Take a fresh look at your lifestyle.

ఆర్థిక సంక్షోభ పరిష్కారానికి ఆర్బీఐ చర్యలు చాలవు

“బ్యాంకింగ్‌ ‌రెగ్యులేటరీ విధానాల్లో మార్పులు చేయనున్నట్టు గవర్నర్‌ ‌ప్రకటించారు. అందువల్ల సూక్ష్మ, లఘు, సంస్థలకు రుణాలను పెంచాలని రిజర్వు బ్యాంకు నిర్ణయించింది. రియల్‌ ఎస్టేట్‌ ‌వ్యవస్థకు రుణాలు ఇచ్చే విధానాన్ని పునర్వ్యవస్థీకరించేందుకు బ్యాంకు నిర్ణయించింది. ఇది ఒక రకంగా  మేలే కానీ, ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న  మౌలికమైన సమస్యలకు పరిష్కారాన్ని చూపదు. రిజర్వు బ్యాంకు ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఒక త్రైమాసికానికి లేదా అంతకన్నా ఎక్కువ కాలానికి   రుణ పంపిణీకి తోడ్పడవచ్చు నేమో కానీ, అసలు సమస్యలను పరిష్కరించజాలదు.”

Banking Regulatory

ఆర్థిక రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రిజర్వు బ్యాంకు సులభమార్గాన్ని ఎంచుకుంది. ఈ రంగం ఎదుర్కొంటున్న వ్యవస్థీకృత సమస్యల పరిష్కారానికి రిజర్వు బ్యాంకు తీసుకున్న నిర్ణయాలు ఏమాత్రం ఉపయోగపడవు. కొన్ని రంగాలు తిరిగి పుంజుకోవడానికి రుణాలు ఇచ్చేందుకు రిజర్వు బ్యాంకు క్రమబద్ధమైన చర్యలు తీసుకుంది. అయితే, ఆర్థిక రంగం ఎదుర్కొంటున్న మౌలికమైన సమస్యల పరిష్కారానికి రిజర్వు బ్యాంకు తీసుకున్న చర్యలు ఎంత మాత్రం ఉపయోగపడవు. ఫిబ్రవరి ఆరవ తేదీన రిజర్వు బ్యాంకు గవర్నర్‌ ‌శక్తికాంత్‌ ‌దాస్‌ ‌రెండు ప్రధానమైన ప్రకటనలు చేశారు. అందులో మొదటిది ద్రవ్యవిధాన కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించడం. రెండోది కొన్ని రంగాలకు రుణాల పరిమాణాన్ని పెంచుతున్నట్టు ప్రకటించారు. వడ్డీ రేట్లలో మార్పులు చేయడం లేదని ప్రకటించారు. పాలసీ రేట్లు యథాతథంగా కొనసాగుతాయని ప్రకటించారు. ద్రవ్య విధాన కమిటీ రెపో రేట్లను పెంచడం కానీ, తగ్గించడం కానీ చేస్తుంది. రెపో రేట్లను యథాతథంగా కొనసాగించాలని ఈ కమిటీలోని ఆరుగురు సభ్యులు స్పష్టం చేశారు. వినియోగదారుల ధర సూచి 7.5 శాతం ఉంది. అంటే నాలుగు శాతం లక్ష్యాన్ని మించి ఉంది. అందువల్ల ఆర్బీఐ ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఊహించిందే. మరో రెండు త్రైమాసికాల పాటు ద్రవ్యోల్బణం లక్ష్యాల స్థాయి కన్నా ఎక్కువ ఉండవచ్చని అంచనా వేయడం జరిగింది. అందువల్ల ద్రవ్య విధాన కమిటీ రేట్ల కోతను సూచించలేదు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండటానికి కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతుంటమే కారణం. ఉల్లిపాయేతర కూరగాయల ధరల వల్ల ద్రవ్యోల్బణం పెరిగింది. కూరగాయల ధరల వల్ల ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడితే, ద్రవ్య పర్యవేక్షణ కమిటీ రేట్లను మరింత తగ్గించవచ్చు. ఈలోగా రిజర్వు బ్యాంకు బ్యాంకులకు లక్ష కోట్ల రూపాయిలను విడుదల చేయనుంది.

ద్రవ్యపరపతి విధానాన్ని మెరుగు పర్చేందుకు రిజర్వు బ్యాంకు ఈ చర్య తీసుకోనుంది. బ్యాంకింగేతర ఆర్థిక కంపెనీల సంక్షోభం వల్ల ఇన్‌ ‌ఫ్రాస్ట్రక్చర్‌ ‌ఫైనాన్షయల్‌ ‌సర్వీసెస్‌ ‌రుణాల కోసం ఆవురావురు మంటూ ఉంది. ద్రవ్య ప్రాధికార సంస్థగా ఈ విషయంలో తాను వహించాల్సిన పాత్రను వహించలేదు. బ్యాంకింగ్‌ ‌రెగ్యులేటరీ విధానాల్లో మార్పులు చేయనున్నట్టు గవర్నర్‌ ‌ప్రకటించారు. అందువల్ల సూక్ష్మ, లఘు, సంస్థలకు రుణాలను పెంచాలని రిజర్వు బ్యాంకు నిర్ణయించింది. రియల్‌ ఎస్టేట్‌ ‌వ్యవస్థకు రుణాలు ఇచ్చే విధానాన్ని పునర్వ్యవస్థీకరించేందుకు బ్యాంకు నిర్ణయించింది. ఇది ఒక రకంగా మేలే కానీ, ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న మౌలికమైన సమస్యలకు పరిష్కారాన్ని చూపదు. రిజర్వు బ్యాంకు ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఒక త్రైమాసికానికి లేదా అంతకన్నా ఎక్కువ కాలానికి రుణ పంపిణీకి తోడ్పడవచ్చు నేమో కానీ, అసలు సమస్యలను పరిష్కరించజాలదు. 2008 నుంచి అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభం ప్రపంచ దేశాలను వెంటాడుతోంది. అయితే, మన దేశంలో రిజర్వు బ్యాంకు తీసుకున్న చర్యల కారణంగా ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఏర్పడలేదు. అయితే, అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం కారణంగా ఏర్పడిన పరిస్థితులను పూర్తిగా అవగతం చేసుకుని పరిష్కారాన్ని కనుగొనడంలో మన బ్యాంకింగ్‌ ‌రంగం విఫలమైంది. దాంతో రికవరీ కొద్దిపాటి మాత్రమే నమోదు అయింది. దివాలా చట్టాన్ని చేసిన తర్వాత కూడా కంపెనీలపై కేసులు నమోదు చేయడంలో, విచారణలో జాప్యం కావడం వల్ల నిరర్థక ఆస్తుల రికవరీ చాలా మందకొడిగా సాగుతోంది. బకాయి పడిన కంపెనీల ఆస్తులను విక్రయించి రికవరీని చేపట్టాలి, మన దేశంలో ఇది అమలుచేయడం చాలా కష్టం. అంతేకాక, మొండి బకాయిలను గుర్తించడం కూడా చాలా కష్టం. ఒతిడులను తట్టుకోవడం కష్టం. ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉన్నతాధికారులు దర్యాప్తు సంస్థలంటే భయపడుతుంటారు. అందువల్ల మొండి బకాయిల వసూలు చాలా నెమ్మదిగా జరుగుతోంది. పన్నులను సత్వరం పరిష్కరిస్తామన్న వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోతోంది. మొండి బకాయిదారులను కోర్టులకు ఎక్కించాలి. అయితే అది సాధ్యం కాకపోవడంతో బకాయిల వసూలు నెమ్మదిగా సాగుతోంది. కొత్త రుణాల బట్వాడా కూడా చురుకుగా సాగడం లేదు. దీని వల్ల బ్యాంకింగ్‌ ‌రంగంపై ఆశలు ఆవిరి అవుతున్నాయి. బ్యాంకులు మరింత చురుకుగా పని చేయడానికి రిజర్వు బ్యాంకు తీసుకున్న చర్యలు సరిపోవు. అందుకే మధ్యే మార్గాన్ని ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. అయితే, ప్రభుత్వం కన్నా రిజర్వు బ్యాంకు ఈ విషయంలో ఎక్కువ చొరవను ప్రదర్శించిందని చెప్పవచ్చు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply