- ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో దేశంలో రెండో స్థానంలో తెలంగాణ
- అమెజాన్ ఎయిర్ కార్గో ప్రైమ్ ఎయిర్‌ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 23 : తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో తెలంగాణ రెండో స్థానంలో ఉన్నదని చెప్పారు. గత ఏడేండ్లుగా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వొస్తున్నాయని తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయంలో అమెజాన్ ఎయిర్‌కార్గో విమానమైన ప్రైమ్ ఎయిర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..అమెజాన్ బృందాన్ని అభినందించారు. అమెజాన్ అతిపెద్ద క్యాంపస్ హైదరాబాద్‌లోనే ఉందని చెప్పారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారా రూ.36,300 కోట్ల పెట్టుబడులు పెడుతున్నదని చెప్పారు.
వియేషన్ రంగంలో తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని వెల్లడించారు. హైదరాబాద్ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్పోర్ట్ అని చెప్పారు. హైదరాబాద్ గ్రీన్‌సిటీ అవార్డును సొంతం చేసుకున్నదని తెలిపారు.హైదరాబాద్ గ్రీన్ సిటీ అవార్డును సొంతం చేసుకుందని మంత్రి పేర్కొన్నారు. ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో తెలంగాణకు సెకండ్ ర్యాంక్ వొచ్చిందని వివరించారు. ఐటి సెక్టార్లో తెలంగాణ అతివేగంగా అభివృద్ధి చెందుతుందని, ఏమియేషన్ రంగంలో కూడా తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుంతని మంత్రి అన్నారు. అమెజాన్ ఎయిర్ కార్గో ప్రారంభించడం ఏవియేషన్ రంగంలో మరో అద్భుతమని, అమెజాన్ ఎయిర్ భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందాలని మంత్రి కెటిఆర్ ఆకాంక్షించారు.