Take a fresh look at your lifestyle.

టీకా తీసుకోని వారికి రేషన్‌ ‌కట్‌

  • ప్రచారాన్ని ఖండించిన వైద్యారోగ్యశాఖ
  • సోషల్‌ ‌వి•డియాలో అబద్ధాలు ప్రచారం చేస్తే చర్యలు

టీకా తీసుకోనివారికి వొచ్చే నెల నుంచి రేషన్‌, ‌పింఛన్‌ ‌నిలిపివేస్తారని వైద్యారోగ్య శాఖ చెప్పినట్టు కొన్ని వి•డియా సంస్థలు, సోషల్‌ ‌వి•డియాలో వొస్తున్న ప్రచారంలో నిజం లేదని ప్రభుత్వం తెలిపింది. ఇలాంటి తప్పుడు వార్తలను ప్రజలు నమ్మవద్దని కోరింది. అలాంటి వార్తలు తప్పని ప్రజా వైద్యారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీ‌నివాసరావు స్పష్టం చేశారు. ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకోలేదని, ప్రజలు ఈ అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని, ఆందోళనకు గురికావద్దని ఆయన కోరారు.

తప్పుడు వార్తను ప్రసారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తామెక్కవా టీకాకు రేషన్‌, ‌పెన్షన్లకు లింక్‌ ‌పెట్టలేదన్నారు. అయితే టీకా తీసుకోవాల్సిందేనని అన్నారు. కొరోనా నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని, కొరోనా నియంత్రణకు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, సబ్బుతో చేతులు కడుక్కోవడం యథావిధిగా చేయాలన్నారు.

ఇదిలావుంటే వ్యాక్సినేషన్‌తో తమకు సంబంధం లేదని సివిల్‌ ‌సప్లై శాఖ తెలిపింది. వ్యాక్సినేషన్‌ అనేది వైద్యారోగ్య శాఖకు సంబంధించిన విషయమని పేర్కొంది. రేషన్‌ ‌కట్‌, ‌పెన్షన్‌ ఆపాలని ఉన్నతాధికారుల నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని సివిల్‌ ‌సప్ల్లై శాఖ అధికారులు పేర్కొన్నారు.

Leave a Reply