Take a fresh look at your lifestyle.

ఇం‌డ్లల్లోనే రంజాన్‌ ‌వేడుకలు ముస్లింలకు తోఫా అందజేత

సూర్యాపేట, మే 25, ప్రజాతంత్ర ప్రతినిధి): జిల్లా వ్యాప్తంగా రంజాన్‌ ‌పర్వదిన వేడుకలు ముస్లింలు కరోనా వైరస్‌ ‌నేపధ్యంలో సామాజిక, భౌతిక దూరం పాటిస్తు వారి కుటుంబ సభ్యుల మధ్య సోమవారం ఘనంగా నిర్వహించుకున్నా రు. మసీదులలో మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లింలు నెల రోజుల పాటు పవిత్రంగా ఉపవాసాలు ఉంటూ తమ ఇండ్లల్లో నే ప్రార్థనలు నిర్వహించారు. కరోనా నేపధ్యంలో మసీదులలకు వెళ్లి ప్రార్థనలు చేసే పరిస్థితి లేదు, ఒకరినొకరు కలుసుకొని ఈద్గాలో ప్రార్థనలు నిర్వహించి శుభాకాంక్షలు చెప్పుకునే పరిస్థితి లేకపోవడంతో కుటుంబ సభ్యులు వారికి వారు మాత్రమే శుభాకాంక్షలు తెలుపుకొని, రంజాన్‌ ‌వేడుకలు జరుపుకున్నారు.

ఇలాంటి పరిస్థితి 112సంవత్సరాల క్రితం మూసి వరదలు రావ డంతో ముస్లింలు ఇండ్లల్లోనే ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా రంజాన్‌ ‌వేడుకలను జరుపు కున్నారు. కరోనా రోజు రోజుకు విజృంభిం చడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ‌విధించగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల చివరి వరకు లాక్‌డౌన్‌ ఉం‌చడంతో మసీదులకు, ఈద్గాలకు వెళ్లి ప్రార్థనలు చేసుకోవడానికి అవకాశం లేకపోవడంతో ముస్లింలు ఇంటి వద్దనే ప్రార్థనలు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ ‌శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి 5వేల మంది ముస్లింలకు 10రకాల ఫ్రూట్స్, ‌నిత్యావసర వస్తువులు అందజేశారు. ముస్లింలకు పలువురు రంజాన్‌ ‌శుభాకాంక్షలు తెలియజేశారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో రాష్ట్ర విద్యుత్‌ ‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, మాజి మంత్రి రాంరెడ్డి దామోదర్‌ ‌రెడ్డి, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు, టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి పటేల్‌ ‌రమేష్‌ ‌రెడ్డి ఇలా పలువురు ఉన్నారు.

Leave a Reply