Take a fresh look at your lifestyle.

రమ్య హత్య ఇంకా బాధిస్తూనే ఉంది

  • కుటుంబ సభ్యులకు ఇంటిస్థలం
  • అందించిన హోంమంత్రి సుచరిత

గుంటూరు,ఆగస్ట్ 20 : ‌ప్రేమోన్మాది దాడిలో ప్రాణాలు కోల్పోయిన బీటెక్‌ ‌విద్యార్థిని కుటుంబాన్ని హోంమంత్రి సుచరిత పరామర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన ఇంటి స్థలం పత్రాలను గురువారం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ.. రమ్య హత్య ఘటన ఇప్పటికీ కలచి వేస్తోంది. కాలేజీల్లో విద్యార్థులకు ప్రత్యేక కౌన్సెలింగ్‌ ‌నిర్వహిస్తాం. రమ్య ఘటన జరిగిన 24 గంటలు గడవకముందే నిందితుడిని అరెస్టు చేశాం. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద రావాల్సిన బెనిఫిట్స్ అన్ని అందిస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన పది లక్షల రూపాయల చెక్కును కుటుంబ సభ్యులకు అందించాం. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తాం.

చట్ట ప్రకారం రావాల్సిన పరిహారంలో ఇప్పటికే నాలుగున్నర లక్షలకు సంబంధించిన చెక్కులు అందించాం. ఇప్పుడు ఇంటి స్థలానికి సంబంధించి పట్టాను పంపిణీ చేశాం. యువత సోషల్‌ ‌డియా పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే దిశ యాప్‌ను 40 లక్షల మంది డౌన్‌లోడ్‌ ‌చేసుకున్నారు. మూడున్నర లక్షల మంది దిశ యాప్‌ను ఉపయోగించారు. ఎక్కడైనా మహిళలకు ఇబ్బంది ఏర్పడితే దిశ యాప్‌ ‌ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వండి‘ అని అన్నారు.

Leave a Reply