Take a fresh look at your lifestyle.

ఎమ్మెల్సీ బరిలో రాణి రుద్రమ

*ప్రకటించిన యువ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు జిట్టా
*హైదరాబాద్ లో పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం
యువ తెలంగాణ పార్టీ  2 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర స్థాయి ముఖ్య కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు జిట్టా బాలక్రిష్ణా రెడ్డి రాబోయే నల్గొండ – వరంగల్ – ఖమ్మం మరియు మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గాల M.L.C ఎన్నికల్లో యువ తెలంగాణ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు. నల్గొండ – వరంగల్ – ఖమ్మం స్థానానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ప్రకటించారు.
   అక్టోబర్ 1 నుంచి పార్టీ శ్రేణులు గ్రామగ్రామాన పర్యటించి ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టి రాణి రుద్రమ గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
        M.L.C అభ్యర్థి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణి రుద్రమ మాట్లాడుతూ, తనను గెలిపిస్తే పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని,  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు జరిగేలా, ప్రైవేటు రంగంలో తెలంగాణ నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలా “లోకల్ రిజర్వేషన్ ఆక్ట్” అమలయ్యేలా ప్రభుత్వంపై  ఒత్తిడి తెస్తానని  ఉద్యమకారినిగా, జర్నలిస్టుగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన తాను, రాజకీయాల్లోను  తెలంగాణ ప్రజల పక్షాన  పోరాడుతున్నానని తనను గెలిపిస్తే  పట్టభద్రుల పక్షాన శాసనమండలిలో ప్రశ్నించే గొంతుక గా పోరాడుతానని తెలిపారు.
        ఈ కార్యక్రమంలో యువ తెలంగాణ పార్టీ రాష్ట్ర కమిటీ నాయకులు పలు తీర్మానాలను ప్రవేశ పెట్టి ఆమోదించారు.
        ఆత్మీయ సమ్మేళనం లో రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మ రమేష్, శంకర్ , శారదా గౌడ్, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు జక్కుల వెంకటరమణ, మహిళా అధ్యక్షురాలు పద్మ, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు చింతల లక్ష్మీనారాయణ, మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు కాజన్ గౌడ్, మెదక్ జిల్లా అధ్యక్షుడు వడ్ల సాయిబాబా, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు గాల్ రెడ్డి, నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు వడ్ల వేణు, కన్వీనర్ రవిశంకర్, పలు నియోజకవర్గ ఇన్చార్జిలు, మండల, గ్రామ స్థాయి ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply