ఎస్ ఫై హై కోర్ట్ ని ఆశ్రయించి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 131 లో ముఖ్యంగా రూల్ 10 మరియు రూల్ 13 విధులు మరియు నిష్క్రియాత్మకత యొక్క విరమణకు పర్యవసానంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో చట్టవిరుద్ధమైన మరియు ఆమోదించబడని లేఅవుట్లను  నిరోధించడానికి 2020 ప్రభుత్వ నియమాలు నిబంధనలను జారీ చేసి పేద,మధ్యప్రజలు వారి తప్పు లేకున్న  భారీ జరిమానా విధించాల్సి ఉంటుందని ఇది సరికాదన్నారు.

సామాన్య ప్రజలు కొనుగోలు చేసిన ప్లాట్లు వారి కష్టపడి సంపాదించినవి  ఇప్పుడు వారిపై ఇంత భారీ జరిమానా విధిస్తున్నారని ఎప్పుడో కొన్న ప్లాట్ యొక్క కొనుగోలు ధరలో దాదాపు సగం మళ్ళీ కట్టాల్సి వస్తుందన్నారు. అనుమతి లేని లే అవుట్లకి పూర్తి బాధ్యత ప్రభుత్వ అధికారులదే అనిఅనుమతులు లేని వెంచర్లపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుందని అన్నారు. అధికారులు పాటించని తప్పుకు సామాన్య ప్రజలపై భారీ జరిమానా విధించడం సరైనది కాదన్నారు.సాధారణ ప్రజల భూములను రిజిస్ట్రేషన్ చేయడాన్ని నిషేధించే నిబంధనలు 2020 జారీ చేయడం రిజిస్ట్రేషన్ చట్టానికి విరుద్ధమన్నారు. చట్టాలను పాటించకుండా అటువంటి అనుమతులు మంజూరు చేసిన అప్పటి అధికారుల పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఎలాంటి జరిమానా ఛార్జీలు మరియు రిజిస్ట్రేషన్లను ఆపకుండా రెగ్యులరైజేషన్ చేయాలన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!