Take a fresh look at your lifestyle.

రేషన్ బియ్యం స్మగ్లింగ్ ముఠా అరెస్ట్

 

 

● 20 క్వింటాల PDS బియ్యం పట్టివేత

● పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సొంత జిల్లాలో యదేశ్చగా సాగుతున్న స్మగ్లింగ్ దందా?

కరీంనగర్ జిల్లా, గన్నేరువరం మండల కేంద్రంలో S.I ఆవుల తిరుపతి ఆధ్వర్యంలో పోలీసుబృందం తనిఖీలు చేపట్టగా, రేషన్ బియ్యం స్మలింగ్ చేస్తున్న ముఠా రెడ్ హ్యాండేడ్ గా పట్టుపడ్డారు.

వివరాలలోకి వెళ్లితే, గన్నేరువరం మండల కేంద్రంలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ముందున్న కొలగాని అంజయ్య అలియాస్ గాండు అంజయ్య S/O గాండు మల్లయ్య (55) ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 20 క్వింటాళ్ల PDS రేషన్ బియ్యం పట్టుకున్నారు.

ఇదే గ్రామానికి చెందిన కొలగాని అంజయ్య అలియాస్ గాండు అంజయ్య అనే వ్యక్తి, మరో వ్యక్తి గంట వెంకటి S/o రాజయ్య మరికొందరితో కలిసి ముఠాగా ఏర్పడి, గత కొంత కాలంగా తన ఇంటిని అడ్డాగా చేసుకుని రేషన్ బియ్యం స్మగ్లింగ్ చేస్తున్నాడు. దగ్గరలో ఉన్న రేషన్ షాపులో బియ్యాన్ని దారిమళ్లిస్తు, రాత్రి పూట కరీంనగర్ జిల్లా కేంద్రానికి, సిద్దిపేట్ జిల్లాకు తరలిస్తున్నారు.

మండల S.I. ఆవుల తిరుపతి ఎప్పటినుంచో వీళ్ళమీద నిఘా పెట్టి వలపన్ని రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు.

పేద ప్రజలకు అందాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న అంజయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

దోషులను గట్టిగా విచారిస్తే పెద్ద స్మగ్లింగ్ రాకెట్ బయటపడే అవకాశం ఉంది.

పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సొంత జిల్లాలో, రేషన్ బియ్యం స్మగ్లింగ్ దందా యదేశ్చగా సాగుతుందని, ఈ స్మగ్లింగ్ ముఠాలను ఉక్కుపాదం తో అణిచివేయాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply