Take a fresh look at your lifestyle.

ప్రైవేటు హాస్పిటళ్లలో కొరోనా చికిత్సలకు రేట్లు ఖరారు

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
రాష్ట్రంలో ప్రైవేటు హాస్పిటళ్లలో కొరోనా చికిత్స, వైద్య పరీక్షలు, అంబులెన్సు చార్జీలకు గరిష్ఠ ధరలను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు చార్జీలపై వైద్య ఆరోగ్య శాఖ జీవో నంబరు 40 జారీ చేసింది. ప్రైవేటు హాస్పిటళ్లలో సాధారణ వార్డులో ఐసోలేషన్‌, ‌పరీక్షలకు రోజుకు గరిష్ఠంగా రూ.4 వేలు, ఐసీయూ వార్డులో గరిష్ఠంగా రూ.7,500, వెంటిలేటర్‌తో కూడిన ఐసీయూ గది చికిత్సకు గరిష్ఠంగా రూ.9 వేలు మాత్రమే ఛార్జ్ ‌చేయాలని ఆదేశించింది. పీపీఈ కిట్‌ ‌ధర రూ.273 మించరాదని పేర్కొంది. హైకోర్టు ఆదేశాల మేరకు దీనిపై జీవో జారీచేసింది.

హెచ్‌ఆర్సీటీ-రూ.1,995, డిజిటల్‌ ఎక్స్‌రే- రూ.1,300, డీ డైమర్‌ ‌పరీక్ష-రూ.300, సీఆర్పీ-రూ.500, ప్రొకాల్‌ ‌సిటోనిన్‌-‌రూ.1,400, ఫెరిటిన్‌-‌రూ.400, ఎల్డీహెచ్‌-‌రూ.140, ఎల్‌ ‌డీహెచ్‌ ‌రూ.140, సాధారణ జీవనాధార వ్యవస్థ ఉన్న అంబులెన్స్‌కు కిలో వి•టర్‌కు రూ.75, కనీసం రూ.2వేలు, ఆధునిక జీవనాధార వ్యవస్థ ఉన్న అంబులెన్స్‌కు కిలోవి•టర్‌కు రూ.125, కనీసం రూ.3 వేలుగా నిర్ణయించారు. దీనిని ఖచ్చింతంగా పాటించాల్సిఉంటుంది. ఆదేశాలను ఉల్లంఘించే హాస్పిటళ్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Leave a Reply