Take a fresh look at your lifestyle.

రేవంత్ రెడ్డిని అరెస్టు చేసిన రామచంద్రాపురం పోలీసులు- సొంత పూచికపై విడుదల

కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని అరెస్టు చేసి రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ శంకర్ పల్లి మండలం జన్వాడ గ్రామంలోని 301, 313 వివిధ సర్వే నెంబర్ లో పలువురు రాజుల పేర్లతో, వారి బంధువుల పేర్లతో కేసీఆర్ కుమారుడు కేటీఆర్ స్థానిక ప్రజలను బెదిరించి దౌర్జన్యం గా భూమిని లాకున్నాడు. 111 జీవో ప్రకారం గండిపేట, హిమాయత్ సాగర్ లోకి వచ్చే పిరంగి కాలువలఫై ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని నిబంధనలు ఉన్న వాటిని తుంగలో తొక్కి అధికార బలంతోతో పోలీసులను అడ్డుపెట్టుకొని విలాసవంతమైన ఫాం హౌస్ నిర్మాణాన్ని చేపట్టడంతో అక్కడి రైతులు నా వద్దకు వచ్చి తెలపడంతో అక్కడకు వెళ్లానని తెలిపారు. జన్వాడాకి చెందిన రైతులను పోలీసులు నిర్బంధించారు. పక్కనే ఉన్న ప్రైవేటు స్థలంలో మా తోటి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడుతూ ఉంటే అక్కడి పోలీసులు బలవతంగా నిర్బంధించి పోలీస్ స్టేషన్ కు తరలించారని తెలిపారు. కేసీఆర్ నీ కుమారుడు అధికార బలంతో తప్పు దోవ పడుతున్నాడని ఇంత జరుగుతుంటే తండ్రిగా నీకు బాధ్యత లేదా అని అన్నారు.

- Advertisement -

ఇంటలిజన్స్ పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నా ఈ వీడియోను మొత్తం కేసీఆర్‌కు వినిపించండి. నా తోటి పార్లమెంటు మిత్రులు కేసీఆర్‌తో నీకు ఎందుకు అని పలు మార్లు చేపిన నేను మాత్రం తగ్గలేదని అన్నారు. మీ విలాసవంతమైన భవనంలో నిర్మించిన స్విమ్మింగ్ పూల్ లో స్థానిక ఎస్సై ద్వారా ప్రేవేటు ట్యాంకర్లతో నీళ్ళు నింపించుకొని నీటి బిల్లు కట్టకుండా తిరిగి వారిపై కేసులు నమోదు చేయించి 75వేల రూపాయలు కట్టించారని తెలిపారు. దుర్గం చెరువు సమీపంలోని నందినగర్ బపర్ జోన్‌లో నిర్మిస్తున్న అక్రమ నిర్మాాలపైన ధ్వజమెత్తారు. సోమవారం నుండి శుక్రవారం సాయంత్రం 7 గంటల తర్వాత సెల్ పోన్ ల సిగ్నల్స్ ఎవరి ఎవరివి ఉన్నాయా ఒక్క సారి చెక్ చేయండని అన్నారు. నేను తప్పుడు ఆరోపణలు చేస్తే నా పైన ఎలాంటి చర్యలు తీసుకున్న నేను సిద్దమని తెలిపారు. రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తిని ఈ అక్రమ నిర్మాణాలపైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని అన్నారు. రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి సొంత పూచికపై రేవంత్ రెడ్డిని పోలీసులు వదిలిపెట్టారు.

Leave a Reply