Take a fresh look at your lifestyle.

‌ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ: సీపీ సత్యనారాయణ

సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు రామగుండం సీపీ సత్యనారాయణ

రామగుండం కమీషనరేట్‌ ‌పరిధి పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లోని 9 మునిసిపాలిటీలు, ఒక నగరపాలక సంస్థకు జరుగుతున్న ఎన్నికల్లో ఓటర్లు ప్రశాంతమైన వాతావరణంలో తమ ఓటు హక్కును వినియో గించుకోవాలని రామగుండం సీపీ సత్యనారా యణ కోరారు.  ఈ మేరకు పటిష్ట బందోబస్తు ను మంచిర్యా ల డీసీపీ ఉదయ్‌కుమార్‌ ‌రెడ్డి, పెద్దపల్లి డీసీపీ రవింద్రల పర్యవేక్షణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఏర్పాట్లు జరిగేలా చూస్తున్నట్లు ఆయన తెలిపారు.

రామగుండం కమీషనరేట్‌ ‌పరిధిలో 853 పోలింగ్‌ ‌కేంద్రాలు, 461 పోలింగ్‌ ‌లొకేషన్‌లలో 264 డివిజన్‌లలో నగపాలక, పురపాలక ఎన్నికలు సజావుగా నిర్వహణకు 2వేల మంది పోలీసులు బందోబస్తులో ఉన్నారని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలతో పాటు మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతాలైన చెన్నూరు, బెల్లంపల్లిల్లో ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

Leave a Reply