Take a fresh look at your lifestyle.

రాయలసీమ లిఫ్ట్ ‌స్కీమ్‌ ‌ప్రగతి భవన్‌ ‌నజరానా..!

  • పంచభక్ష ఫలహారాలు పెట్టి జీవో 203తో ఏపికి సహకరించారు
  • కోవర్ట్ ఎక్స్‌పర్ట్ ‌కళలో కౌశిక్‌ ‌రెడ్డికి గవర్నర్‌ ‌కోటాలో ఎమ్మెల్సీ
  • ప్రధాని మోడితో ఎంపి సంతోష్‌ ‌మీటింగ్‌ ‌రహ్యసాన్ని బయట పెట్టాలి: కాంగ్రెస్‌ ఎం‌పీ రేవంత్‌ ‌రెడ్డి

రాయలసీమ లిఫ్ట్ ‌నిర్మాణానాకి అవసరమైన 203 జీవోను ప్రగతి భవన్‌లో తయారు చేసి కేసీఆర్‌, ఏపి సిఎంకు నజరానగా ఇచ్చారని టీపీసీసీ ఎంపి రేవంత్‌ ‌రెడ్డి ఆరోపించారు. ఏపి అసెంబ్లీ వేదికగా జగన్‌ ‌రాయలసీమ, పోతిరెడ్డి పాడు విస్తరణపై ప్రకటించిన అనంతరం… కేసీఆర్‌ ‌రెడ్‌ ‌కార్పెట్‌ ‌వేసి ఏపి సిఎంను ఆహ్వానించారని అన్నారు. పంచ భక్ష లతో భోజనాలు పెట్టి రాయలసీమ లిఫ్ట్ ‌నిర్మాణానికి సహకరించారు అని ఆరోపించారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ ‌లో రేవంత్‌, ‌తెలంగాణ కాంగ్రెస్‌ ‌క్యాంపేన్‌ ‌కమిటీ చైర్మన్‌ ‌మధు యాష్కి తో కలిసి మీడియాతో మాట్లాడారు. రాయలసీమ లిఫ్ట్ ‌స్కీం, పోతిరెడ్డి పాడు విస్తరణపై కృష్ణా రివర్‌ ‌మేనేజ్మెంట్‌ (‌కేఆర్‌ఎం‌బి) నిర్వహించిన సమావేశాలకు కేసీఆర్‌ ‌గైర్హజరయ్యారన్నారు. టెండర్లు పిలిచినప్పుడు, ఒప్పందాలు చేసినటప్పడు తెలంగాణకి అన్యాయం జరిగినప్పుడు ప్రతిపక్షంగా కాంగ్రెస్‌ ‌నిలదీసిందన్నారు. ప్రభుత్వానికి గుర్తు చేస్తే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన సిఎం… తాజాగా నాగార్జున సాగర్‌ ‌పర్యటనలో కేంద్రం తెలంగాణ హక్కులకు భంగం కలిగిందస్తుందని చెబుతున్నారు.

ఏడేండ్లలో కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయల్‌ ‌సాగర్‌, ‌సీతారామ సాగర్‌, ఇం‌దిరా సాగర్‌, ‌రాజీవ్‌ ‌సాగర్‌ ‌లు ప్రాజెక్ట్ ‌లు పూర్తి చేసి ఉంటే, ఏపి సిఎం జగన్‌ ‌కేంద్రానికి కంప్లైట్‌ ‌చేసే అవకాశం వచ్చేది కాదన్నారు. కేసీఆర్‌ ‌రీ డిజైనింగ్‌ ‌పేరుతో వేల కోట్ల అవినీతి కి పాల్లపడుతున్నట్లు చెప్పారు. ప్రాణహిత చేవెళ్లను కాళేశ్వరంగా, పాలమూరు లిఫ్ట్ ‌స్కీం ను మార్చి టెండర్లు పిలిచారన్నారు. ఈ రెండు ప్రాజెక్ట్ ‌లకు ఇప్పటి వరకు దాదాపు లక్షా 20 వేల కోట్లు ఖర్చు పెట్టారని, అయితే కొత్తగా ఒక్క ఎకరానికి అదనంగా నీళ్లు ఇవ్వలేదన్నారు. గోదావరి నీళ్లను పాలేరు దగ్గర లిఫ్ట్ ‌చేసి, పెద్ద దేవరపల్లి దగ్గర పోస్తానంటూ కేసీఆర్‌ ‌కొత్త నాటకానికి తెరలేపారన్నారు. కోతుల పంచాయితీ పిల్లి తీర్చినట్లు… జగన్‌, ‌కేసీఆర్‌ ‌ల మధ్య కృష్ణా రెడ్డి కాంట్రాక్ట్ ‌లపేరుతో పంచాయితీ తీరుస్తాడంటూ విమర్శించారు. ఒక బేసిన్‌ ‌నుంచి మరో బేసిన్‌ ‌కు నీళ్ల ఎత్తిపోత పేరుతో రెండు లక్షల కోట్ల టెండర్ల ఇచ్చేందుకు పన్నాగం పన్నుతున్నట్లు ఉందన్నారు. గోదావరి జలాలను కృష్ణాలో పోస్తామని మెగా కంపెనీ తెలంగాణ కు మరో లక్ష కోట్ల అప్పు భారాన్ని మోపనుందన్నారు. వాటి వివరాలను భవిష్యత్‌ ‌లో బయటపెడుతామన్నారు.

మోడితో జోగినిపల్లి సంతోష్‌ ‌భేటి వెనుక ఏం రహస్యం వుంది..?
పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలిరోజు టీఆర్‌ఎస్‌ ‌రాజ్య సభ ఎంపి జోగిని పల్లి సంతోష్‌, ‌మిగితా ఐదుగురు సభ్యులతో కలిసి ప్రధాని మోడి ని కలిసారని అన్నారు. ఇందులో కేశవరావు కూడా ఉన్నారని చెప్పారు. కొద్ది సేపటి తర్వాత మిగిత ఎంపీలను బయటకు పంపి, కేవలం మోడి, సంతోష్‌ ‌లు చర్చ కొనసాగించారని ఆరోపించారు. ఈ మీటింగ్‌ ‌కు సంబంధించి నిర్ధిష్టమైన ఆరోపణ చేస్తున్నట్లు తెలిపారు. ఈ మీటింగ్‌ ‌ఫోటోలు పిఎంఓ నుంచి ఢిల్లీలోని సిఎం అదనపు వ్యక్తిగత కార్యదర్శికి చేరాయన్నారు. టీఆర్‌ఎస్‌ ఎం‌పీలు నిజంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, రాష్ట్ర హక్కులపై మోడిని కలిసి ఉంటే ఎందుకు వాటిని బహిర్గతం చేయలేదని అనుమానాన్ని వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్షుడైన కేసీఆర్‌ ‌కు తెలియకుండానే సంతోష్‌, ‌మిగితా సభ్యులతో కలిసి పిఎం ను కలిసే అవకాశం ఉందా? అని నిలదీశారు. రాష్రానికి రావాల్సిన నిధులపై మాట్లాడి ఉన్నా… కేసీఆర్‌ ‌వ్యక్తిగత చానల్స్ ‌లో వచ్చేవన్నారు. సమస్యలపై మాట్లాడి ఉంటే, బహిరంగంగా మాట్లాడవచ్చన్నారు. బిజేపి, టీఆర్‌ ఎస్‌ ‌మధ్య ఉన్న రహస్య ఒప్పందం ఏంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. దళిత బందు పేరుతో… దళితుల రాబందుగా మారిన కేసీఆర్‌ ‌పై విధానాలకు వ్యతిరేకంగా ఆగష్టు 9 నుంచి సెప్టెంబర్‌ 17 ‌వరకు దళిత %–% గిరిజన ఆత్మగౌరవ దండోర నినాదంతో ప్రజల్లోకి వెళ్లనున్నట్లు చెప్పారు.

కౌశిక్‌ ‌రెడ్డి కోవర్టు ఎక్స్‌పర్ట్….
‌కౌశిక్‌ ‌రెడ్డి కోవర్ట్ ఆపరేషన్‌ ‌లో ఎక్స్ ‌పర్ట్ అని రేవంత్‌ అన్నారు. 64 కళల్లో ఏదో కళలో ప్రావీణుడైన వారికి, సైంటిస్టు, డాక్టర్లకు రాష్ట్రపతి కోటాలో ఎంపి, గవర్నర్‌ ‌కోటాలో ఎమ్మెల్సీ గా నామినేట్‌ ‌చేస్తారన్నారు. కానీ, 65 వ కళగా కోవర్టు ఆపరేషన్‌ ‌ను గుర్తించిన కేసీఆర్‌ ‌కౌశిక్‌ ‌రెడ్డికి ఎమ్మెల్సీగా ఎంపిక చేశారని ఎద్దేవా చేశారు. మానుకోట లో ఉద్యమకారులను రాళ్లతో కొట్టిన వ్యక్తికి గవర్నర్‌ ‌కోటాలో ఎమ్మెల్సీ నామినేట్‌ ‌చేస్తే బిజేపి నేతలెవరూ మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఉద్యమకారులను పలుగు రాళ్లతో కొట్టిన వ్యక్తికి ఎమ్మెల్సీ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ‌హయాంలో వివిధ రంగాల్లో నిపుణులుగా, నిష్ణాతులుగా పేరుగాంచితే వారికి అవకాశం కల్పించినట్లు చెప్పారు.

బండి సంజయ్‌ ‌పాదయాత్ర ఎందుకు రద్దయింది
ఆగష్టు 9 నుంచి ప్రారంభించాల్సిన పాదాయాత్రను కేసీఆర్‌ ఒత్తిడితోనే బండి సంజయ్‌ ‌రద్దు చేసుకున్నారని రేవంత్‌ ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ ‌లో బిజేపి కి సంబంధించిన నిర్ణయాలు జరుగుతున్నాయో లేదో కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి, బండిసంజయ్‌ ‌చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. ఢిల్లీ, ప్రగతి భవన్‌ ‌లో జరుగుతోన్న రాజకీయ అవగాహన ఒప్పందాలు బహిర్గతం అయ్యాయన్నారు. పార్లమెంట్‌ ‌ప్రారంభమై 15 రోజులు గడుస్తోన్న మోడి విధానాలకు వ్యతిరేకంగా, ఏపి పునర్వీభజన చట్టంలోని అంశాలపై టీఆర్‌ఎస్‌ ఎం‌పీలు ఎందుకు పోరాడడం లేదన్నారు. కేంద్ర వైఖరికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఆందోళన చేస్తుంటే ఎందుకు కలిసి రావడం లేదని ప్రశ్నించారు. మంగళవారం రాహుల్‌ ‌గాంధీ అధ్వర్యంలో జరిగిన ప్రతిపక్షాల మీటింగ్‌ ‌రాకుండా… బిజేపి, టీఆర్‌ఎస్‌ ఒక్కటే అనే స్పష్టమైన వైఖరిని కేసీఆర్‌ ‌ప్రకటించారన్నారు. జాతీయ రాజకీయాల్లో భిన్న వైఖరిలు ఉంటే ఉండవచ్చుగానీ, తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాష్ట్రమే ముఖ్యమన్నారు. ఇవన్నీ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు. మోడి, కేసీఆర్‌ ‌కవలపిల్లలని… బిజేపికి టీఆర్‌ఎస్‌ అనుబంధ సంస్థ, ప్రంట్‌ ‌లైన్‌ ఆర్గనైజేషన్‌ ‌లాంటిదే అన్నారు.

కేసీఆర్‌ది తెలంగాణ రాబంధుల పార్టీ: మధు యాష్కీ
ప్రాణ త్యాగాలతో తెచ్చుకొన్న తెలంగాణ రాష్ట్రంలో అణిచివేత, ప్రశ్నించే గొంతులను మూసే ప్రయత్నం జరుగుతుందని మధు యాష్కి అన్నారు. టీఆర్‌ఎస్‌ ‌పార్టీ ని తెలంగాణ రాబంధుల పార్టీగా అభివర్ణించారు. ఉద్యోగాల రాక 3 నెలల్లో 14 మంది యువకులు మరణించారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల వేళ ఉద్యోగాల నోటిఫికేషన్‌ ‌ప్రస్తావనతో యువకుల్ని కేసీఆర్‌ ‌మోసం చేస్తున్నారన్నారు. ప్రభుత్వానికి ప్రజా వ్యతిరేకత మొదలైందన్నారు. నాళ్ల నీళ్లకు, బర్లకో, గొర్లకో.. ఈత తాటి చెట్లకోసం తెలంగాణ ఉద్యమయం జరగలేదన్నారు. ఆత్మగౌరవం కోసం… నీళ్లు, నిధులు, నియామకాలకోసం జరిగిందని గుర్తు చేశారు. ఎన్నికల వేళ టీఆర్‌ ఎస్‌, ‌బిజేపి పోట్లాడకుంటాయని, తర్వాత ఢిల్లీలో సఖ్యత మొదలవుతుందన్నారు. గతంలో కేటీఆర్‌, ‌కవిత, హరీష్‌ ‌రావులకు ఈడి నోటీసులు వచ్చిన విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ అవినీతిలో కూరుకుపోయాడని ఆరోపించారు.

Leave a Reply