Take a fresh look at your lifestyle.

రమనీయం – కమనీయం శ్రీ సీతారాముల కల్యాణం

పవిత్ర ముణ్యక్షేమ్రైన భద్రాచలంలో సీతారాముల కల్యాణం ఈ ఏడాది కొరోనా ప్రభావంతో ఆలయంలోనే నిత్యకల్యాణ మండపంలోనే నిడాబరంగా జరిగింది. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీశార్వరీ నామ సంవత్సర చైత్రశుద్ద నవమి గురువారం నాడు జరిగిన కల్యాణం ఆనాడు మిధిలానగరంలో జరిగిన కల్యాణానికి భిన్నంగా జరిగింది. ఆనాడు శివధనస్సు విరిచి దశరథసుతుడు శ్రీరామునికి, మిధిలానగర రాజు జనకుని పుత్రిక సీతకు పెళ్ళి జరుగగా, గురువారం భద్రాద్రి క్షేత్రంలో ప్రతీఏటా జగత్‌ ‌కల్యాణం కోసం చతుర్భుజుడు, శంఖుచక్రాలు ధరించిన శ్రీ మహావిష్ణువు అంశగల వైకుంఠ రాముడు ఇక్కడ వరుడు కాగా, సాక్షాత్తు లక్ష్మీ స్వరూపురాలు సీతమ్మ వధువుగా కల్యాణం నిర్వహించారు. భద్రాద్రిలో ఈ ఏడాది స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీశార్వరి నామ సంవత్సర చైత్రశుద్ధ నవమి ఉదయం 10 గంటల నుండి అభిజిత్‌లగ్న శుభ ముహూర్తమున శ్రీపాంచరాత్రగమ విధానంలో శ్రీ సీతారామచంద్ర కల్యాణ మహోత్సవంను ఆలయ ప్రాంగణంలో నిత్యకల్యాణం మండపంలో నిర్వహించారు. ఉత్సవమూర్తులను మంగళవాయిధ్యాలతో వేదమంత్రాలతో ప్రత్యేక పల్లకిపై ఉదయం 10.15 నిమిషాలకు ప్రత్యకంగా ఏర్పాటు చేసిన నిత్యకల్యాణ మండపంకు తీసుకువచ్చారు. ధగధగాయమానంగా వెలుగొందే వెండి సింహాసనంపై సీతారాములు, లక్ష్మణ,హనుమంతులను ఆసీనులు గావించారు. తొలుత తిరునాధాన తరువాత విశ్వేక్షన మంత్రాలతో ఏర్పాటుచేసిన మండపాన్ని శుద్ధి చేసి మంజునకి ప్రథమం అను మంత్రం జపిస్తూ యధాసుదర్శరాజా సంవత్సర్గం శ్రీయుద్యా ఆయుష్మే అనే సంకల్పంతో స్వామివారికి ఎదురుగా సీతమ్మవారిని కూర్చుండబెట్టి కన్యావరణాలు జరిపించి మోక్షబంధనం ప్రతిసారబంధం, ద్వితీయ, సువర్ణయజ్ఞోర్తితా దారణలు జరిపించారు.

అనంతరం ఆశీర్వచనం పాదప్రక్షాలనం, పుస్పోదకస్నావనం పూర్తి అయిన తర్వాత 11.20 నిమిషాలకు స్వామివారికి వరపూజ నిర్వహించారు. అనంతరం భక్తరామదాసు చేయించిన ఆభరణాలు అయిన పచ్చలపతకం, శ్రీరామమాడ, చింతాకుపతకం, అమ్మవారికి అలంకరించి, శ్రీరంగనాధుడు పంపిన పట్టువస్త్రాలను అమ్మవారికి, స్వామివారికి అలంకరించారు. తేనే, పెరుగు కలిపిన పంచామృతాలను బంగారు పాత్రలో స్వామివారికి నివేదించిన పిమ్మట నూతన వస్త్రాలంకరణ చేశారు. ఊతబలి పేరుతో పొన్నంను దిష్టితీశారు. లోకపర్యంతమున ఉన్న విశ్వసృష్టిని దానితో నున్న కాలమును, సంకల్పం చెప్పి,11 గంటల 36 నిమిషాలకు కన్యాదానం కరిష్మే అంటూ 12. గంటలకు అభిజిత్‌ ‌లగ్నంలో స్వామివారు, అమ్మవారి శిరస్సుపై జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని ఉంచారు.12 గంటల 25 నిమిషాలకు మాంగల్యధారణతో కల్యాణం తంతునా భద్రాద్రి అంటూ చేశారు. అనంతరం భక్తరామదాసు 17వ శతాబ్దంలో చేయించిన మంగసూత్రధారణ 12.30కి జరిగింది. మూడు సూత్రాలు గల ఈ మంగళసూత్రమునకు మొదటి సూత్రము కారణశక్తి గౌరి గాను, రెండవ సూత్రం జ్ఞానశక్తి శారద గానూ, మూడవసూత్రం మనోశక్తి మహాలక్ష్మీగానూ ఆగమశాసనం చెబుతుందని వేదపండితులు మంత్రోచ్ఛారణతో అశేష భక్తజనావళికి వినిపించారు.ప్రభుత్వం తరుపున దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సతీసమేతంగా స్వామివారికి పట్టువస్త్రాలు,ముత్యాల తలంబ్రాలు అందచేసారు.ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి స్వామివారికి ముత్యాల తలంబ్రాలు తీసుకువచ్చారు.రవాణాశాఖా మాత్యులు పువ్యాడ అజయ్‌కుమార్‌ ‌ముత్యాల తలంబ్రాలు అందచేసారు.సుగంధద్రవ్యాలతో కలిపి సీతారామచంద్రమూర్తులకు తలంబ్రాల కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం మండపం చుట్టూ గులాల్‌ ‌చల్లి కల్యాణం తంతునామే అంటూ ముగించారు.

ఈ ఏడాది స్వామివారి కల్యాణం సుమారుగా యాబైమందితోనే నిర్వహించారు.కరోనా ప్రభావంతో ఆలయంలోని నిత్యకల్యాణమండపంలో కల్యాణం జరిగింది.కేవలం మంత్రులు ,ఎమ్మెల్యేలు,అధికారులు,అర్చకులు, దేవాలయ సిబ్బందితోనే స్వామివారి కల్యాణం నిర్వహించారు. స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని ప్రసారభారతి, ఆలిండియా రేడియోలలో ప్రత్యక్షప్రసారం చేశారు. తిరుకల్యాణోత్సవం ఆధ్వర్యంలో ఆధ్వర్యులు స్థానాచార్యులు కేఈస్థలసాయి, ప్రధాన అర్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, అమరవాది విజయరాఘవన్‌,అమరవాది మధుసూదనాచార్యులు, అమరవాది వెంకటశ్రీనివాస రామానుజం, కోటిశ్రీమన్నారాయణాచార్యులు ,పొడిచేటి రాభద్రాచార్యులు కల్యాణ మహోత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు.మహబూబాబాద్‌ ‌పార్లమెంట్‌ ‌సభ్యురాలు కవిత,జడ్‌పిఛైర్మన్‌ ‌కోరం కనకయ్య,భద్రాచలం శాసనసభ్యులు పొదెం వీరయ్య,జిల్లా కలెక్టర్‌ ‌యంవి రెడ్డి,ఎస్‌పి సునీల్‌ధత్‌,‌జాయింట్‌ ‌కలెక్టర్‌ ‌వెంకటేశ్వరరావు,ఎఎస్‌పి రాజేష్‌చంద్ర ,దేవాదాయ కమీషనర్‌ అనిల్‌కుమార్‌,‌దేవస్ధానం ఇఓ నర్సింహులు మరియు జిల్లా అధికార యంత్రాగం పాల్గొన్నారు.

నేడు పట్టాభిషేకం
స్వామివారి కల్యాణం నిర్వహించిన మరుసటిరోజు పట్టాభిషేకం నిర్వహించడం జరుగుతుంది.ఇందులోభాగంగానే శుక్రవారం స్వామివారు పట్టాభిషిక్తుడైతారు.ఇందుకోసం ప్రతీఏటా రాష్ట్ర గవర్నర్‌ ‌వచ్చే ఆనవాయితీ ఉండేది.ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా కొరోనా మహమ్మారి విజృంభిస్తుంన్నందున గవర్నర్‌ ‌వచ్చే అవకాశం లేనట్లే.ఇప్పటికే గురువారం జరిగిన స్వామివారి కల్యాణం ఆలయంలోని నిత్యకల్యాణం మండపంలోనే కేవలం 50 మంది చూసేవిధంగా ఏర్పాటు చేసి కల్యాణ ముగించారు.ఇదేపద్దతిలో శుక్రవారం పట్టాభిషేకం కూడా నిడాబరంగా జరిగే అవకాశం ఉంది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!