Take a fresh look at your lifestyle.

6‌న ఢిల్లీ దిగ్బంధన కార్యక్రమం ఉండదు

  • రైతు ఉద్యమం బలహీనపడ లేదు
  • పోలీసుల తీరుపై మండిపడ్డ రైతు సంఘం నేత రాకేశ్‌ ‌టికాయత్‌

రైతు ఉద్యమం ఏమాత్రం బలహీనపడలేదని భారతీయ కిసాన్‌ ‌యూనియన్‌ ‌నేత రాకేశ్‌ ‌టికాయత్‌ ‌స్పష్టం చేశారు. తమ ఉద్యమం నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని పేర్కొన్నారు. బుధవారం ఆయన వి•డియాతో మాట్లాడుతూ ఢిల్లీని దిగ్బంధం చేసే ప్రణాళికేదీ తమ వద్ద లేదని స్పష్టం చేశారు. అయితే ఎవరి ఒత్తిళ్లకూ తలొగ్గమని కుండబద్ధలు కొట్టారు. రైతుల విషయంలో కన్నీళ్లు పెట్టుకున్న అంశంపై స్పందిస్తూ…తమ నిరసనను బలవంతంగా ముగించాలని పోలీసులు ప్లాన్‌ ‌చేశారని, పోలీసులు వెనకుండి గూండాలు ముందున్నారని అన్నారు.

పోలీసులు మమ్మల్ని బలవంతంగా తరలిస్తే తాము బాధపడేవారం కాదని, కానీ గూండాలు ముందుకొచ్చారని టికాయత్‌ ‌పేర్కొన్నారు. రైతుల విషయంలో పోలీసులు వ్యవహార శైలి ఏమాత్రం సరికాదని, బలవంతంగా ఉద్యమాన్ని ముగించాలనుకుంటే అది జరిగే విషయం కాదని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 6న ఎలాంటి దిగ్బంధమూ చేయడం లేదని, రైతులు తమ తమ స్థలాల్లో నిరసన ప్రదర్శనలతో పాటు స్థానిక అధికారులకు విజ్ఞాపనా పత్రాలను అందజేస్తారని అన్నారు.

ఢిల్లీ పొలిమేరల్లో పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లపై స్పందిస్తూ.. తామసలు ఢిల్లీకే వెళ్లడం లేదని రాకేశ్‌ ‌టికాయత్‌ ‌పేర్కొన్నారు. మరోవైపు నిర్బంధం కోసం అనుసరిస్తున్న చర్యలను తప్పుపట్టారు.

Leave a Reply