Take a fresh look at your lifestyle.

కొత్త పిఆర్సీకి అనుగుణంగా జీతాలు

  • పంతం నెగ్గించుకునే పనిలో ప్రభుత్వం
  • పిఆర్సీకి వ్యతిరేకంగా విశాఖలో ర్యాలీ
  • ఉద్యోగుల సమ్మెను వ్యతిరేకిస్తూ పిటిషన్‌

అమరావతి, జనవరి 29: ఉద్యోగులు, పెన్షనర్ల జీతాల విషయంలో తన పంతాన్ని నెగ్గించుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. కొత్త పీఆర్సీకి అనుగుణంగా సీఎఫ్‌ఎంఎస్‌లో పెన్షన్‌ ‌స్లిప్పులు జనరేట్‌ అయ్యాయి. 2018కి ముందు రిటైర్‌ అయిన వారికి కొత్త పీఆర్సీలో పెన్షన్‌ ‌ఫిక్స్ అయింది. 70 నుంచి 80 ఏళ్ల మధ్య ఉన్న పెన్షనర్లకు అడిషనల్‌ ‌క్వాంటమ్‌ ఆఫ్‌ ‌పెన్షన్‌ ‌రద్దు అయింది. కొత్త పీఆర్సీ ప్రకారం 20.02 శాతం డిఏ మంజూరయింది. హెల్త్ అలవెన్స్ 97 ‌రూపాయలు పెరిగింది. అడిషనల్‌ ‌పెన్షన్‌లో వేల రూపాయలు కట్‌ ‌చేసి అలవెన్స్‌లో 97 రూపాయలు ముష్టి వేశారంటున్నపెన్షన్‌దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెదవి విరుస్తున్నారు. 2018 తరువాత రిటైర్‌ అయిన వారికి ఐఆర్‌, ‌డీఏ లేదు. హెల్త్ అలవెన్స్ 397 ‌రూపాయలే పడింది. ఇదిలావుంటే కొత్త పిఆర్సీకి వ్యతిరేకంగా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది విశాఖలో ర్యాలీ చేపట్టింది. డీఎంహెచ్‌వో కార్యాలయం నుంచి సిబ్బంది ప్రదర్శనలో పాల్గొన్నారు. తమకు తీరని నష్టాన్ని చేకూర్చే కొత్త పీఆర్సీని రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది మాట్లాడు తూ.. 2022 జనవరి నెలకు పెండింగ్‌లో ఉన్న 5 డీఏలతో కలిపి పాత జీతాన్ని ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు. అశుతోష్‌ ‌మిశ్రా కమిటీ వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్‌ ‌చేశారు. కొవిడ్‌ ‌సమయంలో కూడా ప్రాణాలకు తెగించి సేవలందించిన సిబ్బందికి ఇచ్చే కానుక ఇదేనా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలావుంటే ఏపీలో పీఆర్‌సీ వివాదం కొనసా గుతూనే ఉంది. మంత్రుల కమిటీతో చర్చలు జరిపేందుకు ఉద్యోగ సంఘాల నేతలు ముందుకు రాకపోవడంతో అటు మంత్రులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇటు ఉద్యోగులు మాత్రం వినూత్న రీతిలో నిరసన తెలుపు తున్నారు. శనివారం నుంచి ఆర్టీసీ కార్మికులు నిరాహార దీక్షలు చేస్తు న్నారు.

పీఆర్సీపై ఉద్యోగుల సమ్మెకు ఆర్టీసీ కార్మి కులు మద్దతు ప్రకటించారు. ఫిబ్రవరి 3న చేప ట్టిన ఛలో విజయవాడకు ఆర్టీసీ కార్మికులు మద్దతు ప్రకటించారు. అటు ఉద్యోగులతో చర్చలు జరి పేందుకు మంత్రుల కమిటీ ప్రయత్ని స్తున్నా, ఎవరూ రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నారు. నాలుగు రోజుల పాటు మంత్రుల కమిటీ సమావేశమైనా ఉద్యోగ సంఘాల నేతలు రావడం లేదు. ఇకపై ఎదురు చూపులు ఉండవని, వాళ్లు వస్తేనే చర్చలని స్పష్టం చేసింది మంత్రుల కమిటీ. చట్టం తన పని తాను చేసుకుపోతుందని మంత్రి బొత్స హెచ్చరించారు. మరోవైపు ఉద్యోగుల సమ్మె నోటీస్‌ను సవాల్‌ ‌చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్‌ ‌దాఖలైంది. సమ్మె నోటీసును రాజ్యాంగ, చట్ట విరుద్ధమని ప్రకటించాలని పిటిషన్‌ ‌దాఖలైంది. సుప్రీంకోర్ట్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె సర్వీసు నిబంధనలకు విరుద్ధమని పిటిషన్‌ ‌పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ ‌సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. విశాఖకు చెందిన రిటైర్డ్ ‌ప్రొఫెసర్‌ ఎన్‌ ‌సాంబశివరావు ఈ పిటిషన్‌ ‌దాఖలు చేశారు.

Leave a Reply