నగరంలో వేగంగా అభివృద్ధ్ది పనులు
పెరుగుతున్న ట్రాఫిక్‌ను అరికట్టేందుకు రోడ్ల విస్తరణ, ఫ్లై ఓవర్లను చేపట్టామని మంత్రి కెటిఆర్ అన్నారు. నగరంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగతు న్నాయని అన్నారు. నగరంలోని బైరామల్‌గూడ ఫ్లై ఓవర్‌ను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. జీహెచ్ఎంసీ ఎస్సార్డీపీలో భాగంగా చేపట్టిన పనుల్లో ఈ ఫ్లై ఓవర్ ఒకటి. ఎల్బీనగర్ పరిధిలోని బైరామల్‌గూడ జంక్షన్ వద్ద రూ. 26.45 కోట్లతో దీనిని పూర్తి చేశారు. ఎస్సార్డీపీ ప్యాకేజీ-2లో మొత్తం 14 పనులుండగా, ఇప్పటికే ఐదు వినియోగంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫ్లై ఓవర్ ప్రారంభంతో బైరామల్‌గూడ జంక్షన్, సాగర్‌రోడ్ జంక్షన్ల పరిధిలో ట్రాఫిక్ ఒత్తిడి తగ్గనుంది. బైరామల్‌గూడ జంక్షన్లో రద్దీ వేళల్లో గంటకు 12 వేల వాహనాలు ప్రయాణిస్తున్నాయి. సికింద్రాబాద్ నుంచి ఒవైసీ జంక్షన్‌కు, శ్రీశైలం వైపు వెళ్లే వాహనదారులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
ఫ్లై ఓవర్ ప్రారంభ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌తో పాటు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డుపై ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ఉద్దేశంతో.. బైరామల్‌గూడ జంక్షన్లో ఫ్లై ఓవర్ నిర్మించినట్లు వెల్లడించారు. రూ. 26.45 కోట్ల అంచనాతో 784 టర్ల పొడవుతో ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. ఎస్ఆర్డీపీ ప్యాకేజీ 2లో రూ. 448 కోట్ల అంచనా వ్యయంతో ఎల్బీనగర్ నియోజక వర్గం లో చేపట్టిన 14 పనులలో ఇప్పటి వరకు 6 పూర్తి అయ్యాయి. ఇప్పటికే ఎల్బీనగర్ జంక్షన్లో నిర్మించిన కుడి వైపు ఫ్లై ఓవర్‌తో పాటు అండర్ పాస్, కామినేని జంక్షన్లో కుడి వైపుతో పాటు ఎడమ వైపు ఫ్లై ఓవర్, చింతల్ కుంట అండర్ పాస్‌లు అందుబాటులోకి రావడంతో ప్రయాణం సాఫీగా సాగుతోంది. శరవేగంగా అభివృద్ది చెందుతున్న హైదరాబాద్‌ను ఫ్రీ ప్లో ట్రాఫిక్ నగరంగా మార్చేందుకు ఎస్ఆర్డిపి కింద ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు, రోడ్డు విస్తరణ పనులను చేపట్టింది జీహెచ్ఎంసీ. బైరమల్ గూడ జంక్షన్లో నిర్మించిన కుడివైపు ఫ్లై ఓవర్ నిర్మాణానికి దేశంలోనే మొదటిగా ప్రత్యేక టెక్నాలజీని వినియోగించారు.