Take a fresh look at your lifestyle.

కీలక వడ్డీరేట్లు భారీగా పెంచిన ఆర్‌బిఐ

  • రెపోరేటును 50 బేసిస్‌ ‌పాయింట్ల మేర పెంపు
  • పెరగనున్న బ్యాంక్‌ ‌రుణాల వడ్డీల రేట్లు
  • ఇఎంఐలపైనా తీవ్ర ప్రభావం పడే ప్రమాదం

ముంబై, ఆగస్ట్ 5 : ‌రుణగ్రహీతలపై మరో పిడుగు పడింది. అందరూ ఊహించినట్లే వడ్డీ రేట్లను రిజర్వ్ ‌బ్యాంక్‌ ‌మరోసారి పెంచింది. అంతకంతకూ విజృంభిస్తున్న ధరల భూతానికి క్లళెం వేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. రెపో రేటును ఆర్‌బీఐ పెంచడం వరుసగా ఇది మూడోసారి.ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా కీలక వడ్డీ రేట్లను రిజర్వు బ్యాంకు  మరోమారు పెంచింది. అందరూ ఊహించినదానికన్నా ఎక్కువగా రెపోరేటును 50 బేసిస్‌ ‌పాయింట్ల మేర పెంచి 5.4శాతంగా నిర్ణయించింది. ఫలితంగా రెపో రేటు కొవిడ్‌ ‌ముందు స్థాయికి చేరింది. . ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మేలో ద్వైమాసిక సక్ష లేకపోయినా.. 40 బేసిస్‌ ‌పాయింట్లు పెంచి, 4.40 శాతం చేసింది. జూన్‌లో జరిగిన ద్వైమాసిక సక్షలో మరో 50 బేసిస్‌ ‌పాయింట్లు పెంచి, 4.90 శాతం చేసింది. ఇప్పుడు వరుసగా మూడోసారి వడ్డీ రేట్ల పెంపుతో.. రెపో రేటు కొవిడ్‌ ‌ముందు స్థాయిని దాటింది.

ఆర్‌బీఐ గవర్నర్‌శక్తికాంత దాస్‌ ‌నేతృత్వంలో మూడు రోజులు సమావేశమై ప్రస్తుత పరిస్థితులపై విస్తృతంగా చర్చించిన ద్రవ్యపరపతి విధాన కమిటీ.. ఈమేరకు శుక్రవారం ప్రకటన చేసింది. శక్తికాంత దాస్‌ ‌చెప్పిన కీలక విషయాలనుగమనిస్తే.. ఆర్థిక వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్‌ ‌తగ్గించింది. మాంద్యం ముప్పు ఉందని హెచ్చరించింది. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ అధిక ద్రవ్యోల్బణంతో సతమతమవుతోంది. భారత్‌ ‌నుంచి గత కొద్ది నెలల్లో 13.3 బిలియన్‌ ‌డాలర్ల పెట్టుబడులు వెళ్లిపోయాయి.అయితే..్గ •నాన్షియల్‌ ‌సెక్టార్‌? ‌బాగానే ఉంది. భారత్‌? ‌వద్ద ఉన్న విదేశీ మారక నిల్వలు.. అంతర్జాతీయ ప్రతికూలతల నుంచి రక్షణ కల్పిస్తాయి.వినియోగదారుల ధరల సూచీ అధికంగా ఉంది. కొంతకాలం 6శాతంపైనే కొనసాగే అవకాశముంది. ద్రవ్యోల్బణం కట్టడి కోసం రెపో రేటును 50 బేసిస్‌ ‌పాయింట్లు పెంచి 5.4శాతం చేయాలని ద్రవ్యపరపతి విధాన కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. అకామొడేటివ్‌ ‌స్టాన్స్?‌ను వీడడంపై దృష్టిపెట్టాలని తీర్మానించింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.2శాతం వృద్ధి నమోదు కావొచ్చన్న అంచనాలకు కట్టుబడి ఉన్నాం. సాధారణ వర్షపాతం, ముడి చమురు బ్యారెల్‌ ‌ధర 105 డాలర్లు ఉండొచ్చన్న లెక్కలతో.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 6.7శాతం నమోదవుతుందన్న అంచనాలను అలానే కొనసాగిస్తున్నాం. అయితే.. అంతర్జాతీయ పరిణామాలు దేశ ఆర్థిక వృద్ధికి ప్రతికూలంగా మారే అవకాశముంది.వంట నూనెల ధరలు మరింత తగ్గుతాయి. ద్రవ్యోల్బణం ఆరు శాతంలోపు ఉండేలా చూడాలని రిజర్వు బ్యాంకు లక్ష్యంగా పెట్టుకుంది. అయితే.. రష్యా-ఉక్రెయిన్‌ ‌యుద్ధం, ముడి చమురు ధరలు, ఇతర కారణాలతో జనవరి నుంచి ధరల సూచీ ఎగువ స్థాయిలోనే కొనసాగుతోంది. జూన్‌లో 7.01శాతంగా నమోదైంది. టోకు ధరల ద్రవ్యోల్బణం 15.18శాతంగా నమోదైంది.

ద్రవ్యోల్బణం కట్టడికి వడ్డీ రేట్ల పెంపే ఉత్తమ మార్గమని భావించిన ఆర్‌?‌బీఐ.. అందుకు అనుగుణంగా ఇప్పుడు చర్యలు తీసుకుంది.ఖీఃఎ సజీబి। ఠతీ। 2022 : 2020 ఆరంభంలో కరోనా వ్యాప్తికి ముందు రెపో రేటు 5.15శాతంగా ఉండేది. కొవిడ్‌ ‌ముందే వృద్ధిరేటు మందగించడంతో, రెపోరేటును 2019 ఫిబ్రవరి నుంచి ఆర్‌బీఐ తగ్గిస్తూ వచ్చింది. కొవిడ్‌ ‌తొలిరోజుల్లో 2020లో మార్చి, మే నెలల్లో 75 బేసిస్‌ ‌పాయింట్లు; 40 బేసిస్‌ ‌పాయింట్ల చొప్పున కోత వేసింది. 2019 నుంచి 2020 మేలోపు రెపోరేటులో 250 బేసిస్‌ ‌పాయింట్ల మేర కోత విధించి, రికార్డు కనిష్ఠమైన 4 శాతానికి చేర్చింది. ఆ తర్వాత 11 సార్లు ద్వైమాసిక సక్ష జరిగినా, రేట్లు సవరించలేదు.

Leave a Reply