అది తారక మంత్రం
రామదూత డ్రోన్ యంత్రం
ఆధునిక సంజీవని మూలిక
అత్యవసర అక్షయ ఔషధ పేటిక
హనుమంతుడెత్తిన సుమేరు గిరి
ఆజ్ఞ శిరసావహించు దూతగ మారి
ఆకాశమార్గాన
మరో సంజీవని పర్వతం ఎగిరింది
వాయువేగానజి
ఆదేశించిన దిశకు తరలింది
అందులోన
అత్యవసర మందులన్నీ అమరింది
డ్రోన్ అనుమతిస్తే,
కూల్చి వేయు, కాల్చివేయు,
ఆపదలందు ఆదుకును.
ఏదైనా అందును వేగిరమున
అది అఘటిత,ఘటనా చతురిత
వినియోగంలో పాటించాలి కఠినత
అది అక్షయ లక్ష్యయ తూనీరం
అది పనిలోఅచ్చం రామదూత
-బక్కా రెడ్డి పట్లోళ్ల