Take a fresh look at your lifestyle.

పుల్లూరు స్వయంభూ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఛైర్మన్‌గా రంగాచారి

  • నూతన కమిటీని ప్రకటించిన మంత్రి హరీష్‌రావు
  • మంత్రి హరీష్‌రావు నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తా: రంగాచారి

సిద్ధిపేట రూరల్‌ ‌మండల పరిధిలోని పుల్లూరులో స్వయంభూగా వెలసిన లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఛైర్మన్‌గా పుల్లూరు(సిద్ధిపేట)క• చెందిన కలకుంట్ల రంగాచారి నియమితులయ్యారు. ఈ మేరకు స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పుల్లూరు లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఛైర్మన్‌గా రంగాచారితో పాటు నూతన కమిటీని ప్రకటించారు.

ఆలయ కమిటీ ఛైర్మన్‌గా తనను నియమించిన మంత్రి హరీష్‌రావుకు రంగాచారి కృతజ్ఞతలు తెలపడంతో పాటు తనపై మంత్రి హరీష్‌రావు ఉంచిన నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయకుండా ఆలయాన్ని మంత్రి హరీష్‌రావు సూచనలు, సలహాల మేరకు భక్తులు ఆశించిన విధంగా  మరింతగా అభివృద్ధి  చేసేందుకు తనశక్తి మేరకు కృషి చేస్తాననీ రంగాచారి అన్నారు. ఇదిలా ఉంటే, ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగిన పుల్లూరు ఆలయం ఎంతో మహిమాన్వితమైంది.  నిత్య పూజలతో భక్తుల కొంగు బంగారంగా మారిన లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఎంతో ప్రాచీనమైనదనీ విధితమే.

Leave a Reply