Take a fresh look at your lifestyle.

రాయలసీమ లిఫ్టులను తక్షణం ఆపాల్సిందే

ఏపీ ప్రభుత్వానికి కృష్ణా రివర్‌మేనేజ్‌మెంట్‌ ‌బోర్డు ఆదేశం

రాయల సీమ లిప్ట్ ఇరిగేషన్‌ ‌స్కీమును వెంటనే నిలిపివేయాల్సిందిగా కృష్ణా రివర్‌మేనేజ్‌మెంట్‌ ‌బోర్డు ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం కృష్ణానదిపై కొత్త
ప్రాజెక్టుల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేయడాన్ని కృష్ణా రివర్‌మేనేజ్‌మెంట్‌బోర్డు తప్పుబట్టింది. ఈ మేరకు కేఆర్‌ఎం‌బి సభ్యుడు హరికేశ్‌‌నా ఆంధ్రప్రదేశ్‌  ‌జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లిఖితపూర్వక ఆదేశం పంపారు. కొత్త ప్రాజెక్టుల నిర్మాణ పనుల విషయంలో కేంద్ర జలసంఘం అనుమతి లేకుండా ముందుకు వెళ్లడానికి వీల్లేదని ఏపీ ప్రభుత్వాన్ని బోర్డు హెచ్చరించింది.
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణానీటిని అక్రమంగా మళ్లించేందుకు ఆంధ్ర ప్రదేశ్‌ ‌ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పునర్విభజన చట్టానికి విరుద్ధమైందని కృష్ణారివర్‌ ‌మేనేజ్‌మెంట్‌బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదుచేసింది. ఈనేపథ్యంలో కృష్ణా వాటర్‌బోర్డు ప్రతిస్పందిస్తూ ఆంధ్ర ప్రదేశ్‌ ‌ప్రభుత్వానికి ఈ లేఖ రాసింది. ఏపీ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులను నిర్మించడానికి వీల్లేదని స్పష్టంగా పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌ ‌పునర్విభజన చట్టం సెక్షన్‌ 84, ‌పేరా 7లోని నిబంధనలకు వ్యతిరేకంగా ఆంధ్ర ప్రదేశ్‌ ‌ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసిందని బోర్డు తప్పుబట్టింది. కొత్త ప్రాజెక్టులేమైనా ముందుగా వాటి సమగ్ర నివేదిక (డీపీఆర్‌)‌ను కేంద్ర జలవనరుల సంఘానికి సమర్పించి, అపెక్స్ ‌కమిటీ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. అందుకు భిన్నంగా ఆంధ్ర ప్రదేశ్‌ ‌ప్రభుత్వం తీసుకునే ఏ చర్యలైనా చట్టాన్నిఉల్లంఘంచడమే అవుతుందని బోర్డు నిర్ధిష్టంగా పేర్కొన్నది.

Leave a Reply