Take a fresh look at your lifestyle.

వైద్యారోగ్య శాఖలో వేగంగా మౌలిక సౌకర్యాల కల్పన

మంత్రి హరీష్‌ ‌రావు చొరవతో వేగం పుంజుకున్న పనులు
మూడు నెలల్లో సూర్యాటపేట మెడికల్‌ ‌కళాశాల పూర్తి
తుది దశకు జగిత్యాల, మంచిర్యాల దవాఖానాల అప్‌‌గ్రేడేషన్‌ ‌పనులు
హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర , జనవరి 20 : వైద్యారోగ్య శాఖలో మౌలిక సౌకర్యాల కల్పన పనులు వేగంగా సాగుతున్నాయి. వైద్యారోగ్య శాఖ మంత్రిగా హరీష్‌ ‌రావు పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే రాష్ట్రంలోని దవాఖానాలు, కొత్త మెడికల్‌ ‌కళాశాలల భవనాల నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇప్పటికే నిర్మాణంలో ఉండి పూర్తి కావొచ్చిన మెడికల్‌ ‌కళాశాలల పనులలో వేగం మరింత పెంచి త్వరగా అందుబాటులోకి తీసుకురావాలనీ, అలాగే దవాఖానాలలో సైతం కొత్తగా నిర్మిస్తున్న భవనాలను సైతం యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని టీఎస్‌ఎంఎస్‌ఐడిసిని ఆదేశించారు. ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తూ త్వరగా పూర్తయ్యేలా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గాంధీ దవాఖానాలో మాతా శిశు సంరక్షణ కోసం ప్రత్యేకంగా రూ.50 కోట్ల అంచనా వ్యయంతో 200 పడకల నూతన భవన నిర్మాణం ప్రారంభమైంది. గత ఆగస్టులో ప్రారంభమైన ఈ భవన నిర్మాణం నిర్దేశిత 18 నెలల గడువులోగా పూర్తి కావాలన్న మంత్రి హరీష్‌ ‌రావు ఆదేశాలతో ఎంసిహెచ్‌, ‌టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ అధికారులు పనులలో వేగం పెంచారు. అయితే, మధ్యలో కొరోనా అటంకం రావడంతో తాజాగా పనులలో వేగం పెరిగింది.

వొచ్చే ఏడాది 2023 ఫిబ్రవరి నెలకల్లా ఈ భవనం అందుబాటులోకి వొచ్చి పూర్తి స్థాయిలో గాంధీ దవాఖానాలో మాతా శిశు సంరక్షణ కేంద్రంలో కీలక వైద్య సేవలు అందనున్నాయి. ఇక సూర్యాపేట మెడికల్‌ ‌కళాశాల భవనం నిర్మాణాన్ని ఈ ఏడాది మే నెలలోగా పూర్తి చేసేలా టీఎస్‌ఎంఐడీసీ పనులను వేగవంతం చేసింది. రూ.156 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ కళాశాల భవన నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. దీనిపై కూడా మంత్రి హరీష్‌ ‌రావు ప్రత్యేక దృష్టి సారించి పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే, తెలంగాణ ప్రభుత్వం కొత్తగా నిర్మించ తలపెట్టిన 8 మెడికల్‌ ‌కళాశాలల పనులలో భాగంగా జగిత్యాల, మంచిర్యాల, వనపర్తి జిల్లా కేంద్రాలలోని దవాఖానాల అప్‌‌గ్రేడేషన్‌ ‌పనులు వేగం పుంజుకున్నాయి. ఈ జిల్లా కేంద్రాలలో ఎన్‌ఎం‌సి నిబంధనల మేరకు మెడికల్‌ ‌కళాశాలలకు అనుబంధంగా 330 బెడ్ల దవాఖానాలు ఉండాలి. ఆమేరకు మంచిర్యాల జిల్లా దవాఖానాలో ఇప్పటికే 300 పడకలు అందుబాటులో ఉండగా, మరో 30 పడకలను సిద్ధం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా దవాఖానాలో 250 పడకలు అందుబాటులో ఉండగా ఇక్కడ మరో 80 పడకలను సిద్ధం చేస్తున్నారు. అలాగే, వనపర్తి జిల్లా కేంద్రంలోని దవాఖానాలో 250 పడకలు అందుబాటులో ఉండగా, మరో 80 పడకలు త్వరలో సిద్ధం కానున్నాయి. వీటితో పాటు మెడికల్‌ ‌కళాశాలలకు అవసరమైన అన్ని మౌలిక సౌకర్యాల కల్పన పనులను టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ వేగవంతం చేస్తున్నది.

పనులు వేగంగా సాగుతున్నాయి : సీఈ రాజేందర్‌ ‌కుమార్‌
‌టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దవాఖానాలు, మెడికల్‌ ‌కళాశాలల్లో మౌలిక సౌకర్యాల కల్పన పనులు వేగంగా సాగుతున్నాయని చీఫ్‌ ఇం‌జనీర్‌ ‌పి.రాజేందర్‌ ‌కుమార్‌ ‌వెల్లడించారు. ఇప్పుడిప్పుడే కోవిడ్‌ ‌పరిస్థితుల నుంచి కోలుకోవడంతో అధిక సంఖ్యలో లేబర్‌ను వినియోగించి పనుల వేగం పెంచామన్నారు. కొత్త వైద్య కళాశాలలకు అనుబంధంగా ప్రభుత్వ దవాఖానాల అప్‌‌గ్రేడేషన్‌ ‌పనులతో పాటు ఎన్‌ఎం‌సి నిబంధనల మేర అన్ని సదుపాయాలను కల్పిస్తున్నామని ఈ సందర్భంగా రాజేందర్‌ ‌కుమార్‌ ‌వెల్లడించారు.

Leave a Reply