Take a fresh look at your lifestyle.

‘‘హేతుబద్దం’’ కాని హేతుబద్దీకరణ

“చిన్న ఆవాసాలు, గిరిజన గూడెంలలో, కొండ ప్రాంతాలలోగతంలో ఆపరేషన్‌ ‌బ్లాక్‌ ‌బోర్డ్ ‌కింద ఏర్పాటు చేసిన వందలాది పాఠశాలలు హేతుబద్దీకరణ ఫలితంగా మూతబడుతాయి. వేలాది మంది పిల్లలకు బడి సౌకర్యం దూరమై డ్రాప్‌ అవుట్‌ల సంఖ్య పెరుగుతుంది.గిరిజన, మైదానప్రాంత ఆవాసాలలో ముఖ్యంగా అమ్మాయిల డ్రాపౌట్‌ ‌సమస్య పెరగటానికి ఎక్కువ అవకాశం ఉంది.ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల, విద్యార్థుల నిష్పత్తులు తక్కువగా ఉందని, నేడు 3750 పాఠశాలలు మూసివేతకు హేతుబద్ధీకరణ చేపడుతున్నది. ఫలితంగా ‘ప్రతి 500 జనాభాకు ఒక గ్రామ పంచాయితీ’ పేరిట ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామాల్లో హేతుబద్ధీకరణ జరిగితే కనీసం గ్రామ పంచాయతీకి ఒక బడి కూడా ఉండని దుస్థితి నెలకొంటుంది.”

వేల సంఖ్యలో బడులను మూసివేసి,లక్షలాది మంది నిరుపేద పిల్లలను ప్రభుత్వ విద్యకు దూరం చేసే పాఠశాలల హేతుబద్దీకరణకు మరోసారి సర్కార్‌ ‌సిద్దపడుతున్నది.గత రెండు సంవత్సరాల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం హేతుబద్ధీకరణ కొరకు విఫలప్రయత్నం చేసింది.విద్యార్థి,ఉపాధ్యాయుల, ప్రజాసంఘాలు,రాజకీయ పార్టీలు వ్యతిరేకించగా వెనక్కి తగ్గింది.2014 నుండి ‘‘రీలొకేషన్‌’’ ‌పేరిట ప్రతి జిల్లాలో వేలాది పాఠశాలలు మూసివేసి, నేడు మరోమారు ప్రభుత్వం హేతుబద్ధీకరణ ప్రతిపాదనలు చేస్తుంది. చిన్న ఆవాసాలు, గిరిజన గూడెంలలో, కొండ ప్రాంతాలలోగతంలో ఆపరేషన్‌ ‌బ్లాక్‌ ‌బోర్డ్ ‌కింద ఏర్పాటు చేసిన వందలాది పాఠశాలలు హేతుబద్దీకరణ ఫలితంగా మూతబడుతాయి. వేలాది మంది పిల్లలకు బడి సౌకర్యం దూరమై డ్రాప్‌ అవుట్‌ల సంఖ్య పెరుగుతుంది.గిరిజన, మైదానప్రాంత ఆవాసాలలో ముఖ్యంగా అమ్మాయిల డ్రాపౌట్‌ ‌సమస్య పెరగటానికి ఎక్కువ అవకాశం ఉంది.ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల, విద్యార్థుల నిష్పత్తులు తక్కువగా ఉందని, నేడు 3750 పాఠశాలలు మూసివేతకు హేతుబద్ధీకరణ చేపడుతున్నది. ఫలితంగా ‘ప్రతి 500 జనాభాకు ఒక గ్రామ పంచాయితీ’ పేరిట ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామాల్లో హేతుబద్ధీకరణ జరిగితే కనీసం గ్రామ పంచాయతీకి ఒక బడి కూడా ఉండని దుస్థితి నెలకొంటుంది.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు తగ్గిందని, నిర్వహణ వ్యయం పెరుగుతుందనే నెపంతో వందలాది గ్రామాలను ప్రభుత్వ విద్యకు దూరం చేయటం శాస్త్రీయ అవగాహన లేని చర్యగా భావించాల్సిందే! గత ఏడేళ్ళుగా ఉపాధ్యాయ ఖాళీలు లక్షలలో పెరిగినా నియమాకాలు లేవు.పదోన్నతులు లేక ఉన్నత పాఠశాలల్లో విషయనిపుణులు లేరు. ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మండల స్థాయి పర్యవేక్షణకు విద్యాధికారుల పదోన్నతులు లేవు. ఆరేళ్ళుగా విద్యారంగం పైప్రభుత్వ బడ్జెట్‌లో నిధులు తగ్గుతూవచ్చాయి. ప్రభుత్వ బడి ఆవాసాలలో లెక్కకు మించి నిబంధనలకు విరుద్దంగా ప్రయివేట్‌ ‌బడులకు అనుమతులు ఇవ్వటం జరిగిందిప్రభుత్వ బడులలో భౌతిక వనరులు కల్పించలేక పోవడం ప్రభుత్వ పాఠశాల విద్యలో శాస్త్రీయత లోపించిన అవగాహన రాహిత్యంతో కూడిన పాలనావైఖరులు, మితి మీరిన రాజకీయ జోక్యం తదితర కారణాలు పరిగణనలోకి తీసుకోవాలి. ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలలు,ఉన్నత పాఠశాలలు సంఖ్య తగ్గడానికి వాస్రవ కారణాలు ఏమిటానేది, ఇందుకు బాధ్యత ఎవరిదనేది జనాభిప్రాయ సేకరణ చేసి, హేతుబద్దంగానే క్షేత్ర స్థాయిలో విచారణ చేయించాలి. ఊరిలో వుంటేనే బడితోటే అక్షరాస్యత, సామాజిక బాధ్యత, ఉపాధి కలిసి వస్తుంది. బడి లేకపోతే ఊరిపిల్లలు కూలి పనుల వైపు మళ్ళుతారు. యువత బాధ్యత లేకుండా ఉంటారు కాబట్టి ప్రభుత్వం విద్యార్థులు లేరని ప్రభుత్వ పాఠశాలను పాతరపెట్టడం పెట్టడం సరైనది కాదు.

ప్రభుత్వం హేతుబద్ధీకరణ క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలన చేసి ఒకే గ్రామపంచాయతీలో ని హాబిటేషన్‌ ‌లలో బడిఈడు గల పిల్లలు లేనట్లయితే వాటిని నిబంధనల మేరకు ఒక కిలోమీటరు పరిధిలోని పాఠశాలకు తరలించి ఆయా విద్యార్థులకు పూర్తి స్థాయిలో రవాణా చార్జీలు ఇవ్వడం కాకుండా రవాణా సౌకర్యం కల్పిస్తే డ్రాప్‌ అవుట్‌ ‌కాకుండా ఉంటారు.ప్రభుత్వం కొన్ని వర్గాల పిల్లలకు గురుకుల పేరుతో నూతనంగా పాఠశాల స్థాపించడం వలన గ్రామీణ ప్రాంతాల నుండి విద్యార్థుల నమోదు గురుకులాల వైపు మళ్ళింది.కాబట్టి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలోఉన్నటువంటి ఉన్నత పాఠశాలలు కూడా మినీ గురుకులాలురూపొందించి నిర్వహిస్తే విద్యార్థుల నమోదు శాతం.అధికంగా ఉంటుంది.ప్రతి ప్రాథమిక ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం అల్పాహారం, సాయంత్రం స్నాక్స్ ‌మధ్యాహ్నం పౌష్టికాహారం ఆందిస్తే విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.ఇవేవీ కూడా ప్రైవేటు పాఠశాలల్లో సౌకర్యాలు ప్రైవేటు యాజమాన్యం కల్పించదు.అదే విధంగా ప్రతి పాఠశాలలలో తరగతికి ఒక ఉపాధ్యాయుడు, తరగతికి ఒక గది, మూత్రశాలలు మరుగుదొడ్లు ఏర్పాటు చేసి వాటి నిర్వహణకు సర్వీస్‌ ‌పర్సన్స్ ఏర్పాటు చేయడం ఇవన్నీ చేసినట్లయితే పాఠశాలల పరిస్థితి ఆకర్షణీయంగా, అందంగా సిద్ధమైతే గ్రామీణ ప్రాంత ప్రజలు తమ కష్టార్జితాన్ని ప్రైవేట్‌ ‌పాఠశాలలకు పెట్టడం జరగదు. కాబట్టి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో మౌలికవసతులు కల్పించాల్సి ఉంది పోయి విద్యార్థుల రాకపోవడానికి కారణాలు అన్వేషించాల్సింది పోయి ఏక పక్ష నిర్ణయం తీసుకుంటే తెలంగాణ ఇప్పటికే 29 రాష్ట్రాల్లో అక్షరాస్యత తక్కువగాఉన్న రాష్ట్రాలలో కిందో నుండి మూడవ స్థానం లో ఉందని గుర్తించాలి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యాపరంగా ఏ మాత్రం అభివృద్ధి లేదనికూడా గుర్తించాలి.గత ఏదేళ్లుగా విద్య కు కేటాయిస్తున్న బడ్జెట్‌ ‌ను పరిశీలిస్తే విద్యపట్ల రాష్ట్ర ప్రభుత్వానికున్న చిత్త శుద్ధి ఏమిటో తెలీస్తుంది.రాజకీయ పార్టీలు పౌర సమాజం స్పందించి విద్యాపరిరక్షణ పోరాటం చేయాల్సిన పరిస్థితి ఆసన్నమైనది.ప్రభుత్వ బడులను మూసివేస్తే సమాజానికి భవిష్యత్తులో నష్టం జరుగుతుందనేది కూడా గుర్తించాల్సిన అవసరముంది.విద్యను వ్యాపారంగా ప్రభుత్వాలు చూసినంత కాలం విద్యా అభివృద్ధి కాదు. రాజ్యాంగ ప్రకారం గిరిజన ప్రాంతాల్లోని కొండలను గుట్టలలోని గూడెల పిల్లలకు చదువు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాని కుంది. గ్రామీణ ప్రాంతాల్లో గుడిసెలు ఆదివాసీలు, గిరిజనుల జీవన విధానాల ప్రకారం వారికి అందుబాటులో బడి ఉండాలి కానీ ఆ ప్రాంతంలో పిల్లలు లేరని అక్కడ బడిని తరలించడం వారి భవిష్యత్తును తరలించడం అవుతుంది. వారిని విద్యకు దూరం చేయటమవుతుంది కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేసి హేతుబద్ధీకరణ ఆలోచనను విరమించుకుని క్షేత్రస్థాయిలో హేతుబద్దంగా పరిశీలన చేసి పాఠశాలలను బ్రతికించాలి. పాఠశాలల హేతుబద్దీకరణ కు వ్యతిరేకంగా రాష్ట్రంలోని ప్రజలు, ప్రజాప్రతినిధులు, పార్టీలు, స్పందించాల్సిన కనీస బాధ్యత ఉన్నది.
– మైస శ్రీనివాస్‌. ‌రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
TPTF. తెలంగాణ.

Leave a Reply