- లెక్కలు తీస్తే గిన్నీస్ రికార్డు
- ఆడిపోసుకోవడమేనా…చేసేదేమైనా ఉందా?
- టిఆర్ఎస్ సర్కార్‌పై రాములమ్మ ఫైర్
టిఆర్ఎస్ పార్టీ అధినేత, ప్రభుత్వాధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్పర్సన్ విజయశాంతి అలియాస్ రాములమ్మ తనదైనశైలిలో ఫైర్ అయ్యారు. సిఎం కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు చేశారు. రాజధాని హైదరాబాద్‌లో గల నేరెడ్మెట్ ప్రాంతంలో నాలాలో పడి చిన్నారి సుమేధ(12) మృతి ఘటనపై రాములమ్మ ఒంటికాలిపై లేచారు. ఇంకెన్ని ప్రాణాలు తీసుకుంటారనీ సిఎం కేసీఆర్ మండిపడ్డారు. ఈ మేరకు శనివారం విజయశాంతి తన అధికారిక ఫేస్బుక్ ద్వారా ఓ పోస్టును చేస్తూ…ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇంకా ఎంత మంది బలికావాలని అడిగారు. గత ఆరేళ్లలో ఏం చేశారని దుయ్యబట్టారు. ప్రతీ దానికి గత పాలకులు అని విమర్శించే కేసీఆర్‌కు ఆరేళ్ల సమయం సరిపోలేదా? అని అడిగారు. నాలాలు తెరుచుకోవడంతో.. అభం శుభం తెలియని చిన్నారులు ఆసువులు బాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇంకెన్ని ప్రాణాలు పోవాలో చెప్పాలని ట్విట్టర్లో ప్రశ్నల వర్షం కురిపించారు. చిన్నారి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌ను విశ్వనగరం చేస్తామని మాటలు చెప్పారే గానీ.. చేతలేవీ అని ఆమె ఫైరయ్యారు. చినుకు పడితే చాలు జంట నగరాలు చిత్తడవుతాయని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో కురిసిన వర్షంతో డ్రైనేజీలు నిండి, నాలాలు పొంగి.. మ్యాన్ హోళ్లలోకి నీరు ఎలా వస్తుందో కళ్ల ముందు చూశామని చెప్పారు. రాజధాని హైదరాబాద్‌లోనే ఇలాంటి ఘటనలు జరిగితే అధికార పార్టీ నేతలు వచ్చి, సరిచేస్తామని చెప్పి వెళుతుంటారని పేర్కొన్నారు. కానీ, శాశ్వత పరిష్కారం కనుక్కున్నారా? అని నిలదీశారు. గత ప్రభుత్వాలు చేసిన పని వల్లే పలు ప్రాంతాలు మునిగిపోతున్నాయని ఆరోపిస్తున్న టిఆర్ఎస్ నేతలు, పాలకులు మరీ మీరు అధికారం చేపట్టి ఆరేళ్లు అవుతోంది కదా.. ఎందుకు సరైన చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. హైదరాబాద్ కాదు.. పట్టణాలు, నగరాలు కూడా ఇలానే తయారవుతున్నాయని తెలిపారు. కబ్జాలు, అక్రమ కట్టడాలతో మునిగిపోయే పరిస్థితి ఏర్పడిందని విజయశాంతి ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా మేల్కొవాలని ఆమె సూచించారు. వర్షాలు కురవడంతో మ్యాన్ హోళ్లలో చాలా మంది పడిపోయి చనిపోయారని విజయశాంతి గుర్తుచేశారు. చనిపోయిన వారి లెక్కలు తీస్తే గిన్నిస్ రికార్డు అవుతోందని ధ్వజమెత్తారు. ఇకనైనా నివారణ పనులు చేపట్టాలని డిమాండు చేశారు. లేదంటే ప్రజలు ఆగ్రహిస్తారని సర్కార్నుహెచ్చరించారు. ప్రజల ఆగ్రహాంలో మీరు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది అని… మేల్కొవాలని సిఎం కేసీఆర్‌కు విజయశాంతి హితవు పలికారు.