Take a fresh look at your lifestyle.

48 ‌గంటలపాటు ర్యాలీలకు అనుమతి లేదు

  • గ్రేటర్‌ ఎన్నికల కౌంటింగ్‌కు భారీ భద్రతా ఏర్పాట్లు నగర సిపి అంజనీకుమార్‌

‌శుక్రవారం జరిగే గ్రేటర్‌ ఎన్నికల కౌంటింగ్‌కు భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని, ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరక్కుండా చూస్తున్నామని హైదరాబాద్‌ ‌నగర పోలీస్‌ ‌కమిషనర్‌ అం‌జనీకుమార్‌ ‌తెలిపారు. 15 కౌంటర్‌ ‌సెంటర్లు వద్ద కౌంటింగ్‌ ‌పక్రియ ఉంటుందని అన్నారు. కౌంటింగ్‌ ‌సెంటర్లు వద్ద  200 వి•టర్లు దూరం వరకు ఎవరిని అనుమతి ఉండదని స్పష్టం చేశారు. కేవలం అనుమతి పత్రం ఉన్న వారికే మాత్రమే కౌంటింగ్‌ ‌సెంటర్‌ ‌దగ్గరకు అనుమతి ఇస్తామని, అందరూ పోలుసులకు సహకరించాలని కోరారు.

48 గంటల వరకు రాజకీయ ర్యాలీలకు అనుమతి లేదని అంజనీకుమార్‌ ‌తెలిపారు. పోలీసు అధికారులపై సస్పెన్షన్‌ అం‌టూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని హైదరాబాద్‌ ‌సీపీ అంజనీ కుమార్‌ ‌ఖండించారు. అది తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. ఇలా తప్పుడు ప్రచారం చేసేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరంలో ఒకేరోజు 92 మంది పోలీసు అధికారుల సస్పెన్షన్‌ అం‌టూ సోషల్‌ ‌వి•డియాలో ప్రచారం చేస్తున్నవారిపై క్రిమినల్‌ ‌కేసులు నమోదు చేశామన్నారు. గ్రేటర్‌ ఎన్నికల్లో అభ్యర్థులకు సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకున్నారని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారిని చెప్పారు.

Leave a Reply