Take a fresh look at your lifestyle.

అద్భుత ద్వీపకల్పం… అద్వితీయ పర్యాటక క్షేత్రం

  • టూరిజం స్పాట్‌గా రంగనాయకసాగర్‌
  • ‌రాష్ట్రానికే తలమానికంగా రిజర్వాయర్‌
  • ‌పర్యాటక అభివృద్ధికి రూ. 110 కోట్లు మంజూరు: మంత్రి హరీష్‌రాావు

సిద్ధిపేట సమీపంలోని చంద్లాపూర్‌లో  నిర్మితం అయిన రంగనాయక సాగర్‌ ‌పర్యాటక అభివృద్ధికి 110 కోట్ల రూపాయలు మంజూరు అయినట్లు మంత్రి హరీష్‌ ‌రావు తెలిపారు. సిద్దిపేటకు దక్షిణాన కోమటి చెరువు గొప్ప పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతున్నది అని అంతకంటే గొప్ప పర్యటక ప్రాంతంగా  రాష్ట్రానికే తలమానికంగా పర్యాటక అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఇటీవల సీఎం కేసీఆర్‌ ‌సిద్దిపేట పర్యటన సందర్భంగా రంగనాయక సాగర్‌ను సందర్శించారనీ, అదే రోజు రంగాయకసాగర్‌ ‌గొప్ప పర్యాటక ప్రాంతంగా విరాజిల్లెలా తీర్చిదిద్దాలనీ, అందుకు 110 కోట్ల మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారనీ గుర్తు చేశారు. సీఎం హామీ మేరకు  ఉత్తర్వులు జారీ అయ్యాయని చెప్పారు. దీనితో గొప్ప పర్యాటక ప్రాంతంగా చేయబోతున్నట్లు తెలిపారు.


ద్వీపకల్పం…పర్యాటక సౌరభం..
‘వాన కురిస్తేనే చెరువు నిండాలి. చెరువు నిండితేనే పంట పండాలి’ ఒకప్పుడు సిద్దిపేట ప్రాంత పరిస్థితి ఇది. కానీ, తెలంగాణ ప్రభుత్వంలో తొలి భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్‌రావు  కృషితో సిద్దిపేట స్వరూపమే మారిపోయింది. మిషన్‌ ‌కాకతీయతో చెరువులను అభివృద్ది చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు తెచ్చి రంగానాయకసాగర్‌లో ఎత్తిపోసేలా చేశారు. ఆ నీటిని ఊరూరా చెరువుల్లో నింపారు. సాగునీటి కష్టాలు తీర్చారు. వట్టిపోయిన బీడు భూములను పచ్చని మాగాణిలా మార్చారు. సిద్దిపేట పట్టణానికి సమీపంలోనే 3టీఎంసీల సామర్థ్యం కలిగిన రంగనాయకసాగర్‌ ‌రిజర్వాయర్‌ను నిర్మించారు. గోదావరి జలాలతో ఈ రిజర్వాయర్‌ ‌నిరంతరం కళకళలాడుతూనే ఉన్నది. సాగునీటి కష్టాలు తీర్చడంతోపాటుగా పర్యాటక ప్రేమికులను ఆకట్టుకుంటున్నది. రిజర్వాయర్‌ ‌నడిమధ్యలోని పల్లగుట్టపై నిర్మించిన గెస్ట్‌హౌస్‌ అబ్బుర పరుస్తున్నది.

 

గుట్ట చుట్టూ రహదారులను తీర్చిదిద్దారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌  ‌కూడా  ఈ రిజర్వాయర్‌ను సందర్శించి రూ.110 కోట్లు పర్యాటక అభివృద్ధి కోసం ప్రకటించారు. ఒక అంతర్జాతీయ స్థాయి పర్యాటక ప్రదేశంగా మారనున్న రంగనాయకసాగర్‌ ‌సిద్దిపేట ప్రజలకు గొప్ప వరమే.

Leave a Reply