Take a fresh look at your lifestyle.

జగిత్యాలలో 5 ఏళ్ల్ల మరో చిన్నారిపై అత్యాచారం

  • పోలీసుల అదుపులో నిందితుడు
  • పెట్రేగిపోతున్న కామాంధులు

హైదరాబాద్‌లో చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటన మరువక ముందే జగిత్యాల జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని తుమ్మెనాల గ్రామంలో 5 ఏండ్ల చిన్నారిపై అత్యాచారం ఘటన గురువారం వెలుగు చూసింది. అత్యాచారం ఘటన బుధవారం జరుగగా గురువారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్‌ ‌చదువుతున్న 19 ఏండ్ల యువకుడు సుమంత్‌ ‌చిన్నారి పాపపై బుధవారం మధ్యాహ్నం అత్యాచారానికి పాల్పడ్డాడు.

గురువారం పాప తీవ్ర జ్వరంతో బాధపడుతూ నీరసంగా ఉండడంతో పాపను జగిత్యాల హాస్పిటల్‌కి తరలించారు. దీంతో అత్యాచారం ఘటన వెలుగులోకి వొచ్చింది. నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ దర్యాప్తు జరుపుతున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు.

Leave a Reply